తూర్పు గోదావరి (ఆలమూరు) : తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండల కేంద్రంలో లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆలమూరులోని జెన్నాడం-మెట్టపాడు రోడ్డులో వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.