
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే పేద మహిళా డ్రైవర్‌కు కొత్త ఆటో బహుమతిగా అందించారు. తనవంతు సాయంగా సమాజ సేవలో భాగంగా తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లారెన్స్. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 ద్విచక్ర వాహనాలు అందజేశారు. అంతే కాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు.
త్వరలోనే వారికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం రాఘవ చేస్తున్న సేవలను కొనియాడారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చంద్రముఖి-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో అలరించిన రాఘవ.. ప్రస్తుతం దుర్గ అనే చిత్రంలో నటిస్తున్నారు.
Hatsoff @offl_Lawrence Sir
தமிழர் பாரம்பரிய மல்லர் கலையில் கலக்கி வரும் #கை_கொடுக்கும்_கை மாற்றுத்திறனாளி குழுவினர் ஒவ்வொருவருக்கும் இரண்டு சக்கர வாகனம் பரிசளித்தார் மாஸ்டர் #ராகவா_லாரன்ஸ் .#RaghavaLawrence pic.twitter.com/879dQ28jLO— Actor Kayal Devaraj (@kayaldevaraj) April 18, 2024
Service is god 🙏🏼 pic.twitter.com/UBZXYFIDMQ
— Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2024