కంగనానే నా హీరో : నటి | Samantha Praises Kangana Ranaut Over Manikarnika Film | Sakshi
Sakshi News home page

కంగనానే నా హీరో : నటి

Published Tue, Jan 29 2019 9:42 AM | Last Updated on Sun, Jul 14 2019 4:41 PM

Samantha Praises Kangana Ranaut Over Manikarnika Film - Sakshi

సాధారణంగా ఇండస్ట్రీలో ఒక నటిని మరో నటి మెచ్చుకోవడం అరుదే. కానీ ప్రస్తుతం ట్రెండ్‌ మారుతుంది. సహ నటి ఎవరైనా బాగా నటిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఇతర హీరోయిన్‌లు. ఈ విషయంలో సమంత ఎప్పడు ముందే ఉంటారు. హిందీ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సమంత. ‘మణికర్ణిక’తో నటిగా మరోసారి నిరూపించుకున్నారు కంగనా. వీరనారీ ఝాన్సీలక్ష్మీబాయ్‌ పాత్రలో కంగనా సాహసోపేతమైన నటనను ప్రదర్శించారు.

ఈ చిత్రంలో కంగనా నటనను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సమంత. ‘కంగనానే నా హీరో..  ప్రస్తుత హీరోయిన్లు ఎవరూ నటించడానికి సాహసించని యాక్షన్‌ కథా పాత్రను ఎంచుకుని చాలా గొప్పగా నటించిందం’టూ ప్రశంసించారు సమంత. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. సమంత చేతిలో తెలుగులో రెండు, తమిళంలో ఒక చిత్రం ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement