
కంగనా రనౌత్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ను ఇప్పుడు పర్సనల్‌గా మీట్ అవ్వాలంటే కష్టం. పోనీ ఫోన్ చేద్దామన్నా ఉపయోగంలేదు. ఎందుకంటే ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ అని వస్తుందట. ఎవరికీ అందుబాటులో లేకుండా కంగనా ఎక్కడికి వెళ్లారు? ఏం చేస్తున్నారు? అంటే.. ‘మణికర్ణిక’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వీర వనిత రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో కంగనా లీడ్ రోల్‌లో ఈ సినిమా రూపొందుతోంది. రాజస్తాన్‌లోని ఓ రిమోట్ ఏరియాలో చిత్రీకరణ జరుగుతోంది.
వార్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. అక్కడ సెల్‌ఫోన్స్‌కు సిగ్నల్స్ ఉండవట. అది మాత్రమే కాదు.. షూటింగ్ స్పాట్‌కి చేరుకోవాలంటే నడచుకుంటూ వెళ్లాల్సిందే. వాహనాలు వెళ్లే దారి లేదు. ఒక్కసారి యూనిట్ సభ్యులు లొకేషన్‌కి చేరుకుంటే... వేరేవాళ్లు వాళ్లను కాంటాక్ట్ చేయడం అసాధ్యమేమో. ‘నో కాంటాక్ట్స్’ కాబట్టి షూటింగ్ స్పీడుగా సాగుతోందట. శంకర్–ఇషాన్–లాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment