బావిలోకి దూసుకెళ్లిన బైక్ | Bike falls into well, one died | Sakshi
Sakshi News home page

బావిలోకి దూసుకెళ్లిన బైక్

Published Tue, Aug 13 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

Bike falls into well, one died

మండలంలోని చెర్లోపల్లె ఎస్సీకాలనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వ్యవసాయబావిలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

 శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మండలంలోని చెర్లోపల్లె ఎస్సీకాలనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వ్యవసాయబావిలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఈ విషయం వెలుగు చూసింది. శ్రీకాళహస్తి పట్టణం ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ వంశీకుమార్(26) తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నాడు. ఇతను అప్పుడప్పుడు శ్రీకాళహస్తికి వచ్చివెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంలో శ్రీకాళహస్తికి బయలుదేరాడు.

మార్గమధ్యంలో చెర్లోపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో రోడ్డుపక్కన 50 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలో అదుపుతప్పి పడిపోయి మృతిచెందాడు. సోమవారం ఉదయం స్థానికులు ఇతడి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సంజీవ్‌కుమార్‌తో పాటు పలువురు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో బావిలోని స్కూటర్‌ను, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement