
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్‌తో రూపొందించిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ రాజనీతి, ధైర్య సాహసాలు ప్రతిబింభించేలా మణికర్ణిక సినిమాను రూపొందిస్తున్నారు.
కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మేజర్ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా చివర్లో కొన్ని సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్‌కు కంగనా దర్శకత్వం వహించారు. ఆ సమయంలో కంగన వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దర్శకురాలిగా కంగనా పేరునే టైటిల్స్‌లో వేస్తారన్న ప్రచారం జరిగిన టీజర్‌లో దర్శకుడిగా క్రిష్ పేరే కనిపించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 జనవరి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment