Karnataka Bengaluru Man Held Killing Live In Partner Staging As Suicide - Sakshi
Sakshi News home page

వయసులో మూడేళ్లు చిన్నోడితో లివ్ ఇన్ రిలేషన్.. పెళ్లి చేసుకోమని అడిగితే దారుణంగా..

Published Sat, Dec 17 2022 2:59 PM | Last Updated on Sat, Dec 17 2022 3:21 PM

Karnataka Bangalore Man Held Killing Live In Partner Staging As Suicide - Sakshi

బెంగళూరు: ఆమె వయసు 27 ఏళ్లు.. తన కంటే మూడేళ్లు చిన్నోడికి దగ్గరైంది. ఇద్దరు కలిసి సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. తనను పెళ్లి చేసుకోమని అడిగితే.. చెల్లి పెళ్లి అయ్యాక చేసుకుందామని అతను చెప్పాడు. ఇలా మూడేళ్లు గడిచింది. ఇప్పటికే ఆలస్యమవుతోంది, తనను పెళ్లి చేసుకోవాలని మహిళ యువకుడిని తరచూ అడగుతోంది. దీంతో విసిగెత్తిపోయిన అతడు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం గొంతునులుమి హత్య చేశాడు.

అయితే ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మహిళ మృతదేహాం మెడకు తాడు కట్టి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశాడు. మరునాడు ఆస్పత్రికి ఫోన్ చేసి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించిన వైద్యులకు ఆమె మెడపై గాయాలు కన్పించాయి. దీంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

డిసెంబర్ 6న కర్ణాటక బెంగళూరులోని సింగసంద్రలో ఈ ఘటన జరిగింది. మృతురాలి పేరు సునీత. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి  బెంగళూరులో నివసిస్తోంది. నిందుతుడి పేరు ప్రశాంత్. ఓ ఈ కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే సునీతకు అప్పటికే వివాహమై విడాకులు తీసుకుందని పోలీసులు తెలిపారు. మొదట తన గుర్తింపు దాచుకుందని, చుట్టపక్కల వారికి దీపుగా పరిచయం చేసుకుందని వివరించారు. ప్రశాంత్ కూడా ఈమె ఇంటి పక్కనే నివసిస్తాడని, ఈ క్రమంలోనే ఇద్దరు దగ్గరయ్యారని వివరించారు.
చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్‌ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement