గాజువాక: విశాఖపట్నం నగరంలోని పాత గాజువాక ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జబ్బు జంక్షన్ వైపు నుంచి ఓ వ్యక్తి బైక్‌పై వస్తుండగా జాతీయ రహదారిపై అనకాపల్లి వైపు వెళుతున్న షిప్పింగ్ కంపెనీ లారీ ఢీకొట్టింది. బైక్‌తోపాటు వాహనదారుడ్ని కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు నుజ్జునుజ్జయిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బాధితుని వివరాలు తెలియాల్సి ఉంది.