అక్కను చేరదీసి.. చెల్లెలిని చెరిచాడు! | Minor girl raped by sister's live-in partner | Sakshi
Sakshi News home page

అక్కను చేరదీసి.. చెల్లెలిని చెరిచాడు!

Published Tue, Sep 9 2014 4:04 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

అక్కను చేరదీసి.. చెల్లెలిని చెరిచాడు! - Sakshi

అక్కను చేరదీసి.. చెల్లెలిని చెరిచాడు!

ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. ఇప్పుడిప్పుడే టీనేజిలోకి ప్రవేశిస్తున్న ఆమె చెల్లెలిపై కన్నేసి.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్లోని జైపూర్ జిల్లా బసారి గ్రామంలో జరిగింది. లీలారామ్ జాట్ అనే వ్యక్తి ఆహారధాన్యాల దుకాణంలో కూలీగా పనిచేస్తుంటాడు. అతడు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే.. వాళ్లతో పాటు ఉండే ఆ మహిళ చెల్లెలు (13)పై అతడి కన్ను పడింది. ఈనెల ఆరోతేదీన అతడు ఆ బాలికపై అత్యాచారం చేస్తుండగా పొరుగునుండే ఓ మహిళ చూసింది.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. లీలారామ్ ఆ బాలికపై అత్యాచారం చేయడమే కాక.. ఆమెను బయటకు కూడా వెళ్లనివ్వలేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఐపీసీతో పాటు పోక్సో చట్టాల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం లీలారామ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళకు కూడా ఈ నేరంలో భాగం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement