seal fish
-
దాంతో ఫొటో ఏంది మమ్మీ.. భయమైతుంది ప్లీజ్ వెళ్లిపోదాం డాడీ..
అనుకోకుండానే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేమస్ అవుతారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫ్యామిలీ చెందిన వీడియో చక్కర్లు కొడుతోంది. వారితోపాటు ఓ సీల్ చేసిన ఫన్నీ చేష్టలు సైతం నెటిజన్లను తెగనవ్విస్తున్నాయి. అయితే, వీడియో ప్రకారం.. ఓ థీమ్ పార్క్ ఓ ఫ్యామిలీ వెళ్లింది. ఈ క్రమంలో వాటర్ పార్క్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఓ జంట రెడీ అయ్యింది. ఇంతలో జంతువుల ట్రైనర్.. సీల్‌ను నీటిలోకి వెళ్లాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ఫొటోలు దిగేందుకు వారు ఓ కుర్చీపై కూర్చుకున్నారు. తర్వాత ట్రైనర్.. సీల్‌ను ఫొటోలకు ఫోజులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసి ఫొటోలు తీసేందుకు వెళ్లాడు. Family photography 🐬 pic.twitter.com/bjEabbUvl5 — Homestays & Villas (@thehomestays) September 25, 2022 ఇక, ఫొటోలు తీస్తున్న క్రమంలో సీల్ ఇచ్చిన స్టిల్స్ హైలైట్ అని చెప్పవచ్చు. అచ్చం మనుషులు చేసినట్టుగానే ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సమయంలో ఫొటో తీస్తున్న వైపు చూడాలని బుడ్డోడొకి పేరెంట్స్ చెబుతున్నప్పటికీ.. పిల్లోడు మాత్రం సీల్‌ను చూసి భయపడినట్టు ఫేస్ పెట్టాడు. మమ్మీ, డాడీ.. ప్లీజ్ ఇంక ఫొటోలు చాలు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అన్నట్టుగా వారి వైపు చూశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
టూ వీలర్... కొత్త స్టైల్లో...!
టూ వీలర్ అంటే వెనకో చక్రం, ముందో చక్రం ఉండాలా? పక్కపక్కగా ఉంటే ఎలా ఉంటుంది? అనే ఐడియా వచ్చిందో ఏమో కానీ ఇంగ్లండ్‌కు చెందిన కొంతమంది బైక్ డిజైనర్లు కొత్తరకం టూవీలర్‌ను డిజైన్ చేశారు. చక్రాలు ముందు, వెనుక ఉంటే బ్యాలెన్స్ చేయలేని వారి కోసం ఈ కొత్త బైక్‌ను డిజైన్ చేశారు. దీనిపేరు జీరో స్కూటర్. చక్రాలు పక్కపక్కగా ఉండే ఈ బైక్ ను బ్యాలెన్స్ చేయడం చాలా సులభం. దీంట్లో గరిష్ఠంగా 20 మైళ్ల వేగంతో, ఏకధాటిగా 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. 51 ల కేజీ బరువుండే ఈ బైక్ ద్వారా 180 కేజీల బరువును తీసుకెళ్లవచ్చు. లిథియం బ్యాటరీ ద్వారా ఈ బైక్ నడుస్తుంది. ధర దాదాపు నాలుగు వేల డాలర్లు. చూడటానికి ఆసక్తికరంగా, ఫన్నీగా ఉన్న ఈ బైక్‌ను ఏ కంపెనీ ఉత్పత్తి చేయలేదు. వెస్పా బైక్‌ను రీ మాడిఫై చేసి దీన్ని తయారుచేశారు. నేలనుంచి 30 డిగ్రీల కోణంలో ఉన్న రోడ్డువైపు కూడా ఈ బైక్ దూసుకెళ్లగలదు. 360 డిగ్రీల్లోనూ ఈ బైక్‌ను టక్కున టర్న్ చేసుకోవచ్చు. అమ్మలేని లోటు తీరుస్తున్నారు! ఒక పెనుతుపాను ఆ సీల్ చేపల పాలిట మరణమృదంగంలా మారింది. విశాల సముద్రంలో తమ జాతి మధ్య గడుపుతున్న అవన్నీ ఒక్కసారిగా ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇంకా పాలు తాగే దశలో ఉన్నవాటికి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయే నేర్పులేకపోయింది. ఈ సమయంలో ఏ కుక్కల, నక్కల పాలో కావాల్సిన వాటిని సంరక్షిస్తోంది ఒక జీవకారుణ్యసంస్థ. యూకే పరిధిలోని ఈస్ట్ ఆంగ్లియన్ కోస్ట్‌లో ఇటీవల సంభవించిన తుపానుతో మొత్తం 58 బుజ్జి బుజ్జి సీల్ చేపలు ఒడ్డుకు కొట్టుకొవచ్చాయి. ఆ తీరం పక్కనే ఉన్న ఆర్ఎస్పీసీఏ అనే ఆసుపత్రి సిబ్బంది వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకొన్నారు. సీల్ చేపలు క్షీరద జాతికి చెందినవి. బాల్యదశలో ఉన్న వాటికి పాలు పట్టాల్సి ఉంటుంది! ఈ లెక్కన చూస్తే వీటి సంరక్షణ సాధారణమైన విషయం కాదు. అయినా వాటి అమాయకపు చూపులను గమనించి వాటి మీద దయతో ఫీడింగ్ బాధ్యతను తీసుకొన్నారు ఆర్ఎస్పీసీఏ వారు. వాటికి పాలివ్వాల్సిన తల్లి బాధ్యతను నెరవేరుస్తున్నందుకు మానవతావాదులు ఆసుపత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.