ద్విచక్ర వాహన తయారీదారులు తమ కస్టమర్లకు డిస్కౌంట్ ధరకు హెల్మెట్ అందించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. 2022లో దేశంలో జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల 50,029 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
‘ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు అధికంగా మృత్యువాత పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే తయారీదారులను డిస్కౌంట్ ధరకు హెల్మెట్లు ఇవ్వమని అడగండి. తయారీ కంపెనీలు కూడా కొంత తగ్గింపుతో వాహనదారులకు హెల్మెట్లు ఇస్తే చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న ద్విచక్రవాహనదారుల్లో దాదాపు 43 శాతం మంది మరణిస్తున్నారు’ అని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: జీవిత పాఠాలు నేర్పిన గురువులు
పాఠశాల బస్సులు నిలిపేందుకు సరైన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీ జరిమానాలు విధించిందని చెప్పారు. దేశంలోని ప్రతి టౌన్‌లో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment