వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.
నల్లగొండ శివారులోని చర్లపల్లికి చెందిన ఓ రైతు ద్వచక్రవాహనం పై నల్లగొండకు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలుతెలియాల్సి ఉంది.