నాలుగు భాషల్లో నలుగురు రాణులు..! | 4 Heroines In Queen Remake in 4 Languages | Sakshi
Sakshi News home page

నాలుగు భాషల్లో నలుగురు రాణులు..!

Published Thu, Sep 28 2017 12:59 PM | Last Updated on Thu, Sep 28 2017 2:55 PM

4 Heroines In Queen Remake in 4 Languages

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ ను సౌత్ లో రీమేక్ చేయటం పై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో కంగనా రనౌత్ నటించిన పాత్రలో సౌత్ లో ఎవరి నటిస్తారన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించాలని భావించినా.. అది సాధ్యపడలేదు. దీంతో ఒక్కో భాషల్లో ఒక్కో హీరోయిన్ క్వీన్ పాత్రలో అలరించనుంది.

ఇప్పటికే కన్నడ క్వీన్ షూటింగ్ పూర్తి కావచ్చింది. బటర్ ఫ్లై పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాలో పరుల్ యాదవ్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ వర్షన్ కు దర్శకత్వం వహిస్తున్న రమేష్  అరవింద్ తమిళంలోనే ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. పారిస్ పారిస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ క్వీన్ గా  నటించనుంది. ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

తాజాగా తెలుగు, మలయాళ భాషల విషయంలో కూడా క్లారిటీ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు వర్షన్ లో క్వీన్ గా తమన్నా నటించనుందట. ఈ సినిమాను జాతీయ అవార్డు దర్శకుడు నీలకంఠ డైరెక్ట్ చేయనున్నాడు. జామ్ జామ్ పేరుతో తెరకెక్కుతున్న మలయాళ వర్షన్ లో సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఫేం మంజిమా మోహన్ క్వీన్ పాత్రలో నటించనుంది. అయితే మలయాళ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement