నన్ను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు! | Kangana Ranaut wants this trait in her boyfriend to avoid break-up | Sakshi
Sakshi News home page

నన్ను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు!

Published Mon, Mar 19 2018 1:13 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Kangana Ranaut wants this trait in her boyfriend to avoid break-up - Sakshi

కంగనా రనౌత్‌

మంచివాడై , హ్యాండ్‌సమ్‌గా ఉండాలి. నవ్వుతూ, నవ్విస్తుండాలి. వంట వచ్చి ఉండాలి... ఇలా తమ కలల రాకుమారుడికి ఉండాల్సిన లక్షణాల గురించి అమ్మాయిలు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ కూడా తన బాయ్‌ఫ్రెండ్‌కు ఉండాల్సిన ఓ మేజర్‌ లక్షణం గురించి చెప్పారు. అదేమిటంటే.. తన బాయ్‌ఫ్రెండ్‌ కచ్చితంగా దేశభక్తుడై ఉండాలట. ‘‘నా దేశాన్ని నేనెంతగానో ప్రేమిస్తాను. ఒకవేళ నేను ప్రేమించే వ్యక్తి దేశభక్తుడు కాదని తెలిస్తే అతనికి బ్రేకప్‌ చెప్పేస్తా.

కన్నభూమి పై అభిమానం లేనివాడు, నాతో విశ్వాసంగా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. నన్ను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. దేశాన్ని కూడా ప్రేమించాలి’’ అని చెప్పుకొచ్చారు కంగనా. అదండీ మేటర్‌. కంగనాకి ప్రపోజ్‌ చేయాలంటే దేశం మీద భక్తి ఉండాలి. సినిమాల సంగతి కొస్తే  వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితకథ ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో  ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’, ప్రకాశ్‌ కొవెలమూడి దర్శకత్వంలో  ‘మెంటల్‌ హై క్యా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు కంగనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement