దారుణంగా మహిళను 32సార్లు పొడిచి.. | Woman stabbed 32 times by live-in partner in Noida | Sakshi
Sakshi News home page

దారుణంగా మహిళను 32సార్లు పొడిచి..

Published Thu, Jul 14 2016 11:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

దారుణంగా మహిళను 32సార్లు పొడిచి..

దారుణంగా మహిళను 32సార్లు పొడిచి..

నోయిడా: తనతో సహజీవనం చేస్తున్న మహిళను అతి దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. వినేందుకే ఒళ్లుగగుర్పొడిచే తీరుగా ఆమెను హత్య చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32సార్లు కత్తితో పొడిచిపొడిచి చంపేశాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వరుణ్ గోయల్(27)కు నోయిడాలోని సెక్టార్ 63లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మహిళకు పరిచయం అయింది.

ఘజియాబాద్ లోని ఇందిరాపురం శక్తి ఖండ్ ప్రాంతానికి చెందిన ఇతడు జిమ్ మాస్టర్ గా పనిచేస్తుండగా ఆమె జిమ్ వెళ్లడం ద్వారా పరిచయమేర్పడింది. ఆ పరిచయం చనువుగా మారి గత ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఆ మహిళ ఉంటున్న అపార్ట్ మెంట్లోనే ఉంటున్నారు. అయితే, పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ఒత్తిడి చేయడంతో అందుకు అతడు నిరాకరించాడు. ఈ క్రమంలో వారిమధ్య ఘర్షణ ముదిరి అతడు వంటగదిలోని కత్తితో 32సార్లు పొడిచి హత్య చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement