'అద్వానీ పేరు మార్చుకో.. మోడీ మాట వింటాడు'
బీజేపీ అగ్రనేతల మధ్య ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని నరేంద్రమోడిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ సెటైర్ విసిరారు. తన మాట మోడీ వినాలంటే ఎల్ కే అద్వానీ పేరు మార్చుకోవాలని కేజ్రివాల్ సూచించారు. అద్వానీ (Advani) పేరులోని V అక్షరాన్ని తీసి వేయాలంటూ బీజేపీ సీనియర్ నేతకు కేజ్రివాల్ ఉచిత సలహా ఇచ్చారు. ఆదానీ గ్రూప్ తో మోడీకి ఉన్న వ్యాపార సంబంధాలపై కేజ్రివాల్ వ్యంగ్యస్త్రాలను వదిలారు. గుజరాత్ లోని ఆదానీ గ్రూప్ కు చెందిన పారిశ్రామిక వేత్తలతో మోడీకి సన్నిహిత సంబంధాలపై ఆప్ నేత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
గతంలో ప్రధాని అభ్యర్థిత్వంపై మోడీకి బీజేపీ మద్దతుపై అద్వానీ అసంతృప్తిని వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల గాంధీనగర్ సీటు వ్యవహారంపై కూడా విభేదాలు మరింత ముదిరాయి.