రిజిస్ట్రేషన్‌ లేకుండా ‘లివ్‌ ఇన్‌’లో ఉంటే జైలుకే? | Without Registration Live in Relationship Will be Jailed | Sakshi
Sakshi News home page

Live in Relationship: రిజిస్ట్రేషన్‌ లేకుండా ‘లివ్‌ ఇన్‌’లో ఉంటే జైలుకే?

Published Tue, Feb 6 2024 1:39 PM | Last Updated on Tue, Feb 6 2024 2:51 PM

Without Registration Live in Relationship Will be Jailed - Sakshi

ఉత్తరాఖండ్‌.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసే తొలి రాష్ట్రం కానుంది. దీంతో ఆ రాష్ట్రంలో పలు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవలసి ఉంటుంది. 

‘లివ్-ఇన్’లో ఉంటూ, ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. ‘లివ్‌ ఇన్‌’లో ఉంటున్న జంట ఈ రిజిస్ట్రేషన్‌తో స్వీకరించే రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యాన్ని పొందగలుగుతారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల సీఎం ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూసీసీ ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు. 

‘యూసీసీ’లో ‘లివ్-ఇన్’ సంబంధం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వయోజన పురుషుడు, ఒక వయోజన మహిళ మాత్రమే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండగలుగుతారు. అలాంటివారు ఇప్పటికే వివాహం చేసుకోకూడదు లేదా మరొకరితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో లేదా నిషేధిత సంబంధాలలో ఉండకూడదు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న ప్రతి వ్యక్తి  తప్పనిసరిగా రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని అందజేస్తారు. ఆ రశీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు. అయితే ‘లివ్‌ ఇన్‌’ కోసం రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయించుకున్న జంట ఆ విషయాన్ని తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాలి.

‘లివ్ ఇన్’లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు.  అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. ‘లివ్-ఇన్’ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నవారు విడిపోవాలనుకున్నా, తిరిగి ఆ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement