
Kangana Ranaut Gets Trolled For Soldiers Securiting Her: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏ అంశంపైనైనా సూటిగా సుత్తిలేకుండా మాట్లేడుస్తుంటుంది. సమాజంలోని పరిస్థితులపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యాఖ్యలతో కంగనా రనౌత్ పలుసార్లు వివాదాలపాలైంది కూడా. అయితే తాజాగా ఈ బ్యూటీ ట్రోలింగ్ బారిన పడింది.
మార్చి 1న మంగళవారం ఉదయం కంగనా ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ షేర్ తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోల కంగనాకు సెక్యూరిటీగా సైనికులు దర్శనమిచ్చారు. ఇది చూసిన నెటిజన్లు కంగనా కంగు తినేలా కామెంట్లు చేస్తున్నారు. 'కంగనాకు ఎవరూ వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు', 'నేను కట్టే టాక్స్ తన సెక్యూరిటీ కోసమా?', 'అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావులా కంగనా కనిపిస్తోంది', 'ఈరోజు వేస్ట్ అయింది' అంటూ ట్రోలింగ్‌కు దిగారు నెటిజన్స్.
Comments
Please login to add a commentAdd a comment