
గాయం తగ్గింది. కానీ శత్రువుల అంతం చూడాలన్న పంతం మాత్రం రెట్టింపు అయ్యింది. అందుకే కంగనా రనౌత్ మళ్లీ కత్తి పట్టి కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యారు. వీరనారి రాణీ లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’. క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఫైనల్ షూట్ షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. ప్రజñ ంట్ ఖిల్లా సెట్లో షూటింగ్ పనిలో బీజీగా ఉన్నారట చిత్రబృందం. అంటే ‘ఝాన్సీ కా ఖిల్లా’లో కంగనా అదరగొడుతున్నారు అన్నమాట. గత నెల 22న జోధాపూర్‌లో జరుగుతున్న షూటింగ్‌లో కంగనా గాయపడి ముంబై వెళ్లారన్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు కంగనా పూర్తిగా కోలుకున్నారట. మణికర్ణిక షూట్‌లో చురుకుగా పాల్గొంటున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు ఈ ఏడాదిలో మేలో చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. మరోవైపు కంగనా డైరెక్షన్ ప్రాజెక్ట్ తేజు వాయిదా పడిందని, ఈ సినిమా కంటే ముందు కంగనా మరో థ్రిల్లర్ మూవీలో నటించబోతున్నారని బీటౌన్ టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే... దంగల్ ఫేమ్ జైరా వసీంకు ఫ్లైట్‌లో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. దీనిపై మండిపడ్డారు కంగనా. ‘‘ నేను జైరా ప్లేస్‌లో ఉండి ఉంటే, అతనికి తగిన బుద్ది చెప్పేదాణ్ణి’’ అని ముంబైమీడియా ముందు అన్నారని బీటౌన్ టాక్.