నలుగురు రాణులు.. ఒక్క అమీ | Hindi hit 'Queen' remake | Sakshi
Sakshi News home page

నలుగురు రాణులు.. ఒక్క అమీ

Published Tue, Jun 13 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

నలుగురు రాణులు.. ఒక్క అమీ

నలుగురు రాణులు.. ఒక్క అమీ

తెలుగులో రాణీగారి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది! అందానికి తోడు కాస్త అమాయకత్వం ఉన్న అమ్మాయి అయితే రాణీగారి రోల్‌కి ఫర్‌ఫెక్ట్‌. కత్తియుద్ధం, గుర్రపు స్వారీ వంటివి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే... ఇదేమీ రాజులు, రాజ్యాల సినిమా కాదు. హిందీ హిట్‌ ‘క్వీన్‌’ రీమేక్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రీమేక్‌ చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. రీసెంట్‌గా పరుల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రలో కన్నడ ‘క్వీన్‌’ రీమేక్‌ షూటింగ్‌ మొదలైంది. ఈపాటికే తమిళ, తెలుగు రీమేక్స్‌ షూటింగ్‌ కూడా మొదలయ్యేది. 

కానీ, ముందు ఈ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పిన తమన్నా తర్వాత తప్పుకోవడంతో కొత్త కథానాయికను వెతికే పనిలో పడింది చిత్రబృందం. కాజల్‌ అగర్వాల్‌ తమిళ ‘క్వీన్‌’ రీమేక్‌లో నటించే చాన్సుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే... ఆమె ఇంకా సినిమాకు సంతకం చేయలేదని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ కాజల్‌ ఓకే చెప్పినా... తెలుగు కోసం మరో కథానాయికను వెతకాలి. ఎందుకంటే... నాలుగు భాషల్లో నలుగురు వేర్వేరు కథానాయికలతో వేర్వేరు దర్శకులతో ‘క్వీన్‌’ రీమేక్‌ను తీయాలనుకుంటున్నారు నిర్మాతలు. అమీ జాక్సన్‌ మాత్రం నాలుగు భాషల్లో సెకండ్‌ హీరోయిన్‌గా హాట్‌ హాట్‌ క్యారెక్టర్‌లో నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement