Parul Yadav
-
క్యాబ్‌లో నటికి చేదు అనుభవం
శాండల్‌వుడ్ హీరోయిన్ పరుల్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్‌లో ప్రయాణించిన ఆమె నుంచి విలువైన వాచీలను ఆ క్యాబ్‌డ్రైవర్ దొంగతనం చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరిగి ఆ వస్తువులను ఆమెకు అప్పగించారు. పరుల్ యాదవ్ ఓ వివాహ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సింది ఉంది. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న ఆమె, దంపతుల కోసం విలువైన వాచీల సెట్లను వెంట తీసుకెళ్లారు. మార్గం మధ్యలో ఏదో పని మీద కిందికి దిగిన ఆమె, తిరిగి క్యాబ్ ఎక్కేసరికి ఓ వాచీ సెట్ కనిపించకుండా పోవటం గమనించారు. దిగాక డ్రైవర్‌ను ఈ విషయంపై ఆరా తీయగా, తనకు తెలీదంటూ అతను అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఈ విషయంపై ఆమె ఓలా సపోర్ట్ సెంటర్‌కు కాల్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు పరుల్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరిగి ఆమె వస్తువులను ఆమెకు అందజేశారు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె ట్విటర్లో పోస్టులు చేశారు. వ్యక్తుల గురించి ఎలాంటి నిర్ధారణ లేకుండా డ్రైవర్లుగా ఎలా నియమించుకుంటారంటూ క్యాబ్ సర్వీస్‌పై ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం ఆమె క్వీన్ కన్నడ రీమేక్ బట్టర్‌ఫ్లైలో నటిస్తున్నారు. Dear friends - Please note that @olacabs don't verify their drivers. I just went through a crazy situation where the driver hid a package containing expensive watches bought as gifts for a 50th wedding anniversary when I stepped out of the car for a couple of mins. — Parul Yadav (@TheParulYadav) 26 May 2018 He then pretended we never had the package when dropping me to the airport. @ola_support didn't respond at all initially. Thank God we didn't wait for them and filed a police complaint instantly. I want to let you know that the fab @BlrCityPolice have recovered the watches — Parul Yadav (@TheParulYadav) 26 May 2018 -
సీతాకోక చిలుక షాపింగ్ చేసింది!
‘బటర్ ఫ్లై’ అంటే ఏంటి? సీతాకోక చిలుక! ఎక్కడైనా సీతాకోక చిలుక గాల్లో ఎగురుతుంది కానీ... షాపింగ్ చేస్తుందా? చేయదు. మరి, చేసిందని చెబుతారేంటి? అనుకుంటున్నారా? ఇప్పుడు కన్నడలో ‘బటర్ ఫ్లై’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. హిందీ హిట్ ‘క్వీన్’కి రీమేక్ ఇది. హిందీలో కంగనా రనౌత్ చేసిన పాత్రను కన్నడలో పరుల్ యాదవ్ చేస్తున్నారు. అంటే... ఆమె సీతాకోక చిలుకే కదా! ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. చిత్రీకరణ మధ్యలో ఓ రోజు సెలవు ఇవ్వడంతో షాపింగ్ చేశానని పరుల్ తెలిపారు. ఇంతకీ, ఫ్రాన్స్‌లో షాపింగ్ ఎక్కడ చేశారో తెలుసా? తమన్నా సైట్ సీయింగ్‌కి వెళ్లారు కదా? మొనాకో... అక్కడే! షాపింగ్‌తో పాటు చుట్టుపక్కల అందమైన ప్రదేశాలు కూడా తిరిగొచ్చారట! అంతే కాదండోయ్... శనివారం పరుల్ అమ్మగారి బర్త్‌డే. ఆ సెలబ్రేషన్స్‌లోనూ ఫుల్లుగా సందడి చేశారు. ‘‘నా స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ ఇన్స్పిరేషన్ మా అమ్మే’’ అని పరుల్ సోషల్ మీడియా ద్వారా తెలియ చేశారు. -
నలుగురు రాణులు.. నలభై రోజులు... ఒకటే కహానీ!
కథొక్కటే... కథానాయికలు మాత్రం వేర్వేరు! కంట్రీ ఒక్కటే... కెమెరాలు కదిలే ప్రదేశాలు మాత్రం వేర్వేరు! నిర్మాత ఒక్కరే... దర్శకులు మాత్రం వేర్వేరు! కానీ, అందరూ స్నేహితులే! చిత్రీకరణ పూరై్తన తర్వాత కలిసే చోటు ఒక్కటే! సిన్మా కథ కాదిది... అంతకు మించిన కహానీ! ‘ఒక్క కథ... ఇద్దరు దర్శకులు... నలుగురు రాణులు!’ కథేంటో మీరూ లుక్కేయండి! హిందీ హిట్ ‘క్వీన్’లో కంగనా రనౌత్ కుమ్మేశారు. ఇప్పుడీ సిన్మాను దక్షిణాది భాషల్లో మెడియంటే ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ మలయాళ దర్శకుడు కె.పి. కుమారన్ తనయుడు, నిర్మాత మనుకుమారన్ రీమేక్ చేస్తున్నారు. సారీ... రీమేక్ కాదు, రీమేక్స్! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో! ఇందులో తెలుగు–మలయాళ వెర్షన్స్‌కు ‘షో, మిస్సమ్మ’ సిన్మాల ఫేమ్ నీలకంఠ, తమిళ–కన్నడ వెర్షన్స్‌కు నటుడు రమేశ్ అరవింద్ దర్శకులు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ నాయికలుగా నటిస్తున్నారు. అంటే... కంగనా రనౌత్ పాత్రను ఈ నలుగురూ చేస్తున్నారు. తెలుగులో ‘క్వీన్’గా నటిస్తున్న తమన్నా తమిళ ప్రేక్షకులకు, తమిళ ‘క్వీన్’గా నటిస్తున్న కాజల్ తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్ మంజిమాయే మలయాళ ‘క్వీన్’. తమిళ సినిమాలు కొన్నిటిలో ఆమె నటించారు. కన్నడ ‘క్వీన్’ పరుల్ యాదవ్ ‘కిల్లింగ్ వీరప్పన్’తో తెలుగు–తమిళ ప్రేక్షకులకు తెలుసు. మలయాళ సినిమాలూ చేశారామె. అందువల్ల, ఎవరెలా చేస్తారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది! ఈ ఆసక్తిని పెంచుతూ... ప్యారిస్‌లో మన నలుగురు ‘క్వీన్స్’ ఈ రోజు కంగనా రనౌత్ షూస్‌లో అడుగులేశారు. నాలుగు సినిమాల షూటింగులు నేడు ప్యారిస్‌లో మొదలయ్యాయి. దాదాపు 40 రోజుల పాటు అక్కడే జరుగుతాయి. అయితే... లొకేషన్లు వేర్వేరులెండి! కానీ, షూటింగ్ తర్వాత అందరూ ఉండేది ఓ హోటల్లోనే. ‘ఓ ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అని ఓ సామెత. ఇక్కడ రెండు కాదు... నాలుగు! అదేనండి.. కత్తిలాంటి కథానాయికలు నలుగురున్నారు. ఒకే సినిమాలో నటించకపోయినా ఒకే చోట, ఒకే లొకేషన్లో ఉంటారు కాబట్టి, నలుగురికీ గొడవలు వస్తాయేమో? అనే డౌట్ చాలామందికి ఉంది. నో... అటువంటి చాన్సే లేదంటున్నారు తమన్నా. యాక్చువల్లీ... చిత్రీకరణ ప్రారంభానికి ముందే తమన్నా, కాజల్, మంజిమ, పరుల్ కలసి ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. అందులో సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ‘‘నలుగురు హీరోయిన్లు సేమ్ స్టోరీలో, సేమ్ క్యారెక్టర్లో, సేమ్ కంట్రీలో, సేమ్ టైమ్‌లో నటించడం అరుదైన విషయం కదా! నాకీ సంగతి చెప్పగానే... ఎగ్జయిటయ్యాను. ప్యారిస్‌లో మేం నలుగురమూ ఏమేం చేయాలనే అంశాలను వాట్సాప్ గ్రూప్‌లో డిస్కస్ చేసుకున్నాం’’ అని తమన్నా పేర్కొన్నారు. ఇక, కాజల్ అయితే... ‘‘తమన్నా, నేను ఆల్మోస్ట్ సేమ్ టైమ్‌లో కెరీర్ స్టార్ట్ చేశాం. నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో తమన్నా ఒకరు. అయితే సేమ్ లొకేషన్లో షూట్ చేయడం ఫస్ట్ టైమ్. సరదాగా ఉంటుంది’’ అన్నారు. పరుల్ యాదవ్, మంజిమా మోహన్... ఇద్దరూ తమన్నా, కాజల్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి, సరదా సంగతులు చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నామన్నారు. ఇదండీ... క్వీన్స్ కహానీ!! క్వీన్ కథ... వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది రాణీ మెహ్రా (కంగనా రనౌత్). విజయ్ (రాజ్‌కుమార్ రావ్) తో ఆమె పెళ్లి కుదురుతుంది. హనీమూన్‌కి టికెట్స్ కూడా బుక్ చేస్తారు. అయితే రేపు వివాహం అనగా.. ‘‘నేను ఫారిన్లో పెరిగాను. నా కల్చర్ వేరు. నువ్వు నాకు సరి కాదు’’ అంటాడు విజయ్. పెళ్లాగిపోతుంది. రాణీ కట్టుకున్న కలల మేడ కూలిపోతుంది. చివరికి వేరొకరి కారణంగా తను బాధపడకూడదని నిర్ణయించుకుంటుంది. హనీమూన్ కోసం బుక్ చేసిన టిక్కెట్లతో ఒంటరిగా ప్యారిస్ వెళుతుంది. కొత్త దేశం.. కొత్త మనుషులు కావడంతో కంగారు పడుతుంది. కష్టాల్లో ఉన్న రాణీని వరలక్ష్మీ (లీసా హెడన్) ఆదుకుంటుంది. మెల్లగా రాణీ ఫారిన్ కల్చర్‌కి అలవాటు పడుతుంది. అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటుంది. ఆమె జీవితంలోకి వచ్చిన కొత్త స్నేహితులు ఆమె ఎదుగుదలకు మరింత సహాయం చేస్తారు. రాణీ తనలో ఉన్న టాలెంట్‌కి మెరుగులు దిద్దుకుంటుంది. ఓ సందర్భంలో రాణీ ఫొటోను విజయ్ చూస్తాడు. ఆమెపై ఇష్టం పెంచుకుంటాడు. ప్యాకప్ అనుకున్న మన రిలేషన్‌షిప్‌ను ప్యాచప్ చేసి, కంటిన్యూ చేద్దాం అంటాడు. ఆ తర్వాత కథేంటి? అనేది వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘క్వీన్’ చూసినవారికి తెలిసే ఉంటుంది. -
నాలుగు భాషల్లో నలుగురు రాణులు..!
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ ను సౌత్ లో రీమేక్ చేయటం పై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో కంగనా రనౌత్ నటించిన పాత్రలో సౌత్ లో ఎవరి నటిస్తారన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించాలని భావించినా.. అది సాధ్యపడలేదు. దీంతో ఒక్కో భాషల్లో ఒక్కో హీరోయిన్ క్వీన్ పాత్రలో అలరించనుంది. ఇప్పటికే కన్నడ క్వీన్ షూటింగ్ పూర్తి కావచ్చింది. బటర్ ఫ్లై పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాలో పరుల్ యాదవ్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ వర్షన్ కు దర్శకత్వం వహిస్తున్న రమేష్ అరవింద్ తమిళంలోనే ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. పారిస్ పారిస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ క్వీన్ గా నటించనుంది. ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా తెలుగు, మలయాళ భాషల విషయంలో కూడా క్లారిటీ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు వర్షన్ లో క్వీన్ గా తమన్నా నటించనుందట. ఈ సినిమాను జాతీయ అవార్డు దర్శకుడు నీలకంఠ డైరెక్ట్ చేయనున్నాడు. జామ్ జామ్ పేరుతో తెరకెక్కుతున్న మలయాళ వర్షన్ లో సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఫేం మంజిమా మోహన్ క్వీన్ పాత్రలో నటించనుంది. అయితే మలయాళ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. -
నలుగురు రాణులు.. ఒక్క అమీ
తెలుగులో రాణీగారి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది! అందానికి తోడు కాస్త అమాయకత్వం ఉన్న అమ్మాయి అయితే రాణీగారి రోల్‌కి ఫర్ఫెక్ట్. కత్తియుద్ధం, గుర్రపు స్వారీ వంటివి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే... ఇదేమీ రాజులు, రాజ్యాల సినిమా కాదు. హిందీ హిట్ ‘క్వీన్’ రీమేక్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. రీసెంట్గా పరుల్ యాదవ్ ప్రధాన పాత్రలో కన్నడ ‘క్వీన్’ రీమేక్ షూటింగ్ మొదలైంది. ఈపాటికే తమిళ, తెలుగు రీమేక్స్ షూటింగ్ కూడా మొదలయ్యేది. కానీ, ముందు ఈ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పిన తమన్నా తర్వాత తప్పుకోవడంతో కొత్త కథానాయికను వెతికే పనిలో పడింది చిత్రబృందం. కాజల్ అగర్వాల్ తమిళ ‘క్వీన్’ రీమేక్‌లో నటించే చాన్సుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే... ఆమె ఇంకా సినిమాకు సంతకం చేయలేదని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ కాజల్ ఓకే చెప్పినా... తెలుగు కోసం మరో కథానాయికను వెతకాలి. ఎందుకంటే... నాలుగు భాషల్లో నలుగురు వేర్వేరు కథానాయికలతో వేర్వేరు దర్శకులతో ‘క్వీన్’ రీమేక్‌ను తీయాలనుకుంటున్నారు నిర్మాతలు. అమీ జాక్సన్ మాత్రం నాలుగు భాషల్లో సెకండ్ హీరోయిన్గా హాట్ హాట్ క్యారెక్టర్లో నటించనున్నారు. -
'క్వీన్' రీమేక్ ఆగిపోలేదట..!
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు దర్శకుడు త్యాగరాజన్ క్వీన్ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను స్టార్ చేయానలి భావించిన త్యాగరాజన్, రేవతి దర్శకత్వంలో తమన్నా లీడ్ రోల్లో క్వీన్‌ను రీమేక్ చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంలో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. కానీ త్యాగరాజన్ మాత్రం తమన్నా తప్పించి క్వీన్ రీమేక్ ను ముందుకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ముందుగా కన్నడ రీమేక్ ను ప్రారంభిస్తున్నాడు. పరుల్ యాదవ్ లీడ్ రోల్ లో రమేష్ అరవింద్ దర్శకత్వంలో సినిమా ప్రారంభిస్తున్నాడు. తరువాత తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.