టూ వీలర్... కొత్త స్టైల్లో...! | Two Wheeler ... New style ...! | Sakshi
Sakshi News home page

టూ వీలర్... కొత్త స్టైల్లో...!

Published Mon, Dec 16 2013 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM

టూ వీలర్... కొత్త స్టైల్లో...!

టూ వీలర్... కొత్త స్టైల్లో...!

టూ వీలర్ అంటే వెనకో చక్రం, ముందో చక్రం ఉండాలా? పక్కపక్కగా ఉంటే ఎలా ఉంటుంది? అనే ఐడియా వచ్చిందో ఏమో కానీ ఇంగ్లండ్‌కు చెందిన కొంతమంది బైక్ డిజైనర్‌లు కొత్తరకం టూవీలర్‌ను డిజైన్ చేశారు. చక్రాలు ముందు, వెనుక ఉంటే బ్యాలెన్స్ చేయలేని వారి కోసం ఈ కొత్త బైక్‌ను డిజైన్ చేశారు. దీనిపేరు జీరో స్కూటర్. చక్రాలు పక్కపక్కగా ఉండే ఈ బైక్ ను బ్యాలెన్స్ చేయడం చాలా సులభం.

దీంట్లో గరిష్ఠంగా 20 మైళ్ల వేగంతో, ఏకధాటిగా 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. 51 ల కేజీ బరువుండే ఈ  బైక్ ద్వారా 180 కేజీల బరువును తీసుకెళ్లవచ్చు. లిథియం బ్యాటరీ ద్వారా ఈ బైక్ నడుస్తుంది. ధర దాదాపు నాలుగు వేల డాలర్లు. చూడటానికి ఆసక్తికరంగా, ఫన్నీగా ఉన్న ఈ బైక్‌ను ఏ కంపెనీ ఉత్పత్తి చేయలేదు. వెస్పా బైక్‌ను రీ మాడిఫై చేసి దీన్ని తయారుచేశారు. నేలనుంచి 30 డిగ్రీల కోణంలో ఉన్న రోడ్డువైపు కూడా ఈ బైక్ దూసుకెళ్లగలదు. 360 డిగ్రీల్లోనూ ఈ బైక్‌ను టక్కున టర్న్ చేసుకోవచ్చు.
 
అమ్మలేని లోటు తీరుస్తున్నారు!

ఒక పెనుతుపాను ఆ సీల్ చేపల పాలిట మరణమృదంగంలా మారింది. విశాల సముద్రంలో తమ జాతి మధ్య గడుపుతున్న అవన్నీ ఒక్కసారిగా ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇంకా పాలు తాగే దశలో ఉన్నవాటికి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయే నేర్పులేకపోయింది. ఈ సమయంలో ఏ కుక్కల, నక్కల పాలో కావాల్సిన వాటిని సంరక్షిస్తోంది ఒక జీవకారుణ్యసంస్థ. యూకే పరిధిలోని ఈస్ట్ ఆంగ్లియన్ కోస్ట్‌లో ఇటీవల సంభవించిన తుపానుతో మొత్తం 58 బుజ్జి బుజ్జి సీల్ చేపలు ఒడ్డుకు కొట్టుకొవచ్చాయి.

ఆ తీరం పక్కనే ఉన్న ఆర్‌ఎస్‌పీసీఏ అనే ఆసుపత్రి సిబ్బంది వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకొన్నారు. సీల్ చేపలు క్షీరద జాతికి చెందినవి. బాల్యదశలో ఉన్న వాటికి పాలు పట్టాల్సి ఉంటుంది! ఈ లెక్కన చూస్తే వీటి సంరక్షణ సాధారణమైన విషయం కాదు. అయినా వాటి అమాయకపు చూపులను గమనించి వాటి మీద దయతో ఫీడింగ్ బాధ్యతను తీసుకొన్నారు ఆర్‌ఎస్‌పీసీఏ వారు. వాటికి పాలివ్వాల్సిన తల్లి బాధ్యతను నెరవేరుస్తున్నందుకు మానవతావాదులు ఆసుపత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement