సాక్షి, హైదరాబాద్ : యాక్షన్ హీరోలందరూ నటీమణులుగా కనిపిస్తున్న ఈ తరుణంలో, ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా తెరపై ఓ గొప్ప హీరోను చూశానని కంగనారనౌత్‌ను రామ్‌గోపాల్ వర్మ పొగడ్తలతో ముంచెత్తారు. మణికర్ణికలో కంగనా అద్భుతమైన నటనతో తనను ఎక్కడికో తీసుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇలాంటి ఉగ్రరూపాన్ని చివరిసారిగా ఎంటర్‌ది న్యూడ్రాగన్ చిత్రంలో బ్రూస్‌లీలో చూశానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
క్రిష్ జాగర్లమూడితో కలిసి కంగనా రౌనత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ రచనా సహకారం అందించారు. అతుల్ కులకర్ణి, డానీ డెంజొప్ప, జిషు సేన్‌గుప్తా, రిచర్డ్ కీప్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment