
హెల్మెట్ వాడకంపై టీ.రవాణశాఖకు మొట్టికాయలు
హైదరాబాద్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్న నిబంధనపై తెలంగాణ రవాణా శాఖకు హైకోర్టు సోమవారం తప్పుబట్టింది. మొదట హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించి, ఆ తర్వాత తప్పనిసరి చేయాలని మొట్టికాయలు వేసింది. హెల్మెట్ వాడకంపై ఇప్పటివరకు ఏం చేశారని న్యాయస్థానం ఆ సందర్భంగా అధికారులను ప్రశ్నించింది. అయితే హెల్మెట్ వాడనివారిపై ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 92వేల కేసులు నమోదు చేశామని రవాణా శాఖ అధికారులు తెలపగా, మీ కేసులతో ఒరిగేదేమీ లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది.