డాక్టరుగారూ... బాగున్నారా? | On july 1st National Doctors' Day! | Sakshi
Sakshi News home page

డాక్టరుగారూ... బాగున్నారా?

Published Sat, Jun 25 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

డాక్టరుగారూ... బాగున్నారా?

డాక్టరుగారూ... బాగున్నారా?

డాక్టర్స్ డే: జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం
అందరి ప్రాణాలూ కాపాడటానికి అహరహం అలుపెరుగకుండా శ్రమిస్తారు వాళ్లు. అయినా వాళ్ల ప్రాణాలకు మాత్రం సుఖశాంతులు తక్కువే సమాజంలో గౌరవం సరే, దానికి వారు చెల్లించే మూల్యం... చిన్ని చిన్ని సరదాలు, కుటుంబంతో గడిపే కాలం. చిన్న పొరపాటు జరిగినా వైద్యులను నిందించే జనం... వైద్యుల సమస్యలను ఎన్నడైనా పట్టించుకుంటున్నారా..?
 
అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్‌బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ  ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్‌ఫైటర్స్ అలా చేయరు...  చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్‌ఫైటర్స్.
 
నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్‌ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్‌ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా  రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్‌కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్‌లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు.

అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక  క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి.
 
మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్‌కు సెలవులు లేవు. సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి.
 
అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ  రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు.
 
ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే...

 ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్‌లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్‌పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి  అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.

ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్‌కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది.

అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్‌స్డ్ హ్యాండ్‌వాష్‌లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్‌లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు.
 
ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ...
రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్‌ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.
 
కుటుంబ సమస్యలు
వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది.

దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు. సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే.
 - యాసీన్
 
భారత్‌లో మెడికల్ కాలేజీలు 420
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 200
ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 220
వీటిలో మొత్తం సీట్లు 52,765
రిజిస్టర్డ్ అల్లోపతిక్ వైద్యులు 9,38,861
డెంటల్ వైద్యులు 1,54,000
ఆయుష్ వైద్యులు 7,37,000

 
‘హాయ్’ చెప్పే ఇన్ఫెక్షన్లు
డాక్టర్లను ఇన్ఫెక్షన్లు నిత్యం పలకరిస్తుంటాయి. వారికి రోజూ ‘హాయ్’ చెబుతాయి. ఇది అతిశయోక్తి అనుకుంటే పొరబాటు. హాస్పిటల్స్‌లో రోగులు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి వారిని ఆశ్రయించుకుని రోగకారక సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా హాస్పిటల్స్‌లోనూ, ఐసీయూలలోనూ వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను ఆసుపత్రుల సాంకేతిక పరిభాషలో ‘హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్’  (హాయ్) అంటారు.

ఇక మరో రకమైన ‘హాయ్’ కూడా డాక్టర్లను పలకరిస్తుంది. ‘హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్సే ఆ మరో ‘హాయ్’. ఇలా తాము చికిత్స కోసం వచ్చిన జబ్బు వల్ల కాకుండా, హాస్పిటల్‌ను సందర్శించాక వచ్చే జబ్బును ‘హాయ్’ అంటారు. సాధారణంగా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే ప్రతి 20 మంది రోగుల్లో ఒకరు ఆసుపత్రిలో మరో జబ్బుకు గురవుతారని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధ్యయనంలో వెల్లడైంది.

అంటే కాసేపు సందర్శన వల్లనో లేదా ఒక గంట కన్సల్టేషన్‌కు వచ్చినందువల్లనో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఇంతగా ఉందంటే మరి డాక్టర్లుకు ఉండదా? ఎందుకు ఉండదూ... వారూ మానవమాత్రులే కదా. అందుకే వాళ్లకూ ఈ ప్రమాదం ఉంటుంది. కాకపోతే వాళ్లే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కాబట్టి వృత్తిరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
 
తమ నుంచి భాగస్వామికీ... పిల్లలకూ
ఇన్ఫెక్షన్ల ప్రమాదం రోగి నుంచి డాక్టర్లకే కాదు... వాళ్ల జీవిత భాగస్వామికీ, తాము ప్రేమగా చూసుకొనే తమ పిల్లలకూ వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాల నుంచి అందరినీ రక్షించడానికి వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడతారు గనుకనే డాక్టర్లు అంటే అందరికీ గౌరవం.  
 
సామాజికపరమైన ఇక్కట్లు
డాక్టర్లు ఉత్సవాలు, ఫంక్షన్లు వంటి వేడుకలకు హాజరు కాలేకపోవడం చాలా సాధారణంగా కనిపించే అంశమే. ఒక్కోసారి తమ సొంత బిడ్డల పుట్టిన రోజు వేడుకలకు సైతం హాజరు కాలేని పరిస్థితులు వాళ్లలో చాలామందికి అనుభవమయ్యే విషయమే. దాంతో బంధువర్గాల్లో నిష్ఠురాలు మామూలే. స్నేహితులతో కులాసాగా గడపడం వైద్యవృత్తిలో గగనకుసుమమే.

రోగులను నిత్యం విజిట్ చేసే వీరు ఏదైనా వేడుకల్లో విజిట్ చేయడం చాలా అరుదుగానే కనిపిస్తుంది. ఇక వృత్తిపరంగా కొనసాగే కాన్ఫరెన్స్‌లు మినహా వ్యక్తిగతంగా పర్యటనలూ తక్కువే. విదేశాలలో తిరిగినా అది తమ కాన్ఫరెన్సుల్లో భాగంగా కొనసాగే అవకాశాలే ఎక్కువ. అంతే తప్ప ఎప్పుడో గాని విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు దొరకవు. వృత్తిపరంగా అందరికంటే ఎక్కువ సామాజిక గౌరవం పొందే వీళ్లు...

రోగులు మృతి చెందిన సమయంలో ఒక్కోసారి చేదు అనుభవాలను కూడా చవిచూడాల్సిన పరిస్థితి. అప్పటికే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న రోగులను రక్షించడానికి వీళ్లు శక్తివంచన లేకుండా పూనుకుంటారు. అలాంటి సమయాల్లో తమ వల్ల కాకపోయినా... రోగి మృతి చెందినప్పుడు చాలా సందర్భాల్లో వీరు నిందలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయాలలో చాలా అరుదుగానైనా భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉంటాయి.
 
డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల ప్రకారం వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1000
భారత్‌లో వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1700
డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలను అందుకోవాలంటే... 4,00,000
2022 నాటికి భారత్‌కు అదనంగా కావలసిన వైద్యుల సంఖ్య

 
దురభిప్రాయాలు వద్దు... చికిత్సకు దూరం కావద్దు...
ఆయన వయసు 86 ఏళ్లు. నాందేడ్ నుంచి వచ్చారు. అన్నవాహిక క్యాన్సరు. ఆహారనాళం పూర్తిగా మూసుకుపోయింది. మేజర్ ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డ తొలగించాలంటే ప్రాణాలకు ముప్పు కూడా ఉండవచ్చు. కారణం ఆయన క్రానిక్ స్మోకర్. పైగా ఊపిరితిత్తులు బాగాలేవు.

ఇలాంటి వాళ్లకు ఆపరేషన్ టైమ్‌లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువే. అది రిస్క్‌తో కూడిన వ్యవహారం కాబట్టి సర్జరీ కాకుండా అన్నవాహికలోకి పైప్ వేసి, ఆహారం పంపించి రేడియేషన్ కూడా ఇద్దామని సూచించాం. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన మాటలు చాలా అసెర్టివ్‌గా ఉన్నాయి. ‘‘ఎనభై ఆరేళ్ల జీవితాన్ని చూశా. అన్ని బాధ్యతలూ తీర్చుకున్నా. ఈ వయసులో కేవలం బతకడం కోసం పైప్ వేసి, దాని ద్వారా ఆహారం పంపడం ఎందుకు. బతికినన్నాళ్లూ తింటూ, తాగుతూ సంతోషంగా బతకాలి.

ఒకవేళ క్యాన్సర్ సర్జరీ చేస్తుండగానే చనిపోయాననుకోండి. ఈ వయసులో హాయిగా చనిపోవడం కంటే ఏం కావాలి. ఒకవేళ బతికాననుకోండి. నాకు ఇష్టమైనట్లుగా తింటూ, తాగుతూ సుఖంగా ఉంటా. అందుకే పైప్ వేసి, దాని ద్వారా ఆహారం తీసుకోవడం వద్దు. రిస్క్ అయినా ఆపరేషన్ చేయండి’’ అన్నారు. దాంతో మేం చాలా జాగ్రత్తగా కీహోల్ సర్జరీ చేసి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాం. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. తనకు ఇష్టమైనవి తింటూ తాగుతూ హ్యాపీగా జీవిస్తున్నాడు.

మొన్ననే ఫాలో అప్‌కు వచ్చి వెళ్లారు. వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. క్యాన్సర్ చికిత్సలు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ మీద ఉన్న అనేక అపోహలతో చాలా మంది పెద్దవయసులో ఇలాంటి చికిత్సలు... తీసుకోవడానికి భయపడుతుంటారు. క్యాన్సర్ చికిత్సల్లో ఈ మధ్య వచ్చిన మార్పులతో పెద్దవయసులో కూడా చికిత్సలు తట్టుకునే అవకాశం ఉంది. అపోహలతో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే చికిత్సలతో ప్రాణాలు కాపాడుకోవడం మేలు.  
- డాక్టర్ మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
 
ఒక సర్జరీ... ఇద్దరి ప్రాణాలు కాపాడింది...

సాధారణంగా బిడ్డను కనడం అంటేనే పునర్జన్మ. అలాంటిది 36 వారాల గర్భిణి ఉమాదేవి (25)కి గుండెలో సమస్య ఎదురైంది. గుండెలోని అతిపెద్ద రక్తనాళం (మహాధమని) బలహీనమైంది. ఒకరోజు ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దగ్గర్లోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పుడు గుండె పరీక్షలు చేశారు. ఉమాదేవికి మార్ఫన్స్ సిండ్రోమ్ ఉందని తేలింది. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. పుట్టుకతోనే కొందరిలో ఈ వ్యాధి మొదలవుతుంది.

గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం బలహీనమవుతుంది. రక్తనాళంలో ఇంటిమా, మీడియా, అడ్వెంటీషియా అనే పొరలుంటాయి. రక్తప్రసరణ సరిగా చూసేందుకు ఇంటిమా తోడ్పడు తుంది. మీడియా, అడ్వెంటీషియా పొరలతో పాటు రక్తనాళం గోడల్లో ఉండే కొలాజెన్, ఎలాస్టిక్ ఫైబర్లు రక్తనాళానికి సపోర్ట్ చేస్తుంటాయి. రక్తం ఎక్కువ ఒత్తిడితో వెళ్తున్నప్పుడు అది బలంగా ఉండేందుకు దోహదపడతాయి.

కొందరికి పుట్టుకతోనే కొలాజెన్ తక్కువగా ఉండి, అది క్రమంగా తగ్గుతూ పోవడం వల్ల రక్తనాళం బలహీనపడి, వాచిపోతుంది. దీన్నే అయోర్టికర్ డెసైక్షన్ లేదా మార్ఫన్స్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే రక్తనాళం చిట్లి రక్తం మొత్తం లీక్ అవుతుంది. అదే జరిగితే కొన్ని సెకండ్లలోనే రోగి మృతిచెందే అవకాశం ఉంది. దీనివల్ల అన్ని అవయవాలూ దెబ్బతిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి దారితీసే ప్రమాదం ఉంది. దీన్ని బెంటాల్స్ ప్రొసీజర్ అనే శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దాలి. కాబట్టి ఉమాదేవికి ఆ సర్జరీ అత్యవసరంగా చేయాలి. అదే ఆమె ప్రాణాలను కాపాడింది. ఒక ప్రాణాన్ని కాదు... ఇద్దరివి. ఆమె ప్రాణాన్ని, కడుపులోని ఆమె బిడ్డ ప్రాణాన్ని. ఆపరేషన్ సక్సెస్. తల్లీ బిడ్డా సేఫ్.
- డాక్టర్ జి. రామసుబ్రమణ్యం, చీఫ్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిస్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
 
ఛాన్స్ 1% - రిజల్ట్ 100%
ఆరోజు జనవరి 21... ఆదివారం. మా కుటుంబం అంతా వైజాగ్‌కు బయల్దేరింది. కుటుంబ సభ్యులంతా హ్యాపీ. సరిగ్గా బోర్డింగ్ పాస్‌లు తీసుకొని ఫ్లైట్ ఎక్కడానికి ముందుగా నాకు ఫోన్. అదీ హాస్పిటల్ నుంచి. పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్ స్థితిలో ఎమర్జెన్సీకి వచ్చారనీ, అర్జెంటుగా రమ్మని ఆ కాల్ సారాంశం. అంతే! ప్రయాణం కట్టిపెట్టి... బాబు, పాపలను సముదాయించి, నా భార్యకు విషయం చెప్పి హాస్పిటల్‌కు ప్రయాణం కట్టాను.

నేను బయల్దేరే సమయంలోనే నా కొలీగ్ డాక్టర్ ఆర్ముగంకూ ఫోన్ చేశా. అతడూ భార్యాపిల్లలతో నగరం శివార్లలోని ఏదో రిసార్ట్‌లో హాలీడే ప్లాన్ చేసుకున్నాడు. నాలాగే అతడూ తన హాలీడేకు ఫుల్‌స్టాప్ పెట్టి బయల్దేరాడు. మేమిద్దరమూ ఇలా ఆగమేఘాల మీద ఆసుపత్రికి రావడానికి కారణం... 59 ఏళ్ల పేషెంట్. జనవరిలోనే ఒకసారి గుండెపోటు వచ్చింది. పదిరోజుల్లోనే మళ్లీ హార్ట్ ఎటాక్.  

హాస్పిటల్‌కు వచ్చే సమయానికి గుండె దాదాపు ఆగిపోయింది. ఎమర్జెన్సీ టీమ్ పేషెంట్‌కు ముందుగా ‘డీసీ షాక్స్’ ఇచ్చారు. గుండె స్పందనలు మొదలయ్యాయి. వెంటనే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌తో వెంటిలేటర్‌పై ఉంచారు. పేషెంట్ బతికేందుకు ఒక్క శాతమే ఛాన్స్ ఉంది. ఆలస్యం చేయకుండా ‘ఎండార్ట్ ఇరెక్టొమీ విత్ లెఫ్ట్ వెంట్రిక్యులార్ రిపేర్’ అనే సంక్లిష్టమైన సర్జరీకి పూనుకున్నాం. ఏడెనిమిది గంటలు సాగిన ఆపరేషన్ సక్సెస్  అయ్యింది.

వారం రోజుల తర్వాత పేషెంట్ కోలుకున్నాడు. మరో రెండు రోజుల తర్వాత లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్, వెంటిలేటర్ తొలగించాం. పేషెంట్ పూర్తిగా కోలుకొని మమ్మల్ని కళ్లతోనే ఆత్మీయంగా పలకరించాడు. కుటుంబాలతో హాలీడేని ఎంత ఎంజాయ్ చేసేవాళ్లమో తెలియదుగానీ... పేషెంట్‌కు మా బృందం ఇచ్చిన పునర్జన్మ మాకు అంతకంటే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని నమ్మకంగా చెప్పగలం.
- డాక్టర్ పి.వి.నరేష్ కుమార్, కార్డియో థొరాసిక్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
 
మానసికమైన ఒత్తిళ్లూ ఎక్కువే...
డాక్టర్ల వృత్తిగతమైన జీవితాల్లో మానసిక ఒత్తిళ్లూ చాలా ఎక్కువ. అవతలి వారి ప్రాణాలతో వ్యవహరించాల్సి రావడం వల్ల మిగతా వృత్తుల్లో కంటే వైద్యవృత్తిలో ఈ మానసిక ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ‘ఆ... ఈ జీవితం ఇలా తగలడిపోయింది’ అనడం సాధారణంగా వింటుంటాం. కానీ డాక్టర్ల జీవితాల్లో ఇలాంటి అభివ్యక్తికి నిజంగానే ‘బర్నవుట్’ అని పేరు పెట్టి అనేక అధ్యయనాలు నిర్వహించారు. కొన్ని దేశాల్లో డాక్టర్లపై ఈ అంశమై అనేక అధ్యయనాలు జరిగాయి.

2012లో యూఎస్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రతి ఇద్దరు ఫిజీషియన్లలో ఒకరిపై వృత్తిగతమైన ఒత్తిడి ఎక్కువ అని తేలింది. ఇది ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే జర్నల్‌లో నమోదైంది. ఇలాంటిదే మళ్లీ 2013లో నిర్వహించారు. దాదాపు 36 శాతం మంది ఫిజీషియన్లు బాధ్యతను భారంగా భావిస్తున్నారని 2,556 మంది డాక్టర్లపై నిర్వహించిన ఆ అధ్యయనంలో తేలింది. ఈ ఒత్తిడి 40 శాతం డాక్టర్లలో ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి చేరాక ఒకింత స్వేచ్ఛాజీవితం దొరికినట్లు భావిస్తుండటం మామూలే. అయితే వైద్యవిద్య అభ్యసించే వారికి మిగతా పిల్లలతో పోలిస్తే ఇలా స్వేచ్ఛాజీవితం లభించినట్లు భావించడం తక్కువేనని తేలింది.
 
డాక్టర్స్ డే విషెస్
when there are tears, you are a shoulder
when there is pain, you are a medicine
when there is a tragedy, you are a hope
happy doctor's day
 
 i want to say a big thanks
 for making me healthy and fit
 you are the best doctor i have ever known
 happy doctor's day
 
 may your days be wonderful and healthy
 like you make it for others.
 i want to thank you this doctor's day
 
 dawn of relief - obliging
 caring - tolerant
 omniscient -reasonable
 happy doctor's day
 
అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్‌బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ  ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్‌ఫైటర్స్ అలా చేయరు...  చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్‌ఫైటర్స్.
 
నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్‌ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్‌ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా  రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్‌కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్‌లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు.

అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక  క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి.
 మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్‌కు సెలవులు లేవు.

సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి.
 
అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ  రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు.
 
ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే...
ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్‌లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్‌పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి  అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.

ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్‌కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్‌స్డ్ హ్యాండ్‌వాష్‌లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్‌లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు.
 
ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ...
రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్‌ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.
 
కుటుంబ సమస్యలు
వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు.

సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే.
- యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement