కన్నడ నటి పరుల్ యాదవ్
శాండల్‌వుడ్ హీరోయిన్ పరుల్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్‌లో ప్రయాణించిన ఆమె నుంచి విలువైన వాచీలను ఆ క్యాబ్‌డ్రైవర్ దొంగతనం చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరిగి ఆ వస్తువులను ఆమెకు అప్పగించారు.
పరుల్ యాదవ్ ఓ వివాహ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సింది ఉంది. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న ఆమె, దంపతుల కోసం విలువైన వాచీల సెట్లను వెంట తీసుకెళ్లారు. మార్గం మధ్యలో ఏదో పని మీద కిందికి దిగిన ఆమె, తిరిగి క్యాబ్ ఎక్కేసరికి ఓ వాచీ సెట్ కనిపించకుండా పోవటం గమనించారు. దిగాక డ్రైవర్‌ను ఈ విషయంపై ఆరా తీయగా, తనకు తెలీదంటూ అతను అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు.
ఈ విషయంపై ఆమె ఓలా సపోర్ట్ సెంటర్‌కు కాల్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు పరుల్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరిగి ఆమె వస్తువులను ఆమెకు అందజేశారు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె ట్విటర్‌లో పోస్టులు చేశారు. వ్యక్తుల గురించి ఎలాంటి నిర్ధారణ లేకుండా డ్రైవర్‌లుగా ఎలా నియమించుకుంటారంటూ క్యాబ్ సర్వీస్‌పై ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం ఆమె క్వీన్ కన్నడ రీమేక్ బట్టర్‌ఫ్లైలో నటిస్తున్నారు.
Dear friends - Please note that @olacabs don't verify their drivers. I just went through a crazy situation where the driver hid a package containing expensive watches bought as gifts for a 50th wedding anniversary when I stepped out of the car for a couple of mins.
— Parul Yadav (@TheParulYadav) 26 May 2018
He then pretended we never had the package when dropping me to the airport. @ola_support didn't respond at all initially. Thank God we didn't wait for them and filed a police complaint instantly. I want to let you know that the fab @BlrCityPolice have recovered the watches
— Parul Yadav (@TheParulYadav) 26 May 2018
Comments
Please login to add a commentAdd a comment