బెంగళూరుకు ప్రజ్వల్‌ రేవణ్ణ రాక.. కర్ణాటకలో పరిస్థితేంటి? | MP Prajwal Revanna Expected To Land Bengaluru On May 31, Know What Is The Situation In Karnataka | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు ప్రజ్వల్‌ రేవణ్ణ రాక.. కర్ణాటకలో పరిస్థితేంటి?

Published Wed, May 29 2024 11:43 AM | Last Updated on Wed, May 29 2024 12:57 PM

MP Prajwal Revanna Expected To Land Bengaluru On May 31

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైగింక వేధింపుల కేసు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక పరిణామం  చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజల్వ్‌ రేవణ్ణ మే 31వ తేదీన తెల్లవారుజామున కర్ణాటక చేరుకోనున్నట్టు తెలుస్తోంది. రేపు (మే30న) జర్మనీ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. అయితే, ఎయిర్‌పోర్టులోనే ప్రజ్వల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా కర్ణాటక నుంచి పోటీ చేసిన ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు సోషల్‌ మీడియాలో బయటకు వచ్చాయి. అనంతరం, బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదైంది. అంతకుముందు.. ఏప్రిల్‌ 27నే ప్రజ్వల్‌ దేశం విడిచి జర్మనీకి వెళ్లిపోయారు.

 

 

అయితే, ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం రాజకీయంగా విమర్శలకు దారి తీయడంతో రేవణ్ణను భారత్‌కు రావాలని కుటుంబ సభ్యులు కోరారు. అలాగే, ఆయనను భారత్‌కు రప్పించాలని కర్ణాటక రాజకీయ నేతలు కూడా ప్రధాని మోదీని కోరారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తాను.. కేసు విచారణకు సహకరిస్తానని, శుక్రవారం (మే 31న) ‘సిట్‌’ ముందు వ్యక్తిగతంగా హాజరవుతాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నాపై తప్పుడు కేసులు బనాయించారు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమే. ఇప్పటికే కుంగుబాటుకు లోనయ్యాను. అయితే, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది’ అని కామెంట్స్‌ చేశారు.


మరోవైపు.. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అసభ్యకర వీడియోల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అరెస్ట్‌ చేసింది. వారిని నవీన్‌ గౌడ, చేతన్‌గా గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement