July 1
-
పెరగనున్న టూ వీలర్స్ ధరలు.. జులై 1నుంచే అమలు
భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన లైనప్‌లో ఎంపిక చేసిన ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఏ మోడల్ మీద ఎంత ధరలను పెంచనుంది అనే వివరాలను ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు.హీరో మోటోకార్ప్ తన టూ వీలర్ల ధరలను పెంచినట్లయితే.. రూ. 1500 వరకు పెంచే అవకాశం ఉంది. ఇది కూడా మోడల్‌ను బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. ధరల పెంపు 2024 జులై 1 నుంచి వర్తిస్తుంది. ఇన్పుట్ ఖర్చులు పెరగటం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిళ్ల శ్రేణిలో స్ప్లెండర్ ప్లస్ వేరియంట్లు, హెచ్ఎఫ్ డీలక్స్, హెచ్ఎఫ్ 100, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ఎక్స్‌టెక్, సూపర్ స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్, గ్లామర్, గ్లామర్ ఎక్స్‌టెక్, ఎక్స్ట్రీమ్ 125ఆర్, ఎక్స్ట్రీమ్ 4వీ, ఎక్స్ట్రీమ్ 200 4వీ, ఎక్స్ట్రీమ్ 160ఆర్, మావ్రిక్ 440 వంటివి ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో హీరో డెస్టిని ప్రైమ్, డెస్టిని 125 ఎక్స్టీఈసీ, జూమ్, ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ వున్నాయి. -
టేక్ హోం సాలరీ, పనిగంటలు: జూలై 1 నుంచి మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం జూలై 1నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలుతో కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి, వేతనాలలో గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. అలాగే ఆఫీసు వేళలు, పీఎఫ్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ టేక్-హోమ్ జీతం తగ్గే అవకాశం ఉంది. జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఇంకా నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను రూపొందించలేదు. 23 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) మాత్రమే వేతనాలపై కోడ్ ముసాయిదా నిబంధనలను ప్రచురించాయని కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ లోక్‌సభ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కొత్త లేబర్ కోడ్స్, మార్పులు జూలై 1వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలు అమలైతే, ఆఫీసు పని గంటలను 8-9 గంటల నుండి 12 గంటల వరకు పెంచవచ్చు. అయితే పనిగంటలు పెరిగితే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ఆఫీస్ పనివేళలను మార్చుకోవడానికి కంపెనీలకు వీలుంటుంది. కాబట్టి, వారంలో పనిదినాలు నాలుగు రోజులకు తగ్గించబడతాయి, కానీ వారంలో మొత్తం పని గంటలు ప్రభావితం కావు. కొత్త వేతన కోడ్ ప్రకారం వారానికి మొత్తం 48 పని గంటలు తప్పనిసరి. కొత్త వేతన కోడ్ ప్రకారం టేక్-హోమ్ జీతం కాంపోనెంట్, ప్రావిడెంట్ ఫండ్‌కు యజమానుల సహకారంలో మార్పు ఉంటుంది. స్థూల నెలవారీ జీతంలో కనీసం 50 శాతం బేసిక్ జీతం ఉంటుంది కాబట్టి ఉద్యోగుల టేక్-హోమ్ జీతం కూడా గణనీయంగా మారుతుంది. ఇది ఉద్యోగి, యజమాని పీఎఫ్ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. కొంత మంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు టేక్ హోం జీతం తగ్గుతుంది. అయితే ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వ నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమలుకు కేంద్రం యోచిస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం- పని పరిస్థితులు లాంటి అంశాల ఆధారంగా 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ కొత్త కోడ్స్‌ను రూపొందించింది. -
వాషింగ్టన్ డీసీ వేదికగా ఆటా వేడుకలు
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని 2022 జులై 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆటా కార్యవర్గం ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న హెర్న్‌డాన్ వరల్డ్ గేట్ సెంటర్ ఏరియాలో క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఆటా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు ఎనిమిది వందల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటిసారి ఇప్పటి వరకు 16 సార్లు ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌లు జరిగాయి. అయితే ఇవన్నీ అమెరికాలోని వేర్వేరు నగరాల్లో జరిగాయి. అయితే 17వ కాన్ఫరెన్స్‌కి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మొదటిసారి వేదికగా నిలవనుంది. ఈ వేడుకలు నిర్వహించేందుకు వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్‌ని ఎంపిక చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కి క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం, కాట్స్ కో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఏర్పాట్ల పరిశీలన ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కాట్స్ ఆధ్వర్యంలో 70 మందికి పైగా ఆటా కార్యవర్గ, అడ్హాక్, అడ్విసోరీ, లోకల్ కన్వెన్షన్ కమిటీలు కాన్ఫరెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పర్యవేక్షించారు. 12 వేల మంది ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం లో 12,000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
Telangana: నేటి నుంచి పల్లెప్రగతి దశమి
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం, పారిశుధ్యం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ప్రధాన ఎజెండాగా.. గురువారం నుంచి మలివిడత పల్లె/పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. గురువారం (జూలై 1) నుంచి 10 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, అటవీ శాఖలు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నాయి. అత్యుత్తమ పౌర సేవలు అందించడం ద్వారా పల్లెలు, పట్టణాల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం లక్ష్యంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా వీటికి రూపకల్పన చేశారు. ఈ మేరకు ఆయా శాఖలు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. పది రోజుల కార్యక్రమాల సందర్భంగా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు రోజువారీ ప్రగతి నివేదికలను రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తారు. చివరిగా పల్లె, పట్టణ స్థాయిల్లో సాధించిన పురోగతిపై సమగ్ర నివేదికను సమర్పిస్తారు. వార్డుల్లో బృందాలతో.. పట్టణ ప్రగతి నిర్వహణ కోసం రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో కౌన్సిలర్/ కార్పొరేటర్, వార్డు పర్యవేక్షక అధికారి, పారిశుధ్య విభాగం/నీటి సరఫరా విభాగం ఉద్యోగితో వార్డు స్థాయి బృందాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు కౌన్సిలర్/కార్పొరేటర్‌తో కూడిన వార్డు కమిటీ ఆధ్వర్యంలో వార్డు సభను నిర్వహించి ఈ కార్యక్రమం లక్ష్యాలను, ప్రగతి నివేదికను ప్రజలకు వివరిస్తారు. తర్వాత వార్డు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు. వార్డులోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులతో సమావేశాలు నిర్వహించి.. వారి సేవలను సైతం ప్రగతి కార్యక్రమంలో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు/ చైర్ పర్సన్లు, వార్డు సభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. పురపాలికల్లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు పురపాలక సంస్థల్లో రెండెకరాలకుపైగా స్థలంలో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే స్థలాలు ఎంపిక చేసినచోట టెండర్లు ఖరారు చేసి వర్క్ ఆర్డర్లు ఇస్తారు. మిగతా చోట్ల స్థలాల ఎంపిక పూర్తి చేస్తారు. ఇక మృతదేహాలను శ్మశానాలకు తరలించేందుకు ప్రతి పట్టణంలో కనీసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేయనున్నారు. సీజనల్ వ్యాధుల నివారణపై.. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా 10 రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నారు. డ్రైనేజీల్లో పూడికతీత, వర్షపు నీరు/వృథా నీరు నిల్వ ఉండకుండా లోతట్టు ప్రాంతాల పూడ్చివేత, ఆస్పత్రులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు, దోమల నివారణ చర్యలు, మంచినీటి సరఫరా ట్యాంకుల క్లీనింగ్, క్లోరినైజేషన్ వంటివి చేపడతారు. చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలు, పిచ్చిమొక్కల తొలగింపు, ఖాళీ ప్లాట్లను శుభ్రం చేసి వాటి యజమానుల నుంచి చార్జీలు/పెనాల్టీలు వసూలు చేపడతారు, పబ్లిక్ ప్రదేశాలను శుభ్రం చేస్తారు. పనిచేయని బోరు బావులను పూడ్చివేస్తారు. 10 రోజుల్లో25 జిల్లాల్లో పర్యటనలు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ఇప్పటి వరకు రూ.6,500 కోట్లు విడుదల చేసిందని, తాజాగా రూ. 750 కోట్లు విడుదల చేసిందని, పెండింగ్‌లో బిల్లులేమీ లేవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తాను ఉన్నతాధికారులతో కలిసి వచ్చే 10 రోజుల్లో 25 జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా ఆకస్మిక తనిఖీ చేపట్టే అవకాశం ఉందన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. పల్లె/పట్టణ ప్రగతి, హరితహారం అమలును పరిశీలిస్తారని తెలిపారు. ఒక రోజు పవర్ డే.. పల్లె/పట్టణ ప్రగతిలో ఒకరోజు పవర్ డే నిర్వహించి విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తారు. మీటర్లకు మరమ్మతులు, మోటార్ల కెపాసిటర్ల మార్పు, వంగిన/పాడైన స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చడం, వేలాడే వైర్లను సరిచేయడం, ఎనర్జీ ఆడిట్, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు పనులు చేపడతారు. ప్రతి పల్లె/పట్టణానికి ప్రొఫైల్ పల్లె/పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి పల్లె, పట్టణానికి ప్రొఫైల్ తయారు చేయనున్నారు. అందులో మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల శాతం, ఓటర్లు, కుటుంబాల సంఖ్య, వార్డుల సంఖ్య, వార్డు కమిటీలు, ఎస్‌హెచ్‌జీలు/సభ్యులు, ఎస్ఎల్ఎఫ్లు, టీఎల్ఎఫ్లు, పీడబ్ల్యూడీ గ్రూపులు, వీధి వ్యాపారుల సంఖ్య, ఆసరా పెన్షనర్ల వివరాలు, రేషన్ షాపులు, కార్డుల సంఖ్య, శ్మశాన వాటికలు మొదలైన వాటి వివరాలు ఉండనున్నాయి. దళితవాడలపై స్పెషల్ ఫోకస్ దళిత సాధికారతపై సీఎం దృష్టి సారించిన నేపథ్యంలో పట్టణ ప్రగతిలో దళితవాడలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. 10 రోజుల్లో కనీసం 2 రోజులు దళితవాడల్లో పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి కొత్తగా అభివృద్ధి పర్చాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తాయి. ‘ప్రగతి’ప్రయోజనాలు ఎన్నో.. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎన్నో వినూత్న మార్పులు జరిగాయి. ఇంతకుముందు లేని ఎన్నో సదుపాయాలు సమకూరాయి. అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, కల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. పల్లె ప్రగతి నిర్వహణ కోసం మండలానికో ప్రత్యేక అధికారిని నియమించి.. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి ‘ప్రగతి’పనులను ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా గ్రామాలకు నిధులు విడుదల చేస్తోంది. ♦ పల్లె ప్రగతి కింద దేశంలోనే తొలిసారిగా 12,769 గ్రామాల్లో ప్రజలేభాగస్వాములుగా స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 8,20,727 మంది ఉండగా.. అందులో 4,03,758 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ♦ మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు గాను 19,298 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 12,755 గ్రామాల్లో నర్సరీ ఏర్పాటు చేశారు. ♦ రాష్ట్ర ఏర్పాటు నాటికి 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంత ట్రాక్టర్లు ఉండగా.. ఇప్పుడు 12,769 పంచాయతీలకు ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు సమకూరాయి. 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల పనులు పూర్తయ్యాయి. పల్లె ప్రగతి కార్యక్రమాలివీ.. ♦ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పల్లె ప్రగతి తొలి రోజు గ్రామసభను నిర్వహించి సీఎం కేసీఆర్ సందేశాన్ని, గ్రామ ప్రగతినివేదికను చదివి వినిపిస్తారు. ♦ రెండో రోజు /మూడోరోజు పంచాయతీ నర్సరీ, పల్లె ప్రకృతి వనాల్లో కలుపు తొలగింపు. పల్లె ప్రకృతి వనాల్లో పెద్ద మొక్కలు నాటడం, డ్రైనేజీల్లో పూడిక తీత. వ్యర్థాల తొలగింపు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఓపెన్ ప్లాట్లలోని పిచ్చిమొక్కల తొలగింపు చేపడతారు. ♦ నాలుగోరోజు యువత, మహిళా సంఘాల భాగస్వామ్యంతో శ్రమదానం నిర్వహిస్తారు. పెంట కుప్పలు, పొదలు తొలగిస్తారు. అంతర్గత రోడ్ల వెంట మొక్కలు నాటుతారు. ♦ ఐదోరోజు అంగన్వాడీ కేంద్రాలు, బడులు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్లు వంటి ప్రజాసంస్థల్లో పారిశుధ్య నిర్వహణ చేపట్టి, మొక్కలు నాటుతారు. ♦ ఆరో రోజు అవెన్యూ ప్లాంటేషన్ చేపడతారు. గతంలో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటుతారు. మొక్కలకు ట్రీగార్డులు, సపోర్ట్కర్రలు ఏర్పాటు చేస్తారు. ♦ ఏడో రోజు పవర్ డే నిర్వహిస్తారు. ♦ ఎనిమిదో రోజు సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం చుట్టూ రెండు, మూడు వరసల్లో పెద్ద మొక్కలు నాటుతారు. గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ♦ తొమ్మిదో రోజు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త కార్యక్రమాలు నిర్వహిస్తారు. ♦ 10వ రోజు గ్రామసభ నిర్వహించి.. ఈ విడతలో చేపట్టిన పనుల వివరాలు తెలియజేస్తారు. దాతలు, పారిశుధ్య నిర్వహణలో సేవలు అందించిన సిబ్బందిని సత్కరిస్తారు. -
ఆధార్: జూలై 1నుంచి ఫేస్ రికగ్నిషన్
సాక్షి, న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఈఏడాది జనవరిలో ప్రకటించిన ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఆధార్ పరిశీలన కోసం వేలిముద్రలు, కనుపాపలతో పాటు ముఖ గుర్తింపు సదుపాయన్నీ ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు యుఐడిఎఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే అధికారికంగా జూలై 1న లాచ్ చేయనున్నామని గత వారం సుప్రీంకోర్టుకు తెలిపారు. వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వంటి సమస్యల వల్ల బయోమెట్రిక్ వివరాల ధృవీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న(ముఖ్యంగా వృద్ధులు) వారి కోసం ఇలాంటిది తీసుకు వస్తామని జనవరిలోనే యూఐడీఏఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీం కోర్టుకు కూడా ఈ విషయన్ని నివేదించింది. అయితే ఆధార్ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్‌టైం పాస్వర్డ్(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది. -
జూలై 1నుంచి జీఎస్టీ అమలు సాధ్యమేనా?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టాక్స్ సంస్కరణగా చెబుతున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం అమలుపై వివిధ పరిశ్రమ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంకా మూడు వారాలే సమయం ఉండటంతో జూలై 1నుంచి అమలు సాధ్యపడుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలుకు కీలకమైన ఐటీ వ్యవస్థను సిద్ధంగా లేదనే అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన నెట్వర్క్ పని ఇంకా పూర్తికాలేదని జీఎస్టీ సువిధ ప్రొవైడర్స్ చెబుతున్నారు. శుక్రవారం జీఎస్టీఎన్ అధికారులు , సువిధ ప్రొవైడర్స్ మధ్య సమావేశం జరిగింది. ఇందులో జీఎస్టీ అనుకున్న తేదీనుంచి అమలు చేయాలన్న ధీమా వ్యక్తమైనప్పటికీ ఐటీ సంసిద్ధతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జీఎస్టీ నెట్వర్క్, జీఎస్టీ ఐటీ సిస్టం సిద్ధంగా లేదని, పన్నుల శ్లాబుల ఖరారు తర్వాత మాత్రమే జిఎస్టి సువిధా ప్రొవైడర్లు (జీఎస్పీ) లను సిద్ధంగా ఉంచగలమని టాలీ సొల్యూషన్స్ వద్ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేజాస్ గోయెంకా ఐఎన్‌ఎస్‌కి చెప్పారు. అలాగే జీఎస్టీలోని పలు అంశాలపై నిర్ణయాలు కొన్ని అంశాలు మాత్రమే కొన్ని రోజుల క్రితం ప్రకటించబడ్డాయి, ఇంకా కొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందనీ అందువల్ల జూలై 1 అమలు కష్టతరమనిపిస్తోందని ఎక్సెల్లాన్ సీవోవో వినోద్ తంబి పేర్కొన్నారు. ఐటి సంసిద్ధంగా లేకపోవటంతో జూలై 1నుంచిజీఎస్టీ అమలు విఫలమయ్యేటట్టు కనిపిస్తోందని సిగ్నెట్ ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు , డైరెక్టర్ నీరజ్ హుథే సింగ్ అభిప్రాయపడ్డారు. దీంతో అమలు తేదీ దగ్గరపడుతుండటంతో మార్కెట్ వర్గాల భయాలు నిజంకాననున్నాయనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇంకా 20 రోజులే మిగిలి ఉన్నప్పటికీ పన్నులరేట్లు, నిబంధనలపై నిర్ణయాలు పూర్తికాలేదనీ, ఇది సువిధ ప్రొవైడర్లు టెస్టింగ్ అవసరాల్ని దెబ్బతీస్తోందని ఎనలిస్టు ప్రీతమ్ మాధురే వ్యాఖ్యానించారు. ఈ సాఫ్ట్‌వేర్‌పై గణనీయమైన పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్‌మిత్రా కూడా జూలై 1 నాటికి ఐటి సంసిద్ధత గురించి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. మొత్తం జీఎస్టీ జీఎస్టీ నెట్వర్క్ సంబంధించిన ఐటి వ్యవస్థపై ఆధార పడి ఉందని మిత్రా చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 34 సువిధ ప్రొవైడర్లను నియమించామని, తాజా అంచనాల ప్రకారం వీరికి ఇంకా సమయం కావాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో 34 జీఎస్‌పీలు సరిపోతాయా అనే సందేహాలను ఆయన వ్యక్తం చేయడం గమనార్హం. కాగా జీఎస్టీ బిల్లును జూలై 1 నుంచి ఎలాగైనా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో జీఎస్టీ అమలుకు సంబంధించిన కసరత్తును శరవేగంగా పరుగులు తీయిస్తోంది. జూలై 1నుంచి అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రకటించారు. జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ రేపు (ఆదివారం) తుది సమావేశం కానున్న సంగతి తెలిసిందే. -
ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ ఉండాల్సిందే
న్యుఢిల్లీ: 2017,జూలై 1నుంచి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ కార్డు తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్( సీబీడీటీ) శనివారం మరోసారి తేల్చి చెప్పింది. అయితే దేశ అత్యున్నత కోర్టు ఇచ్చిన పాక్షిక ఉపశమనం నేపథ్యంలో ఆధార్ కార్డు లేని వారి పాన్ కార్డులు రద్దు చేయబోమని సీబీడీటీ స్పష్టం చేసింది. ఇంతవరకూ ఆధార్ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చన్న సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అత్యున్నత బాడీ ఈ వివరణ ఇచ్చింది. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ శుక్రవారం పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. అలాగే ఆధార్ కోసం దరఖాస్తు చేసి ఇంకా పొందని వారికి పాన్‌కార్డుతో అనుసంధానం నుంచి మినహాయింపుతోపాటు, వారి పాన్‌కార్డుల్ని చెల్లనివిగా ప్రకటించకూడదని ఆదేశించింది. పాన్ జారీ, ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను తీసుకురావడం తెలిసిందే. -
జీఎస్టీకి పార్లమెంట్ ఓకే
-
జీఎస్టీకి పార్లమెంట్ ఓకే
♦ మూజువాణి ఓటుతో 4 జీఎస్టీ బిల్లులకు రాజ్యసభ ఆమోదం ♦ జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు మార్గం సుగమం ♦ ఎస్జీఎస్టీని రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించడమే తరువాయి న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 1 నుంచి ఒక దేశం– ఒక పన్ను పాలనకు మార్గం సుగమం చేస్తూ జీఎస్టీ బిల్లుల్ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. కేంద్ర జీఎస్టీ బిల్లు(సీజీఎస్టీ)2017, సమీకృత జీఎస్టీ బిల్లు(ఐజీఎస్టీ) 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం) బిల్లు 2017, కేంద్రపాలిత ప్రాంత జీఎస్టీ బిల్లు(యూటీజీఎస్టీ) 2017ను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రతిపక్షాలు కొన్ని సవరణలు సూచించినా సభ వాటిని తిరస్కరించింది. కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ సవరణ ప్రతిపాదించినా.. మాజీ ప్రధాని మన్మోహన్æ సలహా మేరకు దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లుల్ని లోక్‌సభ ఆమోదించింది. రాష్ట్రాల జీఎస్టీ(ఎస్జీఎస్టీ) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదిస్తే.. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఆమోదం అందరి ఘనత: జైట్లీ రాజ్యసభలో జీఎస్టీపై సుదీర్ఘ చర్చకు ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానమిస్తూ... జీఎస్టీ బిల్లులో యూపీఏ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందన్నారు. ఇది అందరి ఘనతని ఒప్పుకునేందుకు తాను సంకోచించడం లేదన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదంలో రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాల భాగస్వామ్యం ఉందని చెప్పారు. శిక్షల తీవ్రత తగ్గించాలి: ప్రతిపక్ష సభ్యులు అంతకుముందు సీపీఎం నేత సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకోలేదని, అలాంటప్పుడు రాష్ట్రాలకు ఇక ఏం హక్కులు ఉంటాయని ప్రశ్నించారు. జీఎస్టీ మొదటి సంవత్సరం ఏదైనా నేరానికి పాల్పడితే దానిని నాన్ బెయిలబుల్‌గా పరిగణించ వద్దంటూ బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా కోరారు. ఆమోదాన్ని ప్రశంసించిన మన్మోహన్ జీఎస్టీ బిల్లును ఆమోదించడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ ప్రశంసించారు. బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందని, అయితే అమలులో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ పన్ను రద్దు బిల్లుకు ఆమోదం పెట్రోలియం ఉత్పత్తులు మినహా మిగతా ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను, వివిధ సేవలపై సేవా పన్ను, వస్తువుల అమ్మకాలు, కొనుగోలుపై వ్యాట్‌ను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఎక్కువ శాతం ఉత్పత్తులకు పన్ను మినహాయింపు ఎక్కువ శాతం ఉత్పత్తులపై పన్ను ఉండదని, మిగతా వాటిని 5, 12, 18, 28 శాతాల శ్లాబుల్లో చేరుస్తామని జైట్లీ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి మినహాయిస్తామని, అనుబంధ ఉత్పత్తుల్ని పన్ను పరిధి నుంచి తొలగిస్తామన్నారు. ప్రస్తుతం ఆహార వస్తువులపై పన్ను లేదని, జీఎస్టీలోనూ విధించమన్నారు. ఇతర నిత్యావసర వస్తువుల్ని తక్కువ పన్ను పరిధిలో ఉంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక విలాస వస్తువులు, పొగాకు వంటి వాటిపై అదనపు పన్ను విధించి.. రాష్ట్రాలకు ఏర్పడే నష్టాల్ని భర్తీ చేస్తామన్నారు. జీఎస్టీ నెట్వర్క్(ఐటీ)పై పలువురు సభ్యులు ఆందోళనకు సమాధానమిస్తూ.. ప్రస్తుత జీఎస్టీ ఐటీ విభాగం అత్యుత్తమంగా ఉందని, ప్రతీ నెల వందల కోట్ల రసీదుల్ని పరిశీలించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
జూలై 1 నుంచి జీఎస్టీ అమలు
న్యూఢిల్లీ: దేశంలో ఒక జాతి..ఒక పన్ను విధానానికి మార్గం సుగమం అయింది. గూడ్స్ అండ్ సర్వీసు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు సర్వం సిద్ధమైనట్టు ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ మంగళవారం విలేకరులు తెలిపారు. జులై 1, 2017 నుంచి జీఎస్టీ అమలు చేయనున్నట్టు ఈ మేరకు అన్ని రాష్ట్రాలు అమోదం తెలిపినట్టు ఆయన ప్రకటించారు. దీని అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కారమైనట్టు తెలిపారు. బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్కరణలను అమలు చేయనున్నట్టు తెలిపారు. దీనిపై ఎనలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు జిఎస్టీ అమలుకు లైన్ క్లియర్ కావడంతో మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా లాజిస్టిక్ షేర్లు ర్యాలీ అవుతున్నాయి. కాగా దేశమంతటా ఏకరీతి పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించినదే వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) బిల్లు. దీన్ని అనుకున్న సమయానికి అమల్లోకి తేనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ జైట్లీ పదేపదే ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. -
జీఎస్టీ అమలు తేదీ ఖరారు
-
జీఎస్టీ జూలై 1 నుంచి..
• జీఎస్టీపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం • పన్ను చెల్లింపుదారుల ఉమ్మడి నియంత్రణపై • రాష్ట్రాల డిమాండ్‌కు అంగీకారం న్యూఢిల్లీ: జీఎస్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది. 90 శాతం చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులపై నియంత్రణను రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించడంతో ఇంతకాలం కొనసాగిన ప్రతిష్టంభనకుతెరపడింది. ఇదే సమయంలో జీఎస్టీని ఏప్రిల్ 1 నుంచి కాకుండా జూలై 1 నుంచి అమలు చేయాలని మండలి నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమలు తేదీపై సోమవారం జైట్లీ నేతృత్వంలోని మండలి సమావేశమైంది. అనంతరం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జీఎస్టీ అమలు తేదీని మూడు నెలలు వాయిదా వేసినట్లు చెప్పారు. ఐజీఎస్టీ చట్టం ముసాయిదాల అనుమతి తదితరాల కోసం జీఎస్టీ మండలి తదుపరి సమావేశం వచ్చే నెల 18న జరగనుందని తెలిపారు. ‘వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేనప్పటికీ.. ఆఖరికి 90 శాతం హక్కులు రాష్ట్రాలకు, 10శాతం హక్కులు కేంద్రానికి ఉండేందుకుఅంగీకరించాం. రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్రం, రాష్ట్రాలు 50:50 హక్కులు కలిగి ఉంటాయి’అని జైట్లీ వివరించారు. అయితే పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు మాత్రం జీఎస్టీతో రెవెన్యూ భారీగా కోల్పోతామనిఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు కూడా తమ ఆదాయాలకు భారీగా గండికొట్టిందని చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారాన్ని పెంచాలని బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. వార్షికటర్నోవర్ రూ. 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై నూటికి నూరు శాతం తమకే అధికారం కావాలని కూడా కోరుతున్నాయి. జీఎస్టీ మండలి సమావేశంలో తమ అసమ్మతి తెలిపామని పశ్చిమ బెంగాల్ ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రాతెలిపారు. కేరళ ఆర్థికశాఖ మంత్రి టీఎం థామస్ ఇసాక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. -
జీఎస్టీ డెడ్‌లైన్ వాయిదా పడింది!
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న జీఎస్టీ అమలు తేదీ వాయిదా పడింది. జీఎస్టీ అమలును 2017 జూలై 1కు వాయిదా వేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పన్ను అధికారాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనందున్న ఈ అమలు తేదీని వాయిదా వేస్తున్నట్టు జైట్లీ తెలిపారు. జీఎస్టీ అమలు తేదీపై నేడు సమావేశమైన అరుణ్ జైట్లీ నేతృత్వంలోని కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తదుపరి మీటింగ్ ఫిబ్రవరి 18న జరుగనుంది. వార్షిక టర్నోవర్ 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయంపై కేంద్రం సుముఖంగా లేనప్పటికీ, ఆఖరికి 90 శాతం హక్కులు రాష్ట్రాలకు, 10 శాతం కేంద్రానికి ఉంటాయని అరుణ్ జైట్లీ తెలిపారు. రూ.1.5 కోట్లకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్ర, రాష్ట్రాలు 50:50 హక్కులు కలిగి ఉండనున్నట్టు చెప్పారు. అయితే పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలు ఈ విషయంలో వాదిస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో తమ రెవెన్యూలు భారీగా కోల్పోతామని పేర్కొంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు కూడా తమ రెవెన్యూలకు గండికొడుతున్నాయని చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో కేంద్రం చెల్లించే నష్టపరిహారాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. -
డాక్టరుగారూ... బాగున్నారా?
డాక్టర్స్ డే: జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం అందరి ప్రాణాలూ కాపాడటానికి అహరహం అలుపెరుగకుండా శ్రమిస్తారు వాళ్లు. అయినా వాళ్ల ప్రాణాలకు మాత్రం సుఖశాంతులు తక్కువే సమాజంలో గౌరవం సరే, దానికి వారు చెల్లించే మూల్యం... చిన్ని చిన్ని సరదాలు, కుటుంబంతో గడిపే కాలం. చిన్న పొరపాటు జరిగినా వైద్యులను నిందించే జనం... వైద్యుల సమస్యలను ఎన్నడైనా పట్టించుకుంటున్నారా..? అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్‌బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్‌ఫైటర్స్ అలా చేయరు... చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్‌ఫైటర్స్. నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్‌ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్‌ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్‌కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్‌లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు. అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి. మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్‌కు సెలవులు లేవు. సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి. అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు. ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే... ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్‌స్డ్ హ్యాండ్‌వాష్‌లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు. ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ... రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కుటుంబ సమస్యలు వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు. సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే. - యాసీన్ భారత్‌లో మెడికల్ కాలేజీలు 420 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 200 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 220 వీటిలో మొత్తం సీట్లు 52,765 రిజిస్టర్డ్ అల్లోపతిక్ వైద్యులు 9,38,861 డెంటల్ వైద్యులు 1,54,000 ఆయుష్ వైద్యులు 7,37,000 ‘హాయ్’ చెప్పే ఇన్ఫెక్షన్లు డాక్టర్లను ఇన్ఫెక్షన్లు నిత్యం పలకరిస్తుంటాయి. వారికి రోజూ ‘హాయ్’ చెబుతాయి. ఇది అతిశయోక్తి అనుకుంటే పొరబాటు. హాస్పిటల్స్‌లో రోగులు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి వారిని ఆశ్రయించుకుని రోగకారక సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా హాస్పిటల్స్‌లోనూ, ఐసీయూలలోనూ వచ్చే ఇన్ఫెక్షన్స్ను ఆసుపత్రుల సాంకేతిక పరిభాషలో ‘హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్’ (హాయ్) అంటారు. ఇక మరో రకమైన ‘హాయ్’ కూడా డాక్టర్లను పలకరిస్తుంది. ‘హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్సే ఆ మరో ‘హాయ్’. ఇలా తాము చికిత్స కోసం వచ్చిన జబ్బు వల్ల కాకుండా, హాస్పిటల్‌ను సందర్శించాక వచ్చే జబ్బును ‘హాయ్’ అంటారు. సాధారణంగా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే ప్రతి 20 మంది రోగుల్లో ఒకరు ఆసుపత్రిలో మరో జబ్బుకు గురవుతారని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధ్యయనంలో వెల్లడైంది. అంటే కాసేపు సందర్శన వల్లనో లేదా ఒక గంట కన్సల్టేషన్‌కు వచ్చినందువల్లనో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఇంతగా ఉందంటే మరి డాక్టర్లుకు ఉండదా? ఎందుకు ఉండదూ... వారూ మానవమాత్రులే కదా. అందుకే వాళ్లకూ ఈ ప్రమాదం ఉంటుంది. కాకపోతే వాళ్లే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కాబట్టి వృత్తిరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తమ నుంచి భాగస్వామికీ... పిల్లలకూ ఇన్ఫెక్షన్ల ప్రమాదం రోగి నుంచి డాక్టర్లకే కాదు... వాళ్ల జీవిత భాగస్వామికీ, తాము ప్రేమగా చూసుకొనే తమ పిల్లలకూ వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాల నుంచి అందరినీ రక్షించడానికి వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడతారు గనుకనే డాక్టర్లు అంటే అందరికీ గౌరవం. సామాజికపరమైన ఇక్కట్లు డాక్టర్లు ఉత్సవాలు, ఫంక్షన్లు వంటి వేడుకలకు హాజరు కాలేకపోవడం చాలా సాధారణంగా కనిపించే అంశమే. ఒక్కోసారి తమ సొంత బిడ్డల పుట్టిన రోజు వేడుకలకు సైతం హాజరు కాలేని పరిస్థితులు వాళ్లలో చాలామందికి అనుభవమయ్యే విషయమే. దాంతో బంధువర్గాల్లో నిష్ఠురాలు మామూలే. స్నేహితులతో కులాసాగా గడపడం వైద్యవృత్తిలో గగనకుసుమమే. రోగులను నిత్యం విజిట్ చేసే వీరు ఏదైనా వేడుకల్లో విజిట్ చేయడం చాలా అరుదుగానే కనిపిస్తుంది. ఇక వృత్తిపరంగా కొనసాగే కాన్ఫరెన్స్‌లు మినహా వ్యక్తిగతంగా పర్యటనలూ తక్కువే. విదేశాలలో తిరిగినా అది తమ కాన్ఫరెన్సుల్లో భాగంగా కొనసాగే అవకాశాలే ఎక్కువ. అంతే తప్ప ఎప్పుడో గాని విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు దొరకవు. వృత్తిపరంగా అందరికంటే ఎక్కువ సామాజిక గౌరవం పొందే వీళ్లు... రోగులు మృతి చెందిన సమయంలో ఒక్కోసారి చేదు అనుభవాలను కూడా చవిచూడాల్సిన పరిస్థితి. అప్పటికే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న రోగులను రక్షించడానికి వీళ్లు శక్తివంచన లేకుండా పూనుకుంటారు. అలాంటి సమయాల్లో తమ వల్ల కాకపోయినా... రోగి మృతి చెందినప్పుడు చాలా సందర్భాల్లో వీరు నిందలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయాలలో చాలా అరుదుగానైనా భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1000 భారత్‌లో వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1700 డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోవాలంటే... 4,00,000 2022 నాటికి భారత్‌కు అదనంగా కావలసిన వైద్యుల సంఖ్య దురభిప్రాయాలు వద్దు... చికిత్సకు దూరం కావద్దు... ఆయన వయసు 86 ఏళ్లు. నాందేడ్ నుంచి వచ్చారు. అన్నవాహిక క్యాన్సరు. ఆహారనాళం పూర్తిగా మూసుకుపోయింది. మేజర్ ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డ తొలగించాలంటే ప్రాణాలకు ముప్పు కూడా ఉండవచ్చు. కారణం ఆయన క్రానిక్ స్మోకర్. పైగా ఊపిరితిత్తులు బాగాలేవు. ఇలాంటి వాళ్లకు ఆపరేషన్ టైమ్‌లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువే. అది రిస్క్‌తో కూడిన వ్యవహారం కాబట్టి సర్జరీ కాకుండా అన్నవాహికలోకి పైప్ వేసి, ఆహారం పంపించి రేడియేషన్ కూడా ఇద్దామని సూచించాం. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన మాటలు చాలా అసెర్టివ్‌గా ఉన్నాయి. ‘‘ఎనభై ఆరేళ్ల జీవితాన్ని చూశా. అన్ని బాధ్యతలూ తీర్చుకున్నా. ఈ వయసులో కేవలం బతకడం కోసం పైప్ వేసి, దాని ద్వారా ఆహారం పంపడం ఎందుకు. బతికినన్నాళ్లూ తింటూ, తాగుతూ సంతోషంగా బతకాలి. ఒకవేళ క్యాన్సర్ సర్జరీ చేస్తుండగానే చనిపోయాననుకోండి. ఈ వయసులో హాయిగా చనిపోవడం కంటే ఏం కావాలి. ఒకవేళ బతికాననుకోండి. నాకు ఇష్టమైనట్లుగా తింటూ, తాగుతూ సుఖంగా ఉంటా. అందుకే పైప్ వేసి, దాని ద్వారా ఆహారం తీసుకోవడం వద్దు. రిస్క్ అయినా ఆపరేషన్ చేయండి’’ అన్నారు. దాంతో మేం చాలా జాగ్రత్తగా కీహోల్ సర్జరీ చేసి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాం. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. తనకు ఇష్టమైనవి తింటూ తాగుతూ హ్యాపీగా జీవిస్తున్నాడు. మొన్ననే ఫాలో అప్‌కు వచ్చి వెళ్లారు. వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. క్యాన్సర్ చికిత్సలు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ మీద ఉన్న అనేక అపోహలతో చాలా మంది పెద్దవయసులో ఇలాంటి చికిత్సలు... తీసుకోవడానికి భయపడుతుంటారు. క్యాన్సర్ చికిత్సల్లో ఈ మధ్య వచ్చిన మార్పులతో పెద్దవయసులో కూడా చికిత్సలు తట్టుకునే అవకాశం ఉంది. అపోహలతో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే చికిత్సలతో ప్రాణాలు కాపాడుకోవడం మేలు. - డాక్టర్ మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఒక సర్జరీ... ఇద్దరి ప్రాణాలు కాపాడింది... సాధారణంగా బిడ్డను కనడం అంటేనే పునర్జన్మ. అలాంటిది 36 వారాల గర్భిణి ఉమాదేవి (25)కి గుండెలో సమస్య ఎదురైంది. గుండెలోని అతిపెద్ద రక్తనాళం (మహాధమని) బలహీనమైంది. ఒకరోజు ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దగ్గర్లోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పుడు గుండె పరీక్షలు చేశారు. ఉమాదేవికి మార్ఫన్స్ సిండ్రోమ్ ఉందని తేలింది. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. పుట్టుకతోనే కొందరిలో ఈ వ్యాధి మొదలవుతుంది. గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం బలహీనమవుతుంది. రక్తనాళంలో ఇంటిమా, మీడియా, అడ్వెంటీషియా అనే పొరలుంటాయి. రక్తప్రసరణ సరిగా చూసేందుకు ఇంటిమా తోడ్పడు తుంది. మీడియా, అడ్వెంటీషియా పొరలతో పాటు రక్తనాళం గోడల్లో ఉండే కొలాజెన్, ఎలాస్టిక్ ఫైబర్లు రక్తనాళానికి సపోర్ట్ చేస్తుంటాయి. రక్తం ఎక్కువ ఒత్తిడితో వెళ్తున్నప్పుడు అది బలంగా ఉండేందుకు దోహదపడతాయి. కొందరికి పుట్టుకతోనే కొలాజెన్ తక్కువగా ఉండి, అది క్రమంగా తగ్గుతూ పోవడం వల్ల రక్తనాళం బలహీనపడి, వాచిపోతుంది. దీన్నే అయోర్టికర్ డెసైక్షన్ లేదా మార్ఫన్స్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే రక్తనాళం చిట్లి రక్తం మొత్తం లీక్ అవుతుంది. అదే జరిగితే కొన్ని సెకండ్లలోనే రోగి మృతిచెందే అవకాశం ఉంది. దీనివల్ల అన్ని అవయవాలూ దెబ్బతిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి దారితీసే ప్రమాదం ఉంది. దీన్ని బెంటాల్స్ ప్రొసీజర్ అనే శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దాలి. కాబట్టి ఉమాదేవికి ఆ సర్జరీ అత్యవసరంగా చేయాలి. అదే ఆమె ప్రాణాలను కాపాడింది. ఒక ప్రాణాన్ని కాదు... ఇద్దరివి. ఆమె ప్రాణాన్ని, కడుపులోని ఆమె బిడ్డ ప్రాణాన్ని. ఆపరేషన్ సక్సెస్. తల్లీ బిడ్డా సేఫ్. - డాక్టర్ జి. రామసుబ్రమణ్యం, చీఫ్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిస్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఛాన్స్ 1% - రిజల్ట్ 100% ఆరోజు జనవరి 21... ఆదివారం. మా కుటుంబం అంతా వైజాగ్‌కు బయల్దేరింది. కుటుంబ సభ్యులంతా హ్యాపీ. సరిగ్గా బోర్డింగ్ పాస్‌లు తీసుకొని ఫ్లైట్ ఎక్కడానికి ముందుగా నాకు ఫోన్. అదీ హాస్పిటల్ నుంచి. పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్ స్థితిలో ఎమర్జెన్సీకి వచ్చారనీ, అర్జెంటుగా రమ్మని ఆ కాల్ సారాంశం. అంతే! ప్రయాణం కట్టిపెట్టి... బాబు, పాపలను సముదాయించి, నా భార్యకు విషయం చెప్పి హాస్పిటల్‌కు ప్రయాణం కట్టాను. నేను బయల్దేరే సమయంలోనే నా కొలీగ్ డాక్టర్ ఆర్ముగంకూ ఫోన్ చేశా. అతడూ భార్యాపిల్లలతో నగరం శివార్లలోని ఏదో రిసార్ట్‌లో హాలీడే ప్లాన్ చేసుకున్నాడు. నాలాగే అతడూ తన హాలీడేకు ఫుల్స్టాప్ పెట్టి బయల్దేరాడు. మేమిద్దరమూ ఇలా ఆగమేఘాల మీద ఆసుపత్రికి రావడానికి కారణం... 59 ఏళ్ల పేషెంట్. జనవరిలోనే ఒకసారి గుండెపోటు వచ్చింది. పదిరోజుల్లోనే మళ్లీ హార్ట్ ఎటాక్. హాస్పిటల్‌కు వచ్చే సమయానికి గుండె దాదాపు ఆగిపోయింది. ఎమర్జెన్సీ టీమ్ పేషెంట్‌కు ముందుగా ‘డీసీ షాక్స్’ ఇచ్చారు. గుండె స్పందనలు మొదలయ్యాయి. వెంటనే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌తో వెంటిలేటర్‌పై ఉంచారు. పేషెంట్ బతికేందుకు ఒక్క శాతమే ఛాన్స్ ఉంది. ఆలస్యం చేయకుండా ‘ఎండార్ట్ ఇరెక్టొమీ విత్ లెఫ్ట్ వెంట్రిక్యులార్ రిపేర్’ అనే సంక్లిష్టమైన సర్జరీకి పూనుకున్నాం. ఏడెనిమిది గంటలు సాగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వారం రోజుల తర్వాత పేషెంట్ కోలుకున్నాడు. మరో రెండు రోజుల తర్వాత లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్, వెంటిలేటర్ తొలగించాం. పేషెంట్ పూర్తిగా కోలుకొని మమ్మల్ని కళ్లతోనే ఆత్మీయంగా పలకరించాడు. కుటుంబాలతో హాలీడేని ఎంత ఎంజాయ్ చేసేవాళ్లమో తెలియదుగానీ... పేషెంట్‌కు మా బృందం ఇచ్చిన పునర్జన్మ మాకు అంతకంటే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని నమ్మకంగా చెప్పగలం. - డాక్టర్ పి.వి.నరేష్ కుమార్, కార్డియో థొరాసిక్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ మానసికమైన ఒత్తిళ్లూ ఎక్కువే... డాక్టర్ల వృత్తిగతమైన జీవితాల్లో మానసిక ఒత్తిళ్లూ చాలా ఎక్కువ. అవతలి వారి ప్రాణాలతో వ్యవహరించాల్సి రావడం వల్ల మిగతా వృత్తుల్లో కంటే వైద్యవృత్తిలో ఈ మానసిక ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ‘ఆ... ఈ జీవితం ఇలా తగలడిపోయింది’ అనడం సాధారణంగా వింటుంటాం. కానీ డాక్టర్ల జీవితాల్లో ఇలాంటి అభివ్యక్తికి నిజంగానే ‘బర్నవుట్’ అని పేరు పెట్టి అనేక అధ్యయనాలు నిర్వహించారు. కొన్ని దేశాల్లో డాక్టర్లపై ఈ అంశమై అనేక అధ్యయనాలు జరిగాయి. 2012లో యూఎస్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రతి ఇద్దరు ఫిజీషియన్లలో ఒకరిపై వృత్తిగతమైన ఒత్తిడి ఎక్కువ అని తేలింది. ఇది ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే జర్నల్‌లో నమోదైంది. ఇలాంటిదే మళ్లీ 2013లో నిర్వహించారు. దాదాపు 36 శాతం మంది ఫిజీషియన్లు బాధ్యతను భారంగా భావిస్తున్నారని 2,556 మంది డాక్టర్లపై నిర్వహించిన ఆ అధ్యయనంలో తేలింది. ఈ ఒత్తిడి 40 శాతం డాక్టర్లలో ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి చేరాక ఒకింత స్వేచ్ఛాజీవితం దొరికినట్లు భావిస్తుండటం మామూలే. అయితే వైద్యవిద్య అభ్యసించే వారికి మిగతా పిల్లలతో పోలిస్తే ఇలా స్వేచ్ఛాజీవితం లభించినట్లు భావించడం తక్కువేనని తేలింది. డాక్టర్స్ డే విషెస్ when there are tears, you are a shoulder when there is pain, you are a medicine when there is a tragedy, you are a hope happy doctor's day i want to say a big thanks for making me healthy and fit you are the best doctor i have ever known happy doctor's day may your days be wonderful and healthy like you make it for others. i want to thank you this doctor's day dawn of relief - obliging caring - tolerant omniscient -reasonable happy doctor's day అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్‌బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్‌ఫైటర్స్ అలా చేయరు... చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్‌ఫైటర్స్. నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్‌ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్‌ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్‌కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్‌లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు. అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి. మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్‌కు సెలవులు లేవు. సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి. అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు. ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే... ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్‌స్డ్ హ్యాండ్‌వాష్‌లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు. ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ... రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కుటుంబ సమస్యలు వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు. సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే. - యాసీన్ -
కథల ఎంపికలో నాన్నగారు కల్పించుకోరు
‘నోట్‌బుక్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు రాజీవ్ సాలూరి. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి వారసునిగా ఇండస్ట్రీకొచ్చినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రాజీవ్ నటించిన చిత్రం ‘టైటానిక్’. జి.రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజీవ్ చెప్పిన విశేషాలు... ఈ చిత్రంలో కార్తీక్ అనే కాలేజీ కుర్రాడి పాత్రలో నటించా. నేను, హీరోయిన్ ప్రేమించుకుంటాం. మనస్పర్థలు రావడంతో విడిపోతాం. అప్పుడు హీరోయిన్ను ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయిస్తారు. ఆ పెళ్లి ‘టైటానిక్’ అనే బోట్లో చేయాలనుకుంటారు. ఆ బోట్లోకి హీరో ఎలా ఎంటరయ్యాడు? పెళ్లిని ఎలా ఆపగలిగాడు? అన్నదే కథ గోదావరి నదిలో అంతర్వేది నుంచి అమలాపురం వెళ్లే టైటానిక్ బోట్లో ప్రయాణం కావడంతో ‘టైటానిక్’ అని టైటిల్ పెట్టాం. ‘గోదావరి’ చిత్రం కూడా బోట్లోనే చిత్రీకరించినా, రెండింటికీ పోలిక లేదు. దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది ‘సంగీత దర్శకుడివి అయ్యుంటే అండగా ఉండేవాణ్ణి. కానీ, నువ్వు హీరో అయ్యావు. కథల ఎంపికలో నీ నిర్ణయాలు నువ్వే తీసుకో’ అని నాన్నగారు అన్నారు. ఆయన సలహాలు ఇస్తారే కానీ, ఇన్వాల్వ్ కారు. ‘టైటానిక్’ తర్వాత ‘కేటుగాడు’ డెరైక్టర్ కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ బాలసాని నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నా. -
ఆ రైళ్లకు వెయిటింగ్ లిస్టు టికెట్లు ఇక ఉండవు!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేశాఖ టికెట్ల జారీ, రీ ఫండ్‌కు సంబంధించి సరికొత్త నియమాలను ప్రవేశపెట్టింది. జులై 1 నుంచి అమలులోకి రానున్న ఈ నియమాలతో రైలు ప్రయాణికులకు కొన్ని లాభాలు కనిపించినా, కొన్ని విషయాల్లో మాత్రం సాధారణ ప్రయాణికులకు నష్టం కలిగించేలాగే ఉన్నాయి. ప్రధానంగా సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్టు టికెట్ల జారీని పూర్తిగా రద్దు చేస్తున్నారు. వాటిలో కేవలం ఆర్ఏసీ టికెట్లను మాత్రమే ఇస్తారట. దాంతోపాటు, టికెట్లు రద్దు చేసుకున్నవారికి తిరిగిచ్చే రీఫండ్ విషయంలో కూడా నిబంధనలు మారాయి. మారిన కొత్త నిబంధనలు ఏంటో ఓసారి చూద్దాం.. - తత్కాల్ టికెట్లను రద్దు చేసుకునే ప్రయాణికులు టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు. ఇంతకుముందు తత్కాల్ టికెట్లు రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి వచ్చేది కాదు. - ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కేవలం ఏసీ తత్కాల్ టికెట్లకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు తత్కాల్ సాధారణ టికెట్లను అమ్మకానికి ఉంచనున్నారు. - సువిధ టికెట్లను క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులు టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు. - ఏసీ టైర్-1 లేదా టైర్ 2 టికెట్ ను కేన్సిల్ చేసుకునేవారు వందకి 50 రూపాయల చొప్పున తిరిగి పొందనున్నారు. ఏసీ టైర్-3, చైర్ కార్, ఎకానమీ, టికెట్ ను కేన్సిల్ చేసుకున్న ప్రయాణికులు వందకు 90 రూపాయలు, స్లీపర్ క్లాస్ ప్రయాణికులు వందకు 60 రూపాయలను తిరిగి పొందనున్నారు. - ఇక నుంచి సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీకి రైల్వేశాఖ ఉద్వాసన పలికింది. వాటిలో కేవలం రిజర్వేషన్ అగైనెస్ట్ కేన్సిలేషన్ (ఆర్ఏసీ) ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. - రాజధాని, శతాబ్ది రైళ్లలో బోగీల సంఖ్య పెరగనుంది. - రాజధాని, శతాబ్ది రైళ్లలో మొబైల్ టికెట్లను అందుబాటులోకి తేనున్నారు. - కేవలం ఇంగ్లీషులోనే అందుబాటులో ఉన్న రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్ ను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తేనున్నారు. - ప్రస్తుతం రైల్వే శాఖ నడుపుతున్న ప్రీమియం రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి. -
కటాఫ్ జూలై 1
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు సోమవారం విడుదల చేశారు. బదిలీలకు జూలై 1వ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలని, ప్రతి పాఠశాలలో కనీసం ఒక టీచర్ ఉండేలా హేతుబద్ధీకరణ చేపట్టాలని అందులో పేర్కొన్నారు. బదిలీల కోసం టీచర్లు దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూలై 1 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవోలకు తెలియజేశారు. మార్గదర్శకాలు.. 1. హేతుబద్ధీకరణలో గుర్తించిన అదనపు ఎస్జీటీ పోస్టులను ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఆధారంగా అవరోహణ క్రమంలో కేటాయించాలి 2. ప్రాథమిక పాఠశాలల్లో సర్దుబాటు కాగా మిగిలిన ఎస్జీటీ పోస్టులను ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా పండిట్ల స్థానంలో కేటాయించాలి 3. ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయగా మిగిలిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇటీవల అప్‌గ్రేడై పోస్టులు మంజూరవని పాఠశాలలకు కేటాయించాలి. ఇంకా మిగిలితే ప్రాథమికోన్నత పాఠ శాలలకు, తర్వాత అధికంగా విద్యార్థులున్న పాఠశాలలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలి 4. స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్) లేకుంటే భాషా పండితుల పోస్టులనే కొనసాగించాలి 5. ఉన్నత పాఠశాలలకు సరిపడినంత మంది సబ్జెక్ట్ టీచర్లను ఇవ్వలేనపుడు అక్కడి ఎస్జీటీ పోస్టులను అక్కడే కొనసాగించాలి 6. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టును ప్రాథమిక పాఠశాలలకు తరలించాలి 7. హెచ్ఆర్ఏలో మార్పుల వల్ల స్కూళ్ల కేటగిరీలు మారితే ఆ దామాషాలోనే ఉపాధ్యాయులకు పాయింట్లను లెక్కించాలి 8. సక్సెస్ స్కూళ్లగా మారిన బాలికోన్నత పాఠశాలలు కో-ఎడ్యుకేషన్‌గానే మార్చాలి. 9. భాషలు మినహా మిగతా ఉపాధ్యాయులందరికీ బదిలీల కౌన్సెలింగ్‌ను మీడియంవారీగా నిర్వహించాలి 10. ఆన్లైన్లో నమోదు చేయని దరఖాస్తులను అంగీకరించరు 11. బదిలీలకు ఖాళీలు చూపి, టీచర్లు చేరే సమయంలో ఖాళీలు లేవని పేర్కొంటే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలుంటాయి 12. పాఠ్యపుస్తకాల రచయితలను రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్లుగా గుర్తించి పాయింట్లు కేటాయించాలి 13. సెప్టెంబర్ 5న జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారికే అవార్డు పాయింట్లివ్వాలి 14. గతేడాది డైస్లో విద్యార్థుల సంఖ్య పొరపాటుగా నమోదై ఉంటే హాజరు రిజిస్టర్లు, వార్షిక పరీక్షాపత్రాలను డీఈవోలు పరిశీలించి డీఎస్‌ఈకి నివేదించాలి 15. ఏజెన్సీ ప్రాంతంలో పదోన్నతులను జీవో నంబరు 3 ప్రకారం ఇవ్వాలి 16. ప్రతి స్కూల్లో కనీసం ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడుండేలా చూడాలి 17. 2011లో అదనంగా ఉన్న ఫిజికల్ సైన్స్ టీచర్లను గణితం బోధనకు తరలించారు. ప్రస్తుతం ఆ స్కూళ్లకు గణితం పోస్టు అవసరమైతే అక్కడ వారినే కొనసాగించాలి 18. అదనంగా ఉన్నట్లు తేలి ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను డీఈవో కార్యాలయంలో రిజర్వ్ చేయాలి. వాటిని తదుపరి పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి 19. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే సమీప స్కూలును కోరుకోవాలి. ఇద్దరూ టీచర్లై తప్పనిసరిగా బదిలీ అవుతుంటే ఒకరు ఎక్కడికైనా కోరుకోవచ్చు. రెండోవారు మాత్రం మొదట బదిలీ అయిన వారికి సమీపంలో కోరుకోవాలి 20. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపున్న ఆసుపత్రుల్లో చికిత్సకు సంబంధిత వైద్యులిచ్చిన ధ్రువపత్రాలను ప్రాధాన్యతా కేటగిరీ బదిలీలకు అనుమతించాలి 22. 610 జీవో ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ అయి రిలీవ్ కాకుండా కొనసాగుతున్న టీచర్లను ప్రస్తుత బదిలీల్లో అనుమతించాలి 23. బదిలీల కౌన్సెలింగ్ రోజు హాజరైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీగా పరిగణించాలి 24. తప్పనిసరి బదిలీల్లో ఉండి కౌన్సెలింగ్‌కు హాజరవని టీచర్లు, హెచ్ఎంలను కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన ఖాళీలకు బదిలీ చేయాలి 25. బదిలీ ఉత్తర్వులు పొందిన టీచర్లు వెంటనే రిలీవై మర్నాడే కొత్త స్కూళ్లలో చేరాలి. ఏవిధమైన వెయింటింగ్ పీరియడ్ ఇవ్వరు.