సాక్షి, అనంతపురం: జిల్లాలో వెహికిల్ ఇన్సూరెన్స్ బాగోతం బట్టబయలైంది. టూవీలర్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లతో ఆటోలు, కార్లు, లారీలు, బస్సులకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రవాణా శాఖ అధికారులకు అనుమానం రావడంతో ఇన్సూరెన్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. టూవీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం కేవలం రూ. 1,500 లోపే ఉంటుంది. అదే ఆటోలు, కార్లు, లారీలకు అయితే రూ.10 వేల నుంచి రూ.80 వేల దాకా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఇంత పెద్దమొత్తంలో ఎందుకు చెల్లించాలనుకున్న కొందరు వాహనదారులు.. అక్రమార్కులను ఆశ్రయిస్తున్నారు. దీంతో టూవీలర్ ప్రీమియంతోనే భారీ వాహనాలకు దళారులు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీనిపై అనంతపురం రవాణాశాఖ అధికారులకు అనుమానం రావడంతో ఇన్సూరెన్స్ అక్రమాలు బయటపడ్డాయి. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు సమర్పించిన 252 మందికి అనంతపురం డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ శివరాంప్రసాద్ నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment