
సాక్షి, ముంబై : మణికర్ణిక మూవీ విడుదల నేపథ్యంలో ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయిగా టైటిల్ రోల్ పోషించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయిను అగౌరవపరిచేలా సన్నివేశాలున్నాయంటూ హిందూ కర్ణిసేన ఆందోళనలకు దిగడంతో ముందు జాగ్రత్త చర్యగా కంగనా నివాసం ఎదుట పోలీసు బలగాలను నియోగించారు.
కాగా,బ్రిటిష్ అధికారితో లక్ష్మీభాయ్‌కు సంబంధం ఉందనే రీతిలో ఈ సినిమాలో సన్నివేశాలు ఉండటం పట్ల కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ను కించపరిచేలా ఏ ఒక్క సీన్ ఉన్నా హిందూ సమాజం కంగనాను క్షమించబోదనిన. ఆమె తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని కర్ణిసేన హెచ్చరించింది. తమను కంగనా బెదిరించడం ఇలాగే కొనసాగిస్తే ఆమెను తాము స్వేచ్ఛగా మహారాష్ట్రలో తిరగనివ్వబోమని, ఆమె మూవీ సెట్స్‌ను తగులబెడతామని మహారాష్ట్ర కర్ణిసేన అధ్యక్షుడు అజయ్ సింగ్ సెంగార్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment