భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన లైనప్‌లో ఎంపిక చేసిన ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఏ మోడల్ మీద ఎంత ధరలను పెంచనుంది అనే వివరాలను ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు.
హీరో మోటోకార్ప్ తన టూ వీలర్ల ధరలను పెంచినట్లయితే.. రూ. 1500 వరకు పెంచే అవకాశం ఉంది. ఇది కూడా మోడల్‌ను బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. ధరల పెంపు 2024 జులై 1 నుంచి వర్తిస్తుంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగటం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.
హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిళ్ల శ్రేణిలో స్ప్లెండర్ ప్లస్ వేరియంట్‌లు, హెచ్ఎఫ్ డీలక్స్, హెచ్ఎఫ్ 100, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ఎక్స్‌టెక్, సూపర్ స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్, గ్లామర్, గ్లామర్ ఎక్స్‌టెక్, ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, ఎక్స్‌ట్రీమ్ 4వీ, ఎక్స్‌ట్రీమ్ 200 4వీ, ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, మావ్రిక్ 440 వంటివి ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో హీరో డెస్టిని ప్రైమ్, డెస్టిని 125 ఎక్స్‌టీఈసీ, జూమ్, ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ వున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment