రాష్ట్రపతి కోసం ‘మణికర్ణిక’ స్పెషల్‌ షో | Manikarnika Special Show For President RamNath Kovind | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 18 2019 10:13 AM | Last Updated on Fri, Jan 18 2019 10:39 AM

Manikarnika Special Show For President RamNath Kovind - Sakshi

వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం మణికర్ణిక. టాలీవుడ్ దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించారు. అనేక వివాదాలు, మరెన్నో వాయిదాల తరువాత షూటింగ్ పూర్తి చేసుకున్న మణికర్ణిక ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌తోపాటు పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కథగా తెరకెక్కుతున్న ఈసినిమాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీక్షించనున్నారు. ఆయన కోసం ఈ నెల 18న సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్రయూనిట్. ఈ ప్రదర్శనకు కంగనాతో పాటు చిత్రయూనిట్ అంతా హాజరు కానుంది. అయితే టీంతో పాటు దర్శకుడు క్రిష్‌ హాజరవుతారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మణికర్ణిక సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement