Patriot
-
భగత్ సింగ్ అపూర్వమైన దేశభక్తుడు- కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే
న్యూఢిల్లీ: షహీద్ భగత్ సింగ్ ఒక అపూర్వమైన దేశ భక్తుడని, ఆయన అందరివాడని, రాబోయే తరాలవారికి ఒక స్ఫూర్తి జ్యోతి అని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే భగత్ సింగ్ సేవలను కొనియాడారు. భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా రాజ్ త్రిపాఠీ, రాహుల్ ఇంక్విలాబ్ రచించిన " క్రాంతీ కి దరోహర్" (హిందీ) గ్రంధాన్ని ముఖ్య అతిధి కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే అంబేద్కర్ ఆడిటోరియం, ఆంధ్ర భవన్ , ఢిల్లీలో 28 సెప్టెంబర్ 2023 న సాయంత్రం 5 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. సభకు ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త, సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చెసిన శాంభవి మఠాధిపతి స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ మాట్లాడుతూ పటిష్ట భారత దేశం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళ్ పాండే, భగత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాల వారు పాల్గొన్నారు. -
మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తిన పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత ప్రధాని మోదీ స్వతంత్ర విధేశాంగ విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ నిజమైన దేశభక్తుడని, ఆయన సారథ్యంలో భారత్ చాలా పురోగతి సాధించిందని కొనియాడారు. మాస్కోకు చెందిన వాల్డై డిస్కషన్ క్లబ్ వార్షిక ప్రసంగంలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాయత్వంలో భారత్‌లో అనేక మంచి పనులు జరిగాయి. ఆయన అసలైన దేశ భక్తుడు. మోదీ ‘మేకిన్ ఇండియా’ ఆలోచన ఆర్థికంగా, నైతికంగా చాలా కీలకమైంది. భవిష్యత్తు భారత్‌దే. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్ గర్వించాలి.’ అని పేర్కొన్నారు ఇండియా అభివృద్ధిని ప్రస్తావిస్తూ.. బ్రిటిష్ వలస పాలన నుంచి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం అద్భుతమని రష్యా అధ్యక్షుడు అన్నారు. దాదాపు 1.5 బిలియన్ల(150 కోట్లు) ప్రజలు, ఖచ్చితమైన అభివృద్ధి కారణంగా భారత్‌ను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని, అభిమానిస్తారని పేర్కొన్నారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని స్పష్టం చేశారు.రెండు దేశాల మధ్య అనేక దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. చదవండి: Ukraine-russia war: అణ్వాయుధాలు ప్రయోగించం: పుతిన్ భారత్, రష్యా మధ్య ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులు రాలేదని.. ఎల్లప్పుడూ ఒకరికొకరం మద్దతుగా నిలిచామని తెలిపారు. ప్రస్తుతం అదే కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగుతోందని పేర్కొన్నారు. భారత్‌లో వ్యవసాయం కోసం ఎరువుల సరఫరాను పెంచాలని మోదీ కోరారని.. ఇందుకు తాము 7.6 రెట్లు సరఫరా పెంచినట్లు తెలిపారు. వ్యవసాయంలో వ్యాపారం దాదాపు రెండితలు పెరిగిందని పుతిన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పశ్చిమ దేశాల వైఖరిపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంపై పెత్తనం కోసం పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని మండిపడ్డారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ(డర్టీ గేమ్) ఆడుతున్నాయంటూ అమెరికా, మిత్ర పక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. వాటి చర్యలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తాయని హెచ్చరించారు. చదవండి: డేంజర్స్ డర్టీ గేమ్‌కి ప్లాన్... పుతిన్ షాకింగ్ వ్యాఖ్యలు -
జైశంకర్‌ను ఆకాశానికెత్తిన రష్యా విదేశాంగ మంత్రి
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ను.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికెత్తారు. నిజమైన దేశభక్తుడంటూ జైశంకర్‌ను అభివర్ణించారాయన. ప్రపంచలో ఎక్కడా లేని విధంగా భారత్ సొంత విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోందని.. చాకచక్యంగా దౌత్యం నడిపించడంలో జైశంకర్ ముందుంటున్నారంటూ పేర్కొన్నారు సెర్గీ లావ్రోవ్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలంటూ ఒత్తిళ్లు, కొన్ని సవాళ్లు ఎదురైనా భారత్ మాత్రం తన సొంత విదేశాంగ విధానంతో కీలక నిర్ణయం తీసుకోగలిగింది. ఈ వ్యవహారంలో భారత విదేశాంగ వ్వవహారాల మంత్రి జైశంకర్ వ్యవహరించిన తీరు హర్షణీయం. అందుకే ఆయన అతని దేశానికి నిజమైన దేశభక్తుడు అంటూ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికి ఎత్తాడు. జైశంకర్ అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త, నిజమైన దేశభక్తుడు. దేశ భద్రత కోసం, అభివృద్ధికి అవసరమని భారత్ ఏదైతే విశ్వసిస్తుందో.. మేం కూడా ఆ (భారత్) మార్గంలోనే వెళ్లాలనుకుంటున్నాం. పైగా చాలా దేశాలు భారత్‌లా వ్యవహరించలేవు కూడా అని పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో భారత్ కొనసాగించిన లావాదేవీలపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ బదులు ఇచ్చారు. ముందు ఈయూ సంగతి చూడాలని, వాళ్లతో పోలిస్తే తాము(భారత్) చేసుకుంటున్న దిగుమతుల మోతాదు చాలా తక్కువేనని, పైగా మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ అమెరికా లేవనెత్తిన అభ్యంతరాలకు గట్టి కౌంటరే ఇచ్చారాయన. ఈ నేపథ్యంలో.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. -
మర్మమెరుగని కర్మయోగి
సాక్షి, పశ్చిమగోదావరి : ఆయనో గాంధేయ వాది.. బాపూజీపై ఎనలేని అభిమానం.. 12 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు.. ఉపాధ్యాయ వృత్తిని వదిలి గిరిజన సేవా సంఘం స్థాపించి సేవే పరమావధిగా జీవించారు.. దాతలు, విదేశీయులు, ప్రభుత్వం నుంచి విరాళాలు సేకరించి పెద్దెత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. గతమెంతో వైభవం కాగా.. ప్రస్తుతం దుర్భర స్థితిలో బతుకుతున్నారు. కొల్లాయి గుడ్డ, చేతికర్ర ధరించి గాంధీజీ స్ఫూర్తితో జీవనం సాగిస్తున్న ఆయన పేరు స్వామి సత్యానంద. అభినవ గాంధీగా, కర్మయోగిగా అడవిబిడ్డలు ఆయన్ను అభివర్ణిస్తుంటారు. గాంధీజీ స్ఫూర్తితో.. పోలవరం మండలం గూటాలకు చెందిన అచ్చన్న, చంద్రమ్మ దంపతుల నాల్గో కుమారుడు సత్యానంద 1930లో జన్మించారు. చిన్నతనం నుంచి గాం«దీజీపై ఇష్టం పెంచుకున్న ఆయన బాపూజీ పుస్తకాలు చదువుతూ పెరిగారు. 12వ ఏట క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని గాంధీజీని దగ్గరగా చూశారు. 1944లో 8వ తరగతి చదువుతూ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. 1946లో గోపాలపురం మండలంలోని రాజంపాలెంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అదే ఏడాది బుట్టాయగూడెం మండలంలోని రామన్నగూడెం పాఠశాలకు బదిలీపై వచ్చారు. 1948లో ఉపాధ్యాయుల హక్కుల కోసం 32 రోజులపాటు నిరాహార దీక్ష చేసి, సమస్యలపై అప్పటి ప్రధాని నెహ్రూకు లేఖ రాశారు. శిథిలావస్థకు చేరుకున్న సత్యానంద భవనం ఆయన పేరుతో గ్రామం బుట్టాయగూడెం మండలం రామన్నగూడెం సమీపంలోని చిన్న భవనంలో ఆయన సేవా సంఘాన్ని ఏర్పాటుచేశారు. అనంతర కాలంలో ఆ ప్రాంతంలో మరికొన్ని ఇళ్ల నిర్మాణం జరిగింది. స్వామి సత్యానంద సేవలను గుర్తించి ఆ గ్రామానికి ‘నందాపురం’ అని స్థానికులు పేరుపెట్టారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 200 కుటుంబాలకు పైగా ఉన్నాయి. 79 ఏళ్లుగా బాపూజీ బాటలో.. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన ఆస్తులు దానధర్మాల నేపథ్యంలో కనుమరుగయ్యాయి. నాడు సిబ్బందితో కళకళలాడిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. విలువైన పుస్తకాలు చెదలు పట్టి పాడైపోయాయి. నా అనే వాళ్లు లేక శిథిల భవనంలో ఆయన జీవనం సాగిస్తున్నారు. 91 ఏళ్ల వయసున్న ఆయన క్విట్ ఇండియా ఉద్యమం నాటి నుంచి 79 ఏళ్లుగా గాంధీజీ వేషధారణలో బతుకుతూ కూరగాయలు, పండ్లు, రొట్టెలే ఆహారంగా తీసుకుంటున్నారు. శి«థిల భవనంలో విషసర్పాలు సంచరించే ప్రాంతంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. చెదలు పట్టిన విలువైన పుస్తకాలు ఔదార్యం.. అమోఘం దీనస్థితిలోనూ సత్యానంద తన ఔదర్యాన్ని వీడలేదు. ప్రభుత్వం అందిస్తున్న రూ.2,250 పింఛన్‌ను పేదల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఎవరైనా ఆయన్ను సన్మానించి నూతన వ్రస్తాలు అందిస్తే వాటినీ పేదలకు ఇచ్చేస్తున్నారు. తనకు వివాహమైనప్పటికీ కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు సత్యానంద చెబుతున్నారు. ఉద్యోగాన్ని వదులుకుని.. 1954లో గిరిజనులకు సేవ చేయాలనే తలంపుతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి గిరిజన సేవా సంఘం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాతలు, ప్రభుత్వం, విదేశీయుల సహకారంతో విరాళాలు సేకరించి పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థకు భవనాలు, భూమిని కూడా సమకూర్చారు. సుమారు 30 మందికి పైగా ఉద్యోగులతో సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో అక్షరాస్యత శాతం పెంపు, ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవకు కృషిచేశారు. -
వివాదంలో ప్రముఖ కామెడీ షో
‘పాట్రియాట్ యాక్ట్ విత్ హసన్ మిన్హాజ్’ అనేది ఒక అమెరికన్ కామెడీ, వెబ్ టెలివిజన్ షో. సమకాలీన రాజకీయాలకు సంబంధించిన విషయాలను కామెడీతో కలిపి జనాల ముందు ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం ఈ షో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దీని నిర్వహకులు విషపూరిత పని సంస్కృతిని పాటిస్తున్నారంటూ షో మాజీ నిర్మాత నూర్ ఇబ్రహీం నస్రీన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా నూర్ వరుస ట్వీట్లు చేశారు. ‘ఈ షోలో పని చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు పొందాను. చాలా సార్లు నన్ను టార్గెట్ చేశారు. కొన్నిసార్లు కావాలనే విస్మరించేవారు. వీరు షోలో చూపించే నీతిని నిజంగా పాటిస్తే చాల బాగుండేది. చాలా మంది నన్ను ఈ షో గురించి మాట్లాడమని కోరేవారు. కానీ నేను తప్పించుకునేదాన్ని. ఈ షోలో ఎన్నో అవమానాలు పొందాను. చాలా సార్లు డిప్రెషన్‌కు గురయ్యాను. ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడం వల్ల నాకు, నాలా బాధపడే ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అన్నారు నూర్. (సూపర్ క్రేజ్.. 1.7 మిలియన్ లైక్స్) A lot of people have asked me to talk about Patriot Act. I avoided it because each time I relive the experience of being humiliated and gaslit, targeted and ignored, I sink back into days of depression. Tweeting this will probably not help me or anyone who has suffered. — nur nasreen (@Nuri_ibrahim) August 20, 2020 అంతేకాక ‘కొందరు మహిళలు నాకంటే ధైర్యవంతులు. వారు దీని గురించి చర్చించారు. ఈ షో ఎంతో ముఖ్యమైనది.. ప్రముఖమైనది. ఇందుకు గాను నా పని పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతాను. నాకు లభించిన అవకాశాలకు నేను ధన్యవాదాలు తెలుపుతాను. అయితే గత కొద్ది నెలలుగా నేను అనుభవిస్తున్న మానసిక వేదనతో పోల్చితే.. ఇది అంత విలువైనదేం కాదని అర్థమవుతోంది. నిజంగానే మనకు ఓ దేశ భక్తి చట్టం ఉండాలని.. ఈ షో చూపించిన దానిని వారు నిజంగా పాటించాలని కోరుకుంటున్నారు. అప్పుడే వారు ప్రేక్షకుల ప్రేమకు అర్హులు’ అంటూ వరుస ట్వీట్లు చేశారు నూర్. రాజకీయాల మీద సెటర్లతో ఈ సాగే ‘పాట్రియాట్ యాక్ట్ షో’ మొదట అక్టోబర్ 28, 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శితమయ్యింది. అప్పటి నుంచి ఆరు సీజన్లుగా 40 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయిన ఈ షో ప్రస్తుతం ఆగిపోయింది. -
రాహుల్‌పై ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: చైనాతో ఘర్షణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న మాటల యుద్ధానికి ఇప్పట్లో తెరపడేటట్టు లేదు. తాజాగా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలడని చాణక్య చెప్పారు. ఒక విదేశీ మహిళకు జన్మించిన వ్యక్తి ఎప్పటికి దేశభక్తుడు కాలేడు’ అంటూ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘మీకు రెండు దేశాల పౌరసత్వం ఉంటే, మీలో దేశభక్తి భావాలు ఎలా ఉంటాయి’ అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నైతికత, నీతి, దేశభక్తి లేదని ఆరోపించారు. ‘ఒకసారి కాంగ్రెస్ పార్టీ లోపలికి చూడాలి. వారికి ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ పార్టీకి నీతి, ధైర్యం, దేశభక్తి లేవు’ అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విరుచుకుపడడ్డారు. అయితే ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ విదేశీ మూలాలు గురించి బీజేపీ తరచుగా విమర్శలు చేయడం సాధారణమే. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యల పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎమ్పీ పదవికి అవమానానన్ని తెచ్చిపెట్టారని ఆరోపించార. ఉగ్రవాద కేసులో చిక్కుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గురించి.. రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజ్ఞా మతిసస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఆమెకు వెంటనే తగిన చికిత్స అందించాలని ధనోపియా తెలిపారు. -
‘దేశభక్తి చట్టం’ ఉపయోగించిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా మొట్టమొదటి సారిగా ‘దేశభక్తి చట్టం’ను ఉపయోగించింది. ఈ చట్టాన్ని ఉపయోగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు. టెర్రరిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఆదమ్ అమీన్ హసౌన్, అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 50 ఏళ్ల పైబడిన ఆదమ్‌కు 2017లోనే శిక్షాకాలం పూర్తయింది. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన్ని విడుదల చేయకుండా, ఎలాంటి విచారణ లేకుండానే జీవితాంతం జైల్లో నిర్బంధించేందుకు ‘దేశభక్తి చట్టం’ను ప్రయోగించారు. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జన్మతా లెబనాన్‌కు చెందిన ఆదమ్‌ను మొదటి సారి 2002, జూన్ నెలలో అక్రమ వలస కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికా యుద్ధం ప్రకటించాక ఎక్కువ సార్లు ఆదమ్ కటకటాల వెనక్కే ఉన్నారు. వాస్తవంగా ఆయన ప్రత్యక్షంగా టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కానీ టెర్రరిస్టు కార్యకలాపాలకు మద్దతిస్తున్న పలు ముస్లిం చారిటీ సంస్థలకు భారీగా విరాళాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ చారిటీ సంస్థలను కూడా అమెరికా నిషేధించింది. 2017లో ఆదమ్ శిక్షాకాలం పూర్తయ్యాక ఆయన పుట్టిన లెబనాన్గానీ, పెరిగిన పాలస్తీనాను ఆక్రమించుకున్న ఇజ్రాయిల్గానీ శరణార్థిగా తీసుకునేందుకు తిరస్కరించడంతో జాతీయ భద్రతా దృష్ట్యా ఆయన్ని దేశభక్తి చట్టంలోని 412 సెక్షన్ కింద నిర్బంధించారు. కేవలం విదేశీయులకే వర్తించే ఈ చట్టాన్ని అమెరికాపై ఒసామా బిన్ లాడెన్ జరిపించిన వైమానిక దాడుల అనంతరం 2001, అక్టోబర్ 26వ తేదీన అమెరికా పార్లమెంట్ ఆమోదించింది. -
సారీ.. రెండోసారి!
న్యూఢిల్లీ: నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ శుక్రవారం రెండుసార్లు లోక్‌సభకు క్షమాపణ చెప్పారు. తాను గాడ్సేను దేశభక్తుడని అనలేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె మొదటి సారి క్షమాపణలు చెప్పినప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆమె అలా చెప్పే బదులు చెప్పకపోతే నయమన్నట్టుగా ఉన్నాయని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ‘నా వ్యాఖ్యలతో కొందరి మనోభావాలు దెబ్బ తిన్నందుకు చాలా విచారిస్తున్నాను. అందుకు క్షమాపణ చెబుతున్నా. అయితే సభలో నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. తప్పుగా అర్థం చేసుకున్నారు’అని ఆమె అన్నారు. తనని ఉగ్రవాది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ని ఆమె తప్పు పట్టారు. కోర్టు తనని దోషిగా నిర్ధారించకుండా ఉగ్రవాది అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మహిళలు, సా«ధ్విలను అవమానపరచడమేనని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నాయి. మరోవైపు బీజేపీ రాహుల్‌కి హక్కులు నోటీసు ఇవ్వాలని పట్టుబట్టింది. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా చాంబర్లో అన్ని పార్టీల లోక్‌సభ పక్ష నాయకులు హాజరై మరోసారి ప్రజ్ఞా క్షమాపణలు చెప్పాలని తీర్మానించారు. దీంతో ముందుగా తయారు చేసిన క్షమాపణ ప్రకటనను ఆమె చదివి వినిపించారు. ‘నవంబర్ 27న ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణ కోరుకుంటున్నా’అని అన్నారు. అయితే తాను గాడ్సేని దేశభక్తుడని అనలేదని మళ్లీ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని తాను ఎప్పుడూ గౌరవిస్తానని, జాతికి ఆయన చేసిన సేవలు సదా స్మరణీయమని అన్నారు. దీంతో సభలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీ ప్రజ్ఞా సభా హక్కుల ఉల్లంఘన నోటీసుని లోక్‌సభ స్పీకర్‌కి సమర్పించారు. రైతు కుటుంబాలకు సాయం లేదు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు చెందిన కుటుంబాలకు సాయం అందించే నిబంధనలేవీ ప్రస్తుత చట్టాల్లో లేవని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రుపాలా ఈ విషయం తెలిపారు. అయితే, రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకు రుణాల మంజూరు వంటి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యుల కొరత లేదు ► ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ దేశంలో వైద్యుల కొరత, నర్సుల కొరత లేదని ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో వెల్లడించారు. విదేశాలకు వెళ్ళే వైద్యులను బలవంతంగా అడ్డుకోవడం కుదరదన్నారు. క్రమంగా రైల్వే విద్యుదీకరణ పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్‌లో అన్ని రైల్వేలైన్లను క్రమేణా విద్యుదీకరిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభకు చెప్పారు. ప్రైవేటు బిల్లులు బుధవారం? ప్రైవేటు బిల్లులను శుక్రవారం బదులు బుధవారం సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఎంపీలు స్పీకర్‌ను కోరారు. జాతీయ స్థాయి అంశాలు ఉంటే తప్ప ప్రైవేటు బిల్లుల చర్చ కోసం సమయాన్ని తగ్గించకూడదని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంపీలంతా తమ నియోజకవర్గాలకు వెళ్లే హడావిడిలో ఉంటారు గనుక చర్చ పూర్తి స్థాయిలో జరగదని వారు చెప్పారు. -
ఆ కమిటీ నుంచి ప్రజ్ఞా తొలగింపు
న్యూఢిల్లీ: గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని లోక్‌సభ సాక్షిగా దేశభక్తుడని కొనియాడిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెను రక్షణ సంప్రదింపుల కమిటీ నుంచి తొలగిస్తున్నట్టుగా పార్టీ కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. ఈ దఫా పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంటులో దుమారం ప్రజ్ఞా గాడ్సే వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు మండిపడ్డాయి. ఆరెస్సెస్, బీజేపీ మనసులో ఉన్న మాటలనే ప్రజ్ఞా బయటకు చెప్పిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తింది. స్పీకర్ ఆమె వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించామని చెప్పారు. ఇక దీనిపై సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. దీనిపై సంతృప్తి చెందని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రజ్ఞా ఒక ఉగ్రవాది: రాహుల్ అంతకు ముందు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞాపై విరుచుకుపడ్డారు. ఆమెని ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. ‘ఒక ఉగ్రవాదైన ప్రజ్ఞా మరో ఉగ్రవాది గాడ్సేని దేశభక్తుడని చెబుతోంది. భారత పార్లమెంటులోనే ఇదో దుర్దినం. ఆమె వ్యాఖ్యలు బీజేపీ, ఆరెస్సెస్ అసలు సిసలు ఆత్మని ఆవిష్కరిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రజ్ఞాను జాతి క్షమించదని ఆమెను బీజేపీ ఎప్పుడు పార్టీ నుంచి తరిమేస్తుందని ప్రశ్నించారు. -
గాడ్సే దేశ భక్తుడైతే గాంధీ జాతి వ్యతిరేకా?
అగర్ మాల్వా, ఉజ్జయిని, భోపాల్/న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఆ పార్టీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి, మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించారు. దీంతో గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని విపక్ష నేతలు మండిపడ్డారు. ఇటీవల రెండుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్ గురువారం మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో రోడ్ షో సందర్భంగా తాజా వివాదానికి తెరతీశారు. ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. గాడ్సే దేశ భక్తుడని, ఆయన ఎప్పటికీ దేశ భక్తుడిగానే ఉంటారని అన్నారు. ఆయన్ను ఉగ్రవాది అంటున్నవారు తమను తాము ఒకసారి పరీక్షించుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి సరైన గుణపాఠం చెబుతారన్నారు. స్వతంత్ర భారత తొలి ఉగ్రవాది హిందూ అంటూ గాడ్సేని దృష్టిలో ఉంచుకుని రాజకీయ నేతగా మారిన నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు.. ప్రజ్ఞ ఈ విధంగా జవాబిచ్చారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మండిపడ్డాయి. బీజేపీ అసలు రంగు బయటపడిందని ధ్వజమెత్తాయి. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రజ్ఞ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజ్ఞను ఆదేశించింది. దీంతో క్షమాపణ చెప్పిన ఆమె తాను చేసిన వ్యాఖ్యలను సైతం ఉపసంహరించుకున్నారు. భోపాల్‌లో మే 12న ఎన్నికల ప్రచారం ముగించిన ప్రజ్ఞ.. 19న ఎన్నికలు జరగబోయే మాల్వా ప్రాంతంలో పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అసలు రంగు బయటపడింది: ఎన్సీపీ అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ అసలు రంగును ప్రజలిప్పుడు చూస్తున్నారని మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గాంధీని చంపిన గాడ్సే.. ప్రజ్ఞ పేర్కొన్నట్టుగా దేశ భక్తుడేనా? అన్న సంగతి ప్రధాని మోదీ స్పష్టం చేయాలన్నారు. మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు కూడా ఉగ్రవాది గాడ్సే కోవలోకే వస్తారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవ్హద్ అన్నారు. గాడ్సే దేశ భక్తుడైతే మహాత్మా గాంధీ జాతి వ్యతిరేకా అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామన్న బీజేపీ ప్రజ్ఞ వ్యాఖ్యలతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని బీజేపీ పేర్కొంది. మహాత్మా గాంధీ హంతకుడు దేశభక్తుడు కాలేడని తెలిపింది. ఆమె అలాంటి ప్రకటన ఎలా చేశారో వివరణ కోరతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పడం సమంజసమని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజ్ఞ క్షమాపణలు చెప్పడం నెలలో రెండోసారి. గతంలో కర్కరేపై చేసిన వ్యాఖ్యలకు కూడా ఆమె క్షమాపణ చెప్పారు. తాజా వ్యాఖ్యలకు సైతం ఆమె క్షమాపణలు చెప్పినట్లు ఆమె ప్రతినిధి, బీజేపీ నేత డాక్టర్ హితేష్ బాజ్‌పాయ్ తెలిపారు. ప్రజ్ఞ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు. గతంలోనూ... ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ఐపీఎస్ అధికారి, ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే తాను పెట్టిన శాపంతోనే ముంబై ఉగ్రదాడుల్లో మరణించారని అన్నారు. ఏటీఎస్ చీఫ్‌గా మాలెగావ్ పేలుళ్ల కేసు విచారించిన కర్కరే తనను హింసించారని ప్రజ్ఞ అప్పట్లో ఆరోపించారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసంలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని మరోసారి వ్యాఖ్యానించారు. అది బీజేపీ డీఎన్ఏలోనే ఉంది : కాంగ్రెస్ ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ, అమిత్ షాల అభిమాన బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ మరోసారి జాతి యావత్తును అవమానించారని పేర్కొంది. హింసా సంస్కృతి, అమరులను కించ పరచడమనేది బీజేపీ డీఎన్ఏలోనే ఉందని విమర్శించింది. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ను దండించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రధానిని కోరారు. బీజేపీ నేతలు గాడ్సే వారసులనేది స్పష్టమయ్యిందని అన్నారు. వారు గాడ్సేని దేశ భక్తుడని, వీర మరణం పొందిన కర్కరేని దేశ ద్రోహి అని అంటారన్నారు. తమ నేతల ద్వారా బీజేపీ.. జాతిపిత సిద్ధాంతాలు, ఆలోచనా విధానంపై ‘హానికారక దాడులు’ చేస్తూనే ఉందని ఆరోపించారు. ‘ఇది గాంధేయ సూత్రాలను కించ పరిచేందుకు జరుగుతున్న కుట్ర. దేశం క్షమించజాలని క్షమాపణార్హం కాని నేరం..’ అని అన్నారు. మోదీకి ఎంత మాత్రం తెలివి ఉన్నా ప్రజ్ఞా సింగ్‌ను దండించి, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భోపాల్‌లో బీజేపీ ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ కూడా ప్రజ్ఞ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గాడ్సేని ప్రశంసించడం దేశ భక్తి కాదని, అదొక జాతి వ్యతిరేక చర్య అని అన్నారు. మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
నన్ను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు!
మంచివాడై , హ్యాండ్సమ్గా ఉండాలి. నవ్వుతూ, నవ్విస్తుండాలి. వంట వచ్చి ఉండాలి... ఇలా తమ కలల రాకుమారుడికి ఉండాల్సిన లక్షణాల గురించి అమ్మాయిలు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా తన బాయ్‌ఫ్రెండ్‌కు ఉండాల్సిన ఓ మేజర్ లక్షణం గురించి చెప్పారు. అదేమిటంటే.. తన బాయ్‌ఫ్రెండ్ కచ్చితంగా దేశభక్తుడై ఉండాలట. ‘‘నా దేశాన్ని నేనెంతగానో ప్రేమిస్తాను. ఒకవేళ నేను ప్రేమించే వ్యక్తి దేశభక్తుడు కాదని తెలిస్తే అతనికి బ్రేకప్ చెప్పేస్తా. కన్నభూమి పై అభిమానం లేనివాడు, నాతో విశ్వాసంగా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. నన్ను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. దేశాన్ని కూడా ప్రేమించాలి’’ అని చెప్పుకొచ్చారు కంగనా. అదండీ మేటర్. కంగనాకి ప్రపోజ్ చేయాలంటే దేశం మీద భక్తి ఉండాలి. సినిమాల సంగతి కొస్తే వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’, ప్రకాశ్ కొవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు కంగనా. -
జాతీయ గీతాలాపనే దేశభక్తా?
జస్టిస్ చంద్రచూడ్‌కు కృతజ్ఞతలు! ‘ప్రజలు తమ దేశభక్తిని బాహాటంగా ఎందుకు ప్రదర్శించాలి’ అంటూ గత మూడేళ్లుగా లక్షలాది మంది అడుగుతూ వస్తున్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్నలోని పదాలను సువర్ణాక్షరాలతో లిఖించవలసి ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వాటిని చూసేలా ప్రత్యేకించి నరేంద్రమోదీ ప్రభుత్వంలోని మంత్రులు, వారి బీజేపీ, ఆర్ఎస్ఎస్ సహచరులు కూడా చూసేలా వాటిని కొట్టొచ్చేలా కనిపించే ప్రాంతంలో ఉంచాలి. విషాదమేమిటంటే జస్టిస్ చంద్రచూడ్ తోటి న్యాయమూర్తుల్లో కొందరు కూడా వాటిని చూడాల్సి ఉంది. సినిమా ప్రారంభంలో జాతీయగీతాన్ని తప్పకుండా ఆలపించేలా ఏర్పాటు చేయాలంటూ గత ఏడాది నవంబర్ 30న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాల్సిందిగా తన ముందుకు వచ్చిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ తన అభిప్రాయాన్ని అత్యంత స్పష్టంగా చెప్పారు. ‘జాతీయగీతాన్ని సినిమా హాళ్లలో ఆలపించనట్లయితే మనం దేశభక్తులం కానట్లుగా మనమెందుకు భావించాలి.. మీ దేశభక్తిని నిరూపించుకునేందుకు జాతీయ గీతాన్ని మీరు ఆలపించాల్సిన పనిలేదు... సుప్రీంకోర్టు ద్వారా దేశభక్తిని ప్రజలకు అలవర్చలేము’. దీనికి పూర్తి భిన్నంగా భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ భావిస్తున్నదేమిటో ఆయన మాటల్లోనే విందాం. ‘మతం, కులం, ప్రాంతంపై ఆధారపడి ఉన్న విస్తృత వైవిధ్యపూరితమైన కారణాల వల్ల, థియేటర్లలో జాతీయగీతాన్ని ప్రదర్శించడం ద్వారా ఒక ఏకీకృత శక్తిని తీసుకురావడం అవసరంగా మారింది. ఆవిధంగా ప్రజలు థియేటర్లలోంచి బయటకు వచ్చినప్పుడు వాళ్లందరూ భారతీయులుగా ఉంటారు’. అటార్నీ జనరల్ వాదన నన్ను కలవరపెడుతోంది. మనం సినిమా హాల్లోకి ప్రవేశించడానికి ముందు, జాతీయ గీతాన్ని ఆలపించడానికి ముందు మనం ఎవరం అని ఆయన భావిస్తున్నారో ఆ మునుపటి హోదా గనుక ఆయనకు అంగీకారయోగ్యమైతే ఆ తరువాత కూడా అది ఎందుకు అంగీకారయోగ్యం కాదు? జాతీయగీతాన్ని ఆలపించినంత మాత్రాన అది మన జాతీయతను లేదా దేశం పట్ల మన ప్రేమను, అభిమానాన్ని మార్చదని వేణుగోపాల్ గ్రహించడం లేదా? జస్టిస్ చంద్రచూడ్, వేణుగోపాల్ ఇద్దరూ జాతీయగీతాన్ని ఒక ప్రతీకగా ఆమోదిస్తున్నారు. అయితే జాతీయగీతం పట్ల మనం మరీ ఆర్భాటాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని జస్టిస్ నమ్ముతున్నారు. జాతీయగీతం పట్ల మన మనసులో విశ్వాసం ఉంటే చాలు. మరోవైపున వేణుగోపాల్ అభిప్రాయం ప్రకారం ఒక ప్రతీకగా జాతీయగీతమే సర్వస్వం అన్నమాట. మీ మనసులో ఉన్న దాన్ని బయటకు వ్యక్తపరచాల్సి ఉందని ఆయన భావన. నిజానికి, జాతీయగీతం, జాతీయపతాకం లేదా భారత్ మాతాకి జై వంటి నినాదాలు మన మనోభావాలను వ్యక్తపర్చలేవు. బహుశా, స్వాతంత్య్రం సిద్ధించిన తొలి రోజుల్లో ఈ ప్రతీకలు అవసరమయ్యే ఉంటాయి. ఆనాడు మన దేశం దుర్బలంగా ఉండేది. కాబట్టే అప్పట్లో అభద్రతతోపాటు జాతికి తనపై తనకు నమ్మకం ఉండేది కాదు. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆనాటి పరిస్థితి లేదు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న భారత ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకోవలసిన అవసరంకానీ, విభేదిస్తున్న వారి దేశభక్తిని ప్రశ్నించవలసిన అవసరం కానీ లేవు. వేణుగోపాల్‌ని తీవ్రంగా భయపెడుతున్న భిన్నత్వం అనేది నిజానికి మన బలమే కానీ బలహీనత కాదు. భారతీయులుగా ఉండటంలోని సౌందర్యాన్ని మన వివిధ మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, శరీరచ్ఛాయలు, వంటల రకాల్లో మనం వ్యక్తపర్చగలం. మనకు ఇక అవసరం లేదని దశాబ్దాల క్రితమే వదిలించుకున్న ఒక వాడుకను మళ్లీ తీసుకురావడం ద్వారా గత నవంబర్‌లో సుప్రీం కోర్టు ఘోర తప్పిదానికి పాల్పడింది. ఈ అవివేకపు నిర్ణయానికి కారణమైన ధర్మాసనానికి, ప్రస్తుతం భారత సర్వోన్నత న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తే ఆనాడు నేతృత్వం వహించారు. తన చీఫ్ జస్టిస్ ఆనాడు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా.. నేడు మాట్లాడినందుకు జస్టిస్ చంద్రచూడ్‌ని అభినందిస్తున్నాను. జాతీయ సంక్షోభం నెలకొన్న సమయాల్లో దేశభక్తి ఒక మనోభావంగా అవసరమని లేక జాతి ఉల్లాస స్థితిని అనుభవిస్తున్న సందర్భాల్లో అది సహజమైనదని అదనంగా జోడిస్తే జస్టిస్ చంద్రచూడ్ తోసిపుచ్చుతారని నేనైతే భావించడం లేదు. కానీ అలాంటి సందర్భాల్లో కూడా దేశభక్తి భావన అప్రయత్నంగా మనలో వ్యక్తం కాకపోతే మీరు దాన్ని బలవంతంగా చొప్పించలేరు. ఇతరత్రా సందర్భాల్లో అది చాలావరకు మనలోని దురభిప్రాయాలకు, విభజనకు సంబంధించిన మొరటు వ్యక్తీకరణగా ముందుకొస్తుంది. జస్టిస్ చంద్రచూడ్ సంధించిన మహత్తర ప్రశ్నలో.. ‘నీతిమాలినవాడి చివరి నెలవు దేశభక్తి’ అంటూ శామ్యూల్ జాన్సన్ పేర్కొన్న ఆ అమృతోపమానమైన పదాలను కూడా చేర్చుకోవాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
జాతీయవాదమంటే దేశభక్తేనా?
జాతీయ వాదం అంటే సరిహద్దు వలయం అవతలి వైపు ఉన్న శత్రువులను గుర్తిం చడం మాత్రమేనా? అంతర్గతంగా పౌరుల మౌలిక వసతులు, జీవించే హక్కులను కాపాడటం కూడా జాతీయవాదమే. యుద్ధం.. యుద్ధ తంత్రంపై సహజంగానే నాకు ఆసక్తి ఎక్కువ. నేను పుట్టి, పెరిగిన పల్లె నేపథ్యమో.. దేశభక్తి భావమో కారణం కావచ్చు. మృగశిర కార్తె కాలంలోనే పుట్టలోంచి ఊసిళ్లు బయటికొచ్చినట్టు.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే ఉగ్రవాదం, దేశభక్తి అంశాలు తెరమీదకు వస్తాయి. హిందూ జాతీయ వాదమే దేశభక్తి అని, శత్రు దేశంపై యుద్ధ వాతావరణంతోనే తరగని ఓటు బ్యాంకు సొంతం చేసుకోవచ్చని కాషాయం నేతలకు బాగా తెలుసు. లౌకిక్ భారత్ అనే మాట చెప్పకపోయినా హిందూ జాతీయ వాదమే దేశభక్తి అనే అంతర్గత వాతావరణాన్ని దేశంలో తీసుకొచ్చారు. ఎక్కడైతే పాలకులు ప్రజా రక్షణను విస్మరిస్తారో.. అక్కడ ప్రజలే ఆయుధాలు పట్టుకుంటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తరువాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి. సరిహద్దును అంగీకరించటంతో పాటు ఎలాంటి కాల్పులకు కవ్వింపులకు పాల్పడవద్దని ఒప్పందం చేసుకున్నారు. అయినా అడపా దడపా అక్కడ అల్లర్లు, కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అలాంటి వాతావరణమే ఉంది. అయినా కాశ్మీరీలు మన అంతర్భాగం. పక్కన పాకిస్తాన్ సైనికులతో పోరాడటానికి, భారత్‌లో అంతర్భాగమైన కాశ్మీరీ తిరుగుబాటుదారులను నిలవరించడానికి మధ్య స్పష్టమైన రక్షణ నిబంధనలు ఉన్నాయి. కళ్లు మూసుకుపోయిన పాము తన పిల్లలనే కొరికి తిన్నట్టుగా, సొంత దేశం పౌరుడినే వాహన బాయ్‌నెట్‌కు కట్టుకొని మన సైన్యాధికారి రక్షణ కవచంగా వాడుకోవడం తీవ్రమైన యుద్ధ నేరం కింద పరిగణించాల్సింది పోయి ఎన్ఎల్ గొగోయ్ అనే సైనిక మేజర్‌కు అవార్డుతో సత్కరించడం కశ్మీరీలను కవ్విం చటమే. దేశభక్తిని ఒలకబోసే బీజేపీ పాలనలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 1999 మే–జూన్ మాసంలో జరిగిన కార్గిల్ యుద్ధం బీజేపీ హయాంలోనే జరిగింది. మొదట దీన్ని కశ్మీర్ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా చెప్పారు. భారత వాయుసేనలు వెళ్లి సమీప కొండల మీద పాకిస్తాన్ దళాలు మకాం వేశాయి అని చెప్పేవరకు పాలకులకు తెలి యదు. ఆ యుద్ధంలో మనం గెలిచాం అనిపించినా మన వైపు నుంచి 527 మంది సైనికులు మరణించగా, 1,363 మంది గాయపడ్డారు. అదే ఏడాది డిసెంబర్ మాసంలో నేపాల్ నుంచి ఇండియాకు వస్తున్న విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్ దేశంలోని కాందహార్ అనే ప్రాంతంలో దింపి కరుడు గట్టిన తీవ్రవాదులు మౌలానా మసూద్ అజాద్, ఒమర్ సయీద్ షేక్, హామ్మద్ జర్గర్‌లను స్వయంగా అప్పటి రక్షణ మంత్రి జశ్వంత్ సిన్హా ఉగ్రవాదులకు అప్పగించారు. ఈ ఏడాది కశ్మీర్ అల్లర్లు, రాజ్‌కోట్‌పై దాడి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు. భారతావనికి బలమైన గూఢచర్య వ్యవస్థ ఉంది. ఆర్ఏడబ్ల్యూ(రా) లాంటి సంస్థలు ఉన్నాయి. ఇవి ఉగ్ర సమాచారాన్ని పసిగట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. ఉగ్రవాదులు తండాలకు, తండాలుగా దేశ సరిహద్దుల్లో చొరబడుతుంటే ముందే పసిగట్టి చేసిన హెచ్చరికలను దాచిపెట్టి కాషాయపు దేశభక్తులు మౌనంగా ఉన్న ఫలితమే పై సంఘటనకు కారణం. భారతీయ సమాజంలో కొద్దిమంది మిగతా ప్రజ లంతా ఏం తినాలో.. ఎవరిని పెళ్లి చేసుకోవాలో.. ఏది దేశభక్తో.. ఎంతవరకు మాట్లాడాలో నిర్ణయిస్తున్నారు. ఒపీనియన్ మేకర్స్ వాళ్లే, మిగిలిన సమాజం అంతా వాళ్లకు కోరస్ పాడాలి. ఎక్కడైనా ధిక్కార స్వరం వినిపిస్తే వాడు దేశానికి ద్రోహం చేశాడనే వాతావరణాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారు. కాషాయం రంగు ఒంటి నిండా పులుముకున్న భజనపరులంతా ఏం చేసినా అది జాతీయవాదమేనట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవు, గో మాంసం గురించి మాట్లాడిన ఓ ఎంఐఎం నాయకుడి మీద పోలీ సులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ ఇప్పించింది పక్కా కాషాయ కండువా కప్పుకున్న న్యాయవాది. ఇక్కడ అది వృత్తి ధర్మం అంటుండొచ్చు. కానీ ఈ అంశంలో వృత్తిని, వ్యక్తిని వేర్వేరుగా చూడటం సాధ్యమేనా? జాతీయ వాదం అంటే సరిహద్దు వలయం అవతలి వైపు ఉన్న శత్రువులను గుర్తించడం మాత్రమేనా? అంతర్గతంగా పౌరుల మౌలిక వసతులు, జీవించే హక్కులను కాపాడటం కూడా జాతీయ వాదమే. సంపద సృష్టించే సామర్థ్యం ఉండి, దారిద్య్ర రేఖకు దిగువనే పేదరికంలో మగ్గిపోతున్న చేతివృత్తుల జాతులకు ఉపాధి కల్పించడం జాతీయవాదమే. తెలంగాణ ప్రాంత ఆచరణాత్మక ఇబ్బం దులను దృష్టిలో పెట్టుకొని డబుల్ బెడ్రూం, గొర్రెలు, చేపల చెరువుల పునరుద్ధరణ పథకాలు అమలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాద భావజాలం సెంటిమెంటుతో అమిత్‌షా తెలంగాణ గడ్డ మీదకు అడుగుపెట్టారు. రజాకార్ ప్రభావిత గ్రామాల్లో తిరిగి తన పాచిక విసిరే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సమాజం విభిన్నమైనది, విశిష్టత ఉన్న ప్రాంతం. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ సకల మతాల సాంస్కృతిక కేంద్రం. మత సామరస్యానికి ప్రతీక. ఇది అమిత్‌షా లాంటి వాళ్ల కంటి సైగలకు, ఉడుత ఊపులకు కదిలే ప్రాంతం కాదు. ఇక్కడ కాషాయపు గెంతులు కుప్పిగంతులు కాక తప్పదు. - సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త దుబ్బాక శాసన సభ్యులు, శాసనసభ అంచనాలు–పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141