పబ్లిక్‌గా ముద్దిచ్చిన నటి.. వీడియో వైరల్‌ | Ankita Lokhande kisses boy friend Vicky Jain | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌గా ముద్దిచ్చిన నటి.. వీడియో వైరల్‌

Published Fri, Apr 26 2019 11:53 AM | Last Updated on Fri, Apr 26 2019 12:04 PM

Ankita Lokhande kisses boy friend Vicky Jain - Sakshi

హిందీ టీవీ రంగంలో నటిగా పాపులరైన అంకిత లొకాండె.. మణికర్ణికతో సినీరంగంలోకి అడుగుపెట్టి, ఎంట్రీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణికర్ణికలో కంగనాకు సపోర్టుగా జల్కరి బాయి పాత్రలో ఒదిగిపోయి మంచి మార్కులు కొట్టేసింది. పవిత్ర రిష్తా టీవీ షో చేసే సమయంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చాలా కాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత 2016లో అతడితో విడిపోయింది. సుశాంత్ టీవీ రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసే క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

అయితే ఇటీవల అంకిత, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త విక్కీ జైన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై అంకిత కొన్ని రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. 'విక్కీ చాలా మంచి వ్యక్తి. నేను అతనితో ప్రేమలో ఉన్నా. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఒక వేళ పెళ్లి చేసుకుంటే మీ అందరిని పిలిచే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతానికైతే అలాంటి ప్లాన్‌లేవీ లేవు. నా ఫోకస్‌ అంతా పని మీదే ఉంది' అంటూ చెప్పుకొచ్చారు.

ఇటీవల అంకిత, విక్కీ జైన్‌ ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆడిపాడారు. ఈ జంట మ్యూజిక్‌ని ఆస్వాధిస్తుండగా ఒక్కసారిగా విక్కీని దగ్గరకు తీసుకుని అందరు చూస్తుండగానే అంకిత ముద్దు ఇచ్చింది. దీనికి సంబంధించి వీడియోను నటుడు అర్జున్‌ బిజ్‌లానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement