
బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం మణికర్ణిక. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విశేషాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా చర్చకు దారితీసింది. మణికర్ణిక మేజర్ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించారు. అనివార్య కారణాల వల్ల క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో కంగనా స్వయంగా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు.
అయితే టీజర్ రిలీజ్ సమయంలో దర్శకుడిగా క్రెడిట్ అంతా క్రిష్‌కే ఇచ్చిన కంగనా తాజాగా ట్రైలర్ లాంచ్‌లో మాత్రం తానే అంతా చేసినట్టుగా మాట్లాడటం చర్చకు దారితీసింది. కనీసం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో క్రిష్ పేరు కూడా ప్రస్తావించని ఈ బ్యూటీ, దర్శకుడు అర్థాంతరంగా సినిమా వదిలేయంటంతో తానే మేజర్‌పార్ట్‌ను డైరెక్ట్ చేసినట్టుగా మాట్లాడి అందరికి షాక్ ఇచ్చారు. టీజర్‌లో దర్శకుడిగా క్రిష్ పేరు మాత్రమే వేసిన చిత్రయూనిట్, ట్రైలర్‌లో మాత్రం క్రిష్‌తో పాటు కంగనా పేరును కూడా వేశారు. ఇంత వరకు క్రిష్‌తో కంగనాకు వివాదాలు ఉన్నట్టుగా ఎలాంటి వార్తలు రాకపోయినా తాజాగా ట్రైలర్ లాంచ్‌తో వివాదం కారణంగా క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న విషయంపై క్లారిటీ వచ్చినట్టైంది.
Comments
Please login to add a commentAdd a comment