ముంబై : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. తన అప్‌మింగ్ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనను విమర్శించాడంటూ అతడిపై ఫైర్ అయ్యారు. కంగనా- రాజ్‌కుమార్ రావు సినిమా జడ్జిమెంటల్ హై క్యా సినిమా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే... కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మణికర్ణిక సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంగనా పూర్తిగా దేశభక్తురాలిగా మారి ఈ సినిమాను తెరకెక్కించిందని సదరు జర్నలిస్టు విమర్శించారు. అదే విధంగా పాకిస్తాన్‌లో షోలు నిర్వహించే భారతీయ ముస్లిం నటీమణులను వ్యతిరేకించే కంగనా... తన మణికర్ణిక సినిమాను మాత్రం అక్కడ రిలీజ్ చేయడం విశేషం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ క్రమంలో తాజా మూవీ ప్రమోషన్‌కు వచ్చిన అతడిపై కంగన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ నా మణికర్ణిక సినిమా గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడావు. ఆ సినిమా తెరకెక్కించి తప్పు చేశానా? జాతీయవాదిగా నాపై ముద్ర వేశావు కదూ. గతంలో నీకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అప్పుడు బాగా మెచ్చుకున్నావు. మరి తర్వాత ఏమైంది’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ పరిణామంతో కంగుతిన్న సదరు జర్నలిస్టు తను కంగన నటనను విమర్శించినందుకే తనపై ఇలా కక్ష గట్టిందని వాపోయాడు.
Great to see journos standing up to #FarziNationalists like #Kangana.
— The DeshBhakt (@akashbanerjee) July 8, 2019
Questioning them or flop #Manikarnika makes you question Nationalism?🤨
Not only did @JustinJRao stand his ground - he shut the MC trying to silence him.
Kudos to @ektaravikapoor for allowing journo to finish. pic.twitter.com/Vuf7ZbAXj9
Comments
Please login to add a commentAdd a comment