live in partner
-
ఒక ప్రేయసి.. 50 ముక్కలు!
జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా.. మృతురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నరేష్ బెంగ్రా అనే యువకుడు గంగి కుమారి(24) అనే యువతితో గత రెండేళ్లుగా సహ జీవనంలో ఉన్నారు. వీరిద్దరూ తమిళనాడులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.నరేష్ బెంగ్రా తన ప్రియురాలు గంగి కుమారికి తెలియకుండా ఖుంటిలో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఏమి తెలియనట్లు మళ్లీ తమిళనాడు వచ్చి గంగితో కలిసి జీవించేవాడు. ఇటీవల ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నవంబర్ 9న ఇద్దరు జార్ఖండ్‌లోని ఖుంటికి తిరిగి వచ్చారు. యువతిని తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే విసిరేశాడు.నవంబర 24న యువతి శరీరంలోని ఓ భాగాన్ని కుక్క తింటూ కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అటవీ ప్రాంతం నుంచి మరి కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలో గంగి వస్తువులు, ఆమె ఆధార్ కార్డు, ఫోటోతో సహా, ఆమె బ్యాగ్‌ని కూడా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు నరేశ్ బెంగ్రా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాధితురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని నరికివేసినట్లు అతను ఒప్పుకున్నాడు. -
రిజిస్ట్రేషన్ లేకుండా ‘లివ్ ఇన్’లో ఉంటే జైలుకే?
ఉత్తరాఖండ్.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసే తొలి రాష్ట్రం కానుంది. దీంతో ఆ రాష్ట్రంలో పలు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ‘లివ్-ఇన్’లో ఉంటూ, ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న జంట ఈ రిజిస్ట్రేషన్‌తో స్వీకరించే రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యాన్ని పొందగలుగుతారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల సీఎం ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూసీసీ ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు. ‘యూసీసీ’లో ‘లివ్-ఇన్’ సంబంధం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వయోజన పురుషుడు, ఒక వయోజన మహిళ మాత్రమే లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండగలుగుతారు. అలాంటివారు ఇప్పటికే వివాహం చేసుకోకూడదు లేదా మరొకరితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో లేదా నిషేధిత సంబంధాలలో ఉండకూడదు. లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని అందజేస్తారు. ఆ రశీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు. అయితే ‘లివ్ ఇన్’ కోసం రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయించుకున్న జంట ఆ విషయాన్ని తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. ‘లివ్-ఇన్’ రిలేషన్షిప్లో ఉంటున్నవారు విడిపోవాలనుకున్నా, తిరిగి ఆ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
పిల్లలున్నా అతడితో లవ్ ట్రాక్.. చివరకు..
ఇటీవలి కాలంలో లివింగ్ పార్ట్నర్స్ దారుణ హత్యకు గురవుతున్న వార్తలు చాలానే చూశాం. ఢిల్లీ శ్రద్దావాకర్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం, దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఆమెను వంచించి.. చివరకు దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఆమె డెడ్‌బాడీని సూటుకేసులో పెట్టి బయటపడేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన సినీ మేకప్ ఆర్టిస్ నైనా మహత్(29)కు మనోహర్ శుక్లా(43)తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో శారీరకంగా కూడా వీరద్దరూ దగ్గరయ్యారు. అయితే, మనోహర్‌కు అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ.. నైనాతో సన్నిహితంగా మెలిగాడు. నైనా కూడా క్రమంగా అతనికి దగ్గరైంది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ తమ ప్రేమాయణం కొనసాగించారు. వీరి వ్యవహరం ఇరువురు కుటుంబాల సభ్యులకు తెలియడంతో ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వీరు.. తన బంధాన్ని కొనసాగించారు. నైనా ఫోన్ ఆఫ్.. ఇదిలా కొనసాగుతున్న క్రమంలో.. నైనా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఆమె కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేసింది. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆఫ్ రావడంతో నైనా కుటుంబ సభ్యులు ఆగస్టు 12వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. నైనా ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, తమకేదో అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నైనా ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడే ఉన్న సీసీటీవీని పరిశీలించగా.. మనోహర్‌తో పాటు అతని భార్య సూట్‌కేసుతో బయలుదేరడాన్ని గుర్తించారు. గుజరాత్ సరిహద్దుల్లో డెడ్‌బాడీ.. ఇక, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నైనా లవర్ శుక్లాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెల్లడించాడు. నైనాతో తన సంబంధం గురించి తన భార్యకు తెలిసినప్పటి నుంచి ఆమెకు బ్రేకప్ చెప్పినట్టు తెలిపాడు. కానీ.. ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చిందన్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే శుక్లాపై అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన టార్చర్ భరించలేకనే నైనాను చంపేసిన్నట్టు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం, నైనా డెడ్‌బాడీ ఉన్న సూట్‌కేసును పోలీసులు గుజరాత్ బోర్డర్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Manohar Shukla (43) KiIIed LIVE-IN Partner Naina Mahat (28) stuffed her body in SUITCASE & dumped her body in Gujrat with the help of his wife Shukla visited Naina's society but left the place with suitcase. It created suspicion Shukla said: Naina was forcing him to marry her pic.twitter.com/QAZVzmHeNf — Mohammad Nawaj (@NawazJ78) September 13, 2023 ఇది కూడా చదవండి: ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య -
సహజీవనం పేరుతో సీజన్కొక భాగస్వామి. ఇదేం పధ్ధతి?
లక్నో: సహజీవనం పేరిట పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేసి భారత సంస్కృతిని వివాహ వ్యవస్థను నాశనం చేస్తోందని వ్యాఖ్యానించింది అలహాబాద్ హైకోర్టు. ఈ సందర్బంగా సీజన్ల వారీగా భాగస్వాములను మార్చుకుంటూ పోవడం ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదని తెలిపింది కోర్టు. అన్నీ అయిపోయాక.. అలహాబాద్‌లో అద్నాన్ అనే ఓ వ్యక్తి పరస్పర అంగీకారంతో యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన ఓ యువతితో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ యువతి అనూహ్యంగా గర్భం దాల్చడంతో అద్నాన్ పెళ్ళికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించగా విచారణ సమయంలో అలహాబాద్ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది. అంత సులువు కాదు.. ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ కల్పించినంత భద్రత కానీ సామాజిక అంగీకారం కానీ సహజీవనం కల్పించలేదని తెలిపారు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థ్. దీర్ఘకాలిక పరిణామాలపైఅవగాహనలేక యువత ఇలాంటి తప్పటడుగు వేస్తోంది. వివాహ వ్యవస్థ మనుగడలో లేని దేశాల్లో సహజీవనం సర్వసాధారణంగా మారిపోయింది కానీ ఇపుడు వారు ఈ సమస్య నుండి బయటపడి వివాహ వ్యవస్థను కాపాడటానికి నానా అవస్థలు పడుతున్నాయని అన్నారు. అయినా సీజన్ల వారీగా భాగస్వామిని మార్చడం సమాజపురోగతికి చేటు అని తెలిపారు. ఇది కూడా చదవండి: దీప్తిది హత్యే! కొలిక్కి వచ్చిన కోరుట్ల టెక్కీ కేసు -
‘లివ్ ఇన్’లో ఉండాలంటే.. ఆ యువతి కండీషన్లకు నెటిజన్లు గగ్గోలు!
ఒక యువతి తన పార్ట్నర్తో లివ్ ఇన్‌లో ఉండేందుకు అతని ముందు ఉంచిన షరతుల లిస్టు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీటినన్నింటినీ నెరవేరుస్తానని హామీ ఇస్తేనే లివ్ ఇన్‌లో ఉంటానని, లేని పక్షంలో బైబై టాటా చేప్పేస్తానని బెదిరించింది. ఎవరైనా మరొకరికితో కలసి ఉండాలంటే కాస్తయినా సద్దుకుపోవాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. స్కూలులో స్నేహితులతో, కాలేజీలో రూమ్ మేట్స్‌తో సద్దుకుపోతూ కలసిమెలసి ఉండటం అనేది అందరికీ అనుభవమే. అయితే ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు లేదా పెళ్లి ఊసే లేకుండా లివ్ ఇన్ రిలేషన్లో యువతీయువకులు ఉంటున్నారు. ఇలా ఉంటున్నవారిలో చాలామంది పరస్పరం అడ్జెస్ట్ కాలేక విడిపోతున్నారు. వివాహం అయినవారు ఒకరి ఇష్టాఇష్టాలు, అభిరుచులు ఎలా ఉన్నా ఒకరితో మరొకరు అడ్జెస్ట్ అవుతున్నారు. అలాగే భాగస్వామి కోసం తమ ఇష్టాఇష్టాలను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పటి యువత భాగస్వామితో అస్సలు అడ్జెస్ అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. తాజాగా ఒక లివ్ ఇన్ జంటకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లివ్ ఇన్‌లో ఉండేందుకు.. ‘ది మిర్రర్’ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన పార్ట్నర్తో పాటు లివ్ ఇన్‌లో ఉండేందుకు కొన్ని షరతులు విధించింది. ఈ షరతులకు అంగీకరించకపోతే బ్రేకప్ చెప్పేస్తానని బెదిరించింది. ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు లివ్ ఇన్ కోసం ఉంచిన షరతులను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను విధించిన నియమాలను తాను కూడా పాటిస్తానని, అదేవిధంగా తన బాయ్ ఫ్రెండ్ కూడా పాటించాలని స్పష్టం చేసింది. యువతి పెట్టిన నిబంధనలివే.. ఆ యువతి విధించిన కండీషన్లలో మొదటిది తన బాయ్ ఫ్రెండ్ అతని సామాన్లతో సహా విడిగా వేరే గదిలో ఉండాలి. రెండవ నియమం.. డైనింగ్ టేబుల్ మొదలుకొని ఇంటిలో ఎక్కడా చెత్తపోయకూడదు. అపరిశుభ్రంగా మార్చకూడదు. మూడవ నియమం.. ఇంటిలోని న్యూస్ పేపర్లు, ఇతర కాగితాలు సరిగా సద్దుకొని అతని గదిలోనే ఉంచుకోవాలి. ఈ షరతులను చూసి నెటిజన్లు కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. ఒక యూజర్.. లివ్ ఇన్‌లో ఉండేందుకు ఎటువంటి షరతులు ఉండకూడదని రాయగా,మరో యూజర్ లివ్ ఇన్‌లో ఇలాంటి తీరు అస్సలు పనికిరాదని రాశారు. ఇంకో యూజర్ సరైన జీవితం గడిపేందుకు ఆ యువతి పెట్టిన కండీషన్లలో తప్పేముందని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు! -
ఛాతీలో చాకు దిగబడి లివ్ ఇన్ పార్ట్నర్ మృతి.. వాటర్ మిలన్ కట్ చేస్తుండగా..
సందీప్, పూజ నాలుగేళ్లుగా లివ్ ఇన్‌లో ఉన్నారు. సందీప్ హరియాణాలోని హిసార్ ప్రాంతానికి చెందినవాడు. పూజ ఢిల్లీకి చెందిన యువతి. పూజ సిఎస్ఎస్బీలో సిపాయిగా విధులు నిర్వహిస్తోంది. ఆమె చికిత్స కోసం సందప్ను ఆసుపత్రికి తీసుకు వచ్చింది. సందీప్ ఛాతీలో చాకుతో అయిన తీవ్ర గాయం ఉంది. చికిత్స పొందుతూ సందీప్ మృతి చెందాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఛాతీలో చాకు దిగబడిన నేపధ్యంలో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకు వచ్చిన ఒక యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ యువకుడిని అతని లివ్ ఇన్ పార్ట్నర్ ఆసుపత్రికి తీసుకువచ్చింది. అనుమానాస్పద స్థితిలో ఆ యువకుడు మృతిచెందడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా భావిస్తూ, అతని లివ్ఇన్ పార్ట్నర్ను అరెస్టు చేసి, పలు విధాలుగా ప్రశ్నిస్తున్నారు. డిఎల్ఎప్ పేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న 35 ఏళ్ల సందీప్‌ను చికిత్స కోసం నారాయణ సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సంద్భంగా సందీప్ లివ్ ఇన్ పార్ట్నర్ పూజాశర్మ(25) పోలీసులతో మాట్లాడుతూ వాటర్ మిలన్ కట్ చేస్తుండగా సందీప్ ఛాతీలో చాకు దిగబడిందని తెలిపింది. దీంతో అతను తీవ్రంగా గయాపడ్డాడని, తాను వెంటనే ఆసుపత్రికి తీసుకు వచ్చానని, అయినా ఫలితం లేకపోయిందని తెలిపింది. తాను, సందీప్ గత నాలుగేళ్లుగా లివ్ ఇన్‌లో ఉంటున్నామని, సందీప్ వాహనాల కొనుగోలు- అమ్మకాల వ్యాపారం చేస్తుంటాడని తెలిపింది. కాగా సమాచారం తెలిసిన వెంటనే సందీప్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఉదంతం గురించి ఎసీపీ డీఎల్ఎఫ్ వికాస్ కౌశిక్ మాట్లాడుతూ సందీప్ వాటర్ మిలన్ కట్ చేస్తుండగా, చాకు గుచ్చుకుని చనిపోయాడని పూజ చెబుతున్నదని అన్నారు. అయితే తాము పూజ చెబుతున్న దానిలో నిజా నిజాలు తేల్చేందుకు ఆమెను ప్రశ్నిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: మహిళపై లైంగిక దాడి.. అడ్డుకుందని రైలులో నుంచి తోసివేత! -
దారుణం..నరరూప రాక్షసుడి చేతిలో ప్రియురాలు..
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు తరహాలోనే.. ఘోరం జరిగింది. సహజీవనం చేస్తున్న తన ప్రియురాలిని హత్యచేసి, ఆ మృతదేహాన్ని చైన్షా (చెట్లను నరికే యంత్రం) సాయంతో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేశాడు నిందితుడు. అవి వాసన రాకుండా ఉండేందుకు వాటిని ప్రెజర్ కుక్కర్లో వేసి ఉడికించాడు.ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం పట్టణంలోని మీరా రోడ్డు వద్దనున్న గీతా-ఆకాశ్‌దీప్ సొసైటీలో చోటుచేసుకుంది. సొసైటీలోని ఏడవ అంతస్థులో 56 ఏళ్ల మనోజ్ సహానీ 36 ఏళ్ల సరస్వతి వైద్యతో సహజీవనంలో ఉన్నాడు. వీరు చాలాకాలంగా కలిసే ఉంటున్నారు. అయితే కొద్దిరోజులుగా వీరి ఫ్లాట్ నుంచి దుర్వాసన రాసాగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే పోలీసులు సొసైటీకి చేరుకుని, మనోజ్ ఇంటి తలుపు తట్టారు. తలుపులు తీయగానే విపరీతమైన దుర్వాసన వెలువడింది. ఆ ఇంటిలో పోలీసులు తనిఖీ చేపట్టగా, వారికి మహిళ మృతదేహపు ముక్కలు కనిపించాయి. పోలీసులు వెంటనే మనోజ్‌ను అరెస్ట్ చేసి, అతనిని ప్రశ్నించగా అవి తన ప్రియురాలు సరస్వతి మృతదేహపు ముక్కలు అని తెలిపాడు. పోలీసుల విచారణలో మనోజ్ తనకు సరస్వతికి గొడవ జరిగిందని, దీంతో ఆగ్రహంతో ఆమెను హత్య చేశానని తెలిపాడు. ఆ తరువాత మార్కెట్‌కు వెళ్లి చైన్షా కొనుగోలు చేసి, దానితో మృతదేహాన్ని ముక్కలు చేశానని, తరువాత వాటిని కుక్కర్లో ఉడికించానని తెలిపాడు. సాక్ష్యాధారాలు మాయం చేసేందుకే మనోజ్ ఈ పని చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఆ మృతదేహపు ముక్కలను సమీకరించిన పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం తరలించారు. సంఘటనా స్థలంలో ఫారెన్సిక్ బృందం కూడా తనిఖీలు నిర్వహించి, పలు ఆధారాలు సేకరించింది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఫ్లాట్‌కు సీలు వేసిన పోలీసులు మనోజ్‌ను పశ్నిస్తున్నారు. చదవండి: ‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి -
25 ఏళ్లుగా సహజీవనం.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన మహిళ.. కోపంతో ఆమెపై..
ముంబై: 25 ఏళ్లుగా తనతో సహజీవనం చేసిన మహిళపై యాసిడ్ దాడి చేశాడు 62 ఏళ్ల వ్యక్తి. ఆమె ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో మహిళకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్ర ముంబైలోని గిర్గావ్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు మహేశ్ పూజారి. బాధితురాలితో 25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లై భర్త నుంచి విడిపోయింది. మహేశ్ కూడా ఆమె భార్య నుంచి విడిపోయాడు. దీంతో ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్‌ను తన ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది మహిళ. రెండు రోజుల తర్వాత అతడు ఇంటికి యాసిడ్ బాటిల్‌తో తిరిగివచ్చాడు. శుక్రవారం వేకువజామున 5:30 గంటల సమయంలో ఆమె నీళ్లు తోడుకునేందుకు బయటకు రాగా యాసిడ్ చల్లాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. పోలీసులు నిందితుడ్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. చదవండి: క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం రద్దు.. -
వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే..
బెంగళూరు: ఆమె వయసు 27 ఏళ్లు.. తన కంటే మూడేళ్లు చిన్నోడికి దగ్గరైంది. ఇద్దరు కలిసి సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. తనను పెళ్లి చేసుకోమని అడిగితే.. చెల్లి పెళ్లి అయ్యాక చేసుకుందామని అతను చెప్పాడు. ఇలా మూడేళ్లు గడిచింది. ఇప్పటికే ఆలస్యమవుతోంది, తనను పెళ్లి చేసుకోవాలని మహిళ యువకుడిని తరచూ అడగుతోంది. దీంతో విసిగెత్తిపోయిన అతడు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం గొంతునులుమి హత్య చేశాడు. అయితే ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మహిళ మృతదేహాం మెడకు తాడు కట్టి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశాడు. మరునాడు ఆస్పత్రికి ఫోన్ చేసి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించిన వైద్యులకు ఆమె మెడపై గాయాలు కన్పించాయి. దీంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 6న కర్ణాటక బెంగళూరులోని సింగసంద్రలో ఈ ఘటన జరిగింది. మృతురాలి పేరు సునీత. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బెంగళూరులో నివసిస్తోంది. నిందుతుడి పేరు ప్రశాంత్. ఓ ఈ కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సునీతకు అప్పటికే వివాహమై విడాకులు తీసుకుందని పోలీసులు తెలిపారు. మొదట తన గుర్తింపు దాచుకుందని, చుట్టపక్కల వారికి దీపుగా పరిచయం చేసుకుందని వివరించారు. ప్రశాంత్ కూడా ఈమె ఇంటి పక్కనే నివసిస్తాడని, ఈ క్రమంలోనే ఇద్దరు దగ్గరయ్యారని వివరించారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని ప్రియురాలి హత్య
గాంధీనగర్/అహ్మదాబాద్: అతడు పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. వివాహమయి భార్య ఉంది. అయినప్పటికి మరో మహిళను ప్రేమించానన్నాడు.. ఆమెతో కలిసి సహజీవనం చేయసాగాడు. కానీ ప్రియురాలు అతడిని భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయసాగింది. భార్యకు విడాకులు ఇస్తే.. ఆమెకు భరణంగా భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని భావించి ప్రియురాలిని హత్య చేశాడు. గుజరాత్, అహ్మదాబాద్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు.. అహ్మదాబాద్‌కు చెందిన అజయ్ దేశాయ్ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2017లో అతడికి వివాహం అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అతడికి స్వీటి పాటిల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం చేయసాగారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా స్వీటి ఒత్తిడి చేయడంతో ఏడాది క్రితం అజయ్ ఓ గుడిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ స్వీటి మాత్రం తన వివాహం చట్టబద్దం చేసుకోవాలని భావించింది. దాని కోసం అజయ్‌ను అతడి భార్యకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయసాగింది స్వీటి. ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. స్వీటి కోరినట్లు భార్యకు విడాకులు ఇస్తే.. భరణంగా ఆమెకు 25 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. అంత డబ్బు ఇవ్వడం ఇష్టం లేని అజయ్.. స్వీటిని అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలో జూన్ 4న ఇదే విషయం మీద స్వీటి-అజయ్‌ల మధ్య ప్రారంభమైన గొడవ ముదిరింది. ఆ కోపంలో అజయ్.. స్వీటిని చంపేయాలని భావించాడు. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత స్వీటి మృతదేహాన్ని తన స్నేహితుడు కిరిట్సింగ్ జడేజాకి చెందిన హోటల్ ప్రాంగణంలో పూడ్చి పెట్టాడు. ఇక జూన్ 5న స్వీటి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణలో అజయ్ చేసిన దారుణం వెలుగు చూసింది. ప్రసుత్తం అజయ్ వడోదర పోలీసులు కస్టడీలో ఉన్నాడు. -
దారుణంగా మహిళను 32సార్లు పొడిచి..
నోయిడా: తనతో సహజీవనం చేస్తున్న మహిళను అతి దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. వినేందుకే ఒళ్లుగగుర్పొడిచే తీరుగా ఆమెను హత్య చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32సార్లు కత్తితో పొడిచిపొడిచి చంపేశాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వరుణ్ గోయల్(27)కు నోయిడాలోని సెక్టార్ 63లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మహిళకు పరిచయం అయింది. ఘజియాబాద్ లోని ఇందిరాపురం శక్తి ఖండ్ ప్రాంతానికి చెందిన ఇతడు జిమ్ మాస్టర్ గా పనిచేస్తుండగా ఆమె జిమ్ వెళ్లడం ద్వారా పరిచయమేర్పడింది. ఆ పరిచయం చనువుగా మారి గత ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆ మహిళ ఉంటున్న అపార్ట్ మెంట్లోనే ఉంటున్నారు. అయితే, పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ఒత్తిడి చేయడంతో అందుకు అతడు నిరాకరించాడు. ఈ క్రమంలో వారిమధ్య ఘర్షణ ముదిరి అతడు వంటగదిలోని కత్తితో 32సార్లు పొడిచి హత్య చేశాడు. -
అక్కను చేరదీసి.. చెల్లెలిని చెరిచాడు!
ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. ఇప్పుడిప్పుడే టీనేజిలోకి ప్రవేశిస్తున్న ఆమె చెల్లెలిపై కన్నేసి.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా బసారి గ్రామంలో జరిగింది. లీలారామ్ జాట్ అనే వ్యక్తి ఆహారధాన్యాల దుకాణంలో కూలీగా పనిచేస్తుంటాడు. అతడు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే.. వాళ్లతో పాటు ఉండే ఆ మహిళ చెల్లెలు (13)పై అతడి కన్ను పడింది. ఈనెల ఆరోతేదీన అతడు ఆ బాలికపై అత్యాచారం చేస్తుండగా పొరుగునుండే ఓ మహిళ చూసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. లీలారామ్ ఆ బాలికపై అత్యాచారం చేయడమే కాక.. ఆమెను బయటకు కూడా వెళ్లనివ్వలేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఐపీసీతో పాటు పోక్సో చట్టాల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం లీలారామ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళకు కూడా ఈ నేరంలో భాగం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.