25 ఏళ్లుగా సహజీవనం.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన మహిళ.. కోపంతో ఆమెపై.. | Man Attack Live In Partner After 25 Years Maharashtra Mumbai Girgaon | Sakshi
Sakshi News home page

25 ఏళ్లుగా సహజీవనం.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన మహిళ.. కోపంతో ఆమెపై..

Published Sat, Jan 14 2023 8:30 PM | Last Updated on Sat, Jan 14 2023 8:30 PM

Man Attack Live In Partner After 25 Years Maharashtra Mumbai Girgaon - Sakshi

ముంబై: 25 ఏళ్లుగా తనతో సహజీవనం చేసిన మహిళపై యాసిడ్ దాడి చేశాడు 62 ఏళ్ల వ్యక్తి. ఆమె ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో మహిళకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

మహారాష్ట్ర ముంబైలోని గిర్‌గావ్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు మహేశ్ పూజారి. బాధితురాలితో 25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లై భర్త నుంచి విడిపోయింది. మహేశ్ కూడా ఆమె భార్య నుంచి విడిపోయాడు. దీంతో ఇద్దరు కలిసి జీవిస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్‌ను తన ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది మహిళ. రెండు రోజుల తర్వాత అతడు ఇంటికి యాసిడ్ బాటిల్‌తో తిరిగివచ్చాడు. శుక్రవారం వేకువజామున 5:30 గంటల సమయంలో ఆమె నీళ్లు తోడుకునేందుకు బయటకు రాగా యాసిడ్ చల్లాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది.  పోలీసులు నిందితుడ్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు.
చదవండి: క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‍సభ సభ్యత్వం రద్దు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement