క్రిష్, కంగనాల 'మణికర్ణిక'.? | Krish New Historical Film Manikarnika | Sakshi
Sakshi News home page

క్రిష్, కంగనాల 'మణికర్ణిక'.?

Mar 22 2017 11:17 AM | Updated on Sep 5 2017 6:48 AM

క్రిష్, కంగనాల 'మణికర్ణిక'.?

క్రిష్, కంగనాల 'మణికర్ణిక'.?

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్.. మరో దృష్యాకావ్యానికి తెరరూపం ఇచ్చేందుకు

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్.. మరో దృష్యాకావ్యానికి తెరరూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్పై బాలీవుడ్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గౌతమిపుత్ర శాతకర్ణితో తెలుగు చక్రవర్తి కథకు రూపం ఇచ్చిన క్రిష్, మరోసారి ఓ భారీ చారిత్రక చిత్రం రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్తో... భారత చరిత్రలో ధీరవనితగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ లక్ష్మీబాయ్ జీవితాన్ని సినిమాగా రూపొందించనున్నాడు.

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్ ఈ సినిమాలో లక్ష్మీబాయ్గా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు లక్ష్మీబాయి పుట్టినప్పటి పేరు 'మణికర్ణిక'ను టైటిల్గా ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్లో 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాతో సక్సెస్ సాధించిన క్రిష్, మణికర్ణికతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement