టీజర్‌ సిద్ధం | manikarnika first look released on gandhi jayanti | Sakshi
Sakshi News home page

టీజర్‌ సిద్ధం

Published Sun, Sep 30 2018 3:45 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

manikarnika first look released on gandhi jayanti - Sakshi

కంగనా రనౌత్‌

దేశ స్వాతంత్య్రం రోజున (ఆగస్టు 15) ‘మణికర్ణిక’ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసి సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేసుకున్నారు ‘మణికర్ణిక’ టీమ్‌. ఇప్పుడు అక్టోబర్‌ 2 అంటే... గాంధీ జయంతి నాడు టీజర్‌ను రిలీజ్‌ చేసి మరింత మంది ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి ప్లాన్‌ చేశారు. ఇది దేశభక్తి చిత్రం కావడంతో ఇలా దేశభక్తికి రిలేట్‌ అయిన డేట్స్‌లో సినిమా ప్రమోషన్‌ను ప్లాన్‌ చేస్తే ప్లస్‌ అవుతుందని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకేనేమో సినిమా రిలీజ్‌ను కూడా వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డేకి మార్చుకున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న సినిమా ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కానీ క్రిష్‌ తెలుగులో ‘యన్‌.టి.ఆర్‌’  బయోపిక్‌తో బిజీగా ఉండటం వల్ల కొంత షూట్‌ కోసం కంగనా డైరెక్షన్‌ చైర్‌లో కూర్చున్నారన్న సంగతి తెలిసిందే. సినిమా డైరెక్షన్‌ క్రెడిట్‌లో తనకు భాగస్వామ్యం వద్దని, అవుట్‌పుట్‌ రావడంలో ఒక భాగంగానే తాను డైరెక్షన్‌ సీట్‌లో కూర్చున్నానని ఆమె చెప్పారని బాలీవుడ్‌ టాక్‌. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మణికర్ణిక’ టీమ్‌ నుంచి తాజాగా  నటి స్వాతి సెమ్వాల్‌ కూడా వైదొలిగినట్లు బీటౌన్‌ టాక్‌. ఈ సినిమాలో పార్వతి అనే పాత్రకు స్వాతిని తీసుకున్నారట. అయితే తన పాత్రకు ప్రాముఖ్యతను తగ్గించారనే కారణంగా స్వాతి ఈ చిత్రానికి గుడ్‌ బై చెప్పారట. రీసెంట్‌గా సోనూసూద్‌.. తాజాగా స్వాతి తప్పుకోవడంతో ‘మణికర్ణిక’ సినిమా మళ్లీ బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement