alamuru
-
ఏది నిజం?: చూడు బాబూ... ఇవిగో ఇళ్లు.. కలలోనైనా ఇది ఊహించారా?
72 ఏళ్ల వయసు. 45 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం. కానీ ప్రజలకు చేసిందేంటి? ఓ సెల్ఫీ ఛాలెంజ్!!. మేం లక్షల ఇళ్లు కట్టాం? మీరెన్ని కట్టారో చెప్పండంటూ ప్రభుత్వానికో సవాలు!!. ఏం... తెలీదా చంద్రబాబు గారూ? ఈ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలుండకూడదనే దృఢ సంకల్పంతో ఒకేసారి 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వటం మీరు కలలోనైనా ఊహించారా?.. మీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా అందరికీ నీడ కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రాలేదెందుకు? 30.25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటమే కాక... అందులో 21.25 లక్షల ఇకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతిచ్చి ఆరంభించటం చరిత్ర ఎరుగని వాస్తవం కాదా? స్థలాలిచ్చి రెండున్నరేళ్లు కూడా తిరక్కుండానే... ఈ నెలాఖరుకల్లా 5 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేస్తున్నారంటే... ఆ గృహ యజమానులంతా మీకెన్ని సెల్ఫీ చాలెంచ్లు విసరాలి? మీ 14 ఏళ్ల పాలనలో కట్టని ఇళ్లు ఈ రెండున్నరేళ్లలోనే పూర్తయ్యాయంటే... మీకు ఇంకా ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు అవసరమా? 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. వీటికోసం 17, 005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపం ఏకంగా ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో ప్లాటూ కనీసం రూ.2.50 లక్షలనుకున్నా ఏకంగా రూ.75 వేల కోట్లు. పైపెచ్చు ఇంటికి రూ.1.8 లక్షల సాయం. ఉచిత ఇసుక, సబ్సిడీ సిమెంటు, మెటీరియల్స్ రూపంలో మరో రూ.55వేలు అదనం. అంటే ప్రతి ఇంటికోసం అందజేస్తున్న సాయం రూ.2.35 లక్షలు. అంటే 70వేల కోట్లకు పైనే. ఇవికాక ఈ కాలనీల మౌలిక సదుపాయాల కోసం దశలవారీగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.33వేల కోట్లు. అంటే మొత్తంగా ఈ గృహ యజ్ఞం కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 1.78 లక్షల కోట్లు. ఇంతటి బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకోవాలంటే... అందరికీ నిలువ నీడ కల్పించాలన్న ఆశయం ఎంత బలంగా ఉండాలి? వాస్తవరూపం దాలుస్తున్న ఆ ఆశయబలం ముందు మీ జిత్తులమారి రాజకీయాలు సరితూగుతాయనే అనుకుంటున్నారా? విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడినే తీసుకుందాం. అక్కడ పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న గిరిజన కుటుంబాలు... వర్షం పడితే కొండ మీద నుంచి గుడిసెల్లోకి పారే వరద నీరు... దోమలు, కీటకాలు, తేళ్లు, పాముల సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడిపే కుటుంబాలు... ఇవన్నీ చంద్రబాబు నాయుడి పాలనలో అక్కడి వారందరికీ అనుభవం. అసలు అలాంటి ప్రాంతమొకటి ఉన్నదని, అక్కడి గిరిజన కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయనే విషయమే నారా వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడో ఊరు రూపుదిద్దుకుంటోంది. ఎందుకంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే... ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని చదును చేసి, వరద ముప్పు లేకుండా తీర్చిదిద్దింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నవారికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. తమ బతుకు చిత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మార్చేశారని చెబుతున్న రోజు కూలీ తలుపుల కవితలాంటి స్థానికుల భావోద్వేగం ముందు బాబు సెల్ఫీలు ఎన్ని సరితూగుతాయి? షమీ కుటుంబంలో సంబరం షేక్ షమీ భర్త రసూల్ కూలి పనులు చేస్తాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నివసిస్తున్న ఈ కుటుంబం ఇంటద్దె కోసం నెలకు రూ.3 వేలు చెల్లిస్తోంది. రసూల్ సంపాదన ఇంటద్దె, ముగ్గురు పిల్లల పోషణకు చాలక నానా అవస్థలూ తప్పడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పసుమర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే రసూల్ కూలి పనులు మానాలి. అందుకని ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం స్లాబ్ దశ పూర్తయింది. త్వరలో ఆ కుటుంబం సొంతింట్లోకి మారనుంది. ఎలాంటి ప్రయాస లేకుండా తమకు స్థలం, ఇల్లు వచ్చిందని చెబుతున్న షమీ సంతోషం ముందు... చంద్రబాబు రాజకీయాలు ఎన్నయినా దిగదుడుపే కదా? లేఅవుట్‌కు వెళ్లి సొంతింటిని చూసుకున్నప్పుడు ఒక్కోసారి ఇదంతా కలేమో అనిపిస్తుందని భావోద్వేగంతో చెబుతుంది షమీ. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ కర్నూలు జిల్లా నందవరం మండలం కొత్త కైరవాడి గ్రామానికి చెందిన కురువ సరోజమ్మ చాలా ఏళ్లుగా గుడిసెలోనే జీవిస్తోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే సరోజమ్మ గతంలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా సొంతింటి కల నెరవేరలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించింది. ఇటీవలే సొంతింట్లోకి మారారు. ‘అద్దె కట్టుకునే స్థోమత లేక చాలా ఏళ్లు గుడిసెలోనే ఉన్నాం. వర్షాలకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. భగవంతుడు మా మొర ఆలకించాడు. అందుకే సీఎం జగన్ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం’ అంటున్న సరోజమ్మ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదేమో!!. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30.25 లక్షల మంది పేద మహిళలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. అసలింతటి విలువైన స్థలాన్ని ప్రజలకు అందించటమే ఓ చరిత్ర. వేరెవరైనా అయితే అంతమందికి స్థలాలిచ్చామని ఘనంగా ప్రచారం చేసుకోవటంతో పాటు... అక్కడితో వదిలిపెట్టేసేవారు. కానీ వై.ఎస్.జగన్ ఓ అడుగు ముందుకేశారు. స్థలాలివ్వటంతో సరిపెట్టకుండా వెనువెంటనే దశలవారీగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. సొంతింటి ద్వారా ఒకో పేదింటి అక్క చెల్లెమ్మల చేతికి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే స్థిరాస్తి అందుతోంది. తద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతోంది. ఇటు ఇళ్ల నిర్మాణం.. అటు సదుపాయాలు రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. 20.28 లక్షల ఇళ్ల నిర్మాణాలు (95 శాతం) వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3,37,631 గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 1.27 లక్షల ఇళ్లు పైకప్పు, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం ఈ నెలాఖర్లోగా పూర్తయి... వారూ గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 28,377, విజయనగరంలో 27,895, శ్రీకాకుళంలో 23,611 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరుసటి ఏడాది నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఐదు లక్షల వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లను సమకూరుస్తోంది. ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రి సమకూరుస్తుండగా కొందరు నిరుపేద లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంకోచించారు. దీంతో వీరి కోసం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ప్రవేశపెట్టారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి, వారికి లాభాపేక్ష లేని నిర్మాణ సంస్థలను ఎంపిక చేసి అనుసంధానించడం ద్వారా ఆప్షన్–3 ఇళ్లను నిర్మిస్తున్నారు. 3.03 లక్షల ఇళ్లు పునాది, ఆపై దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,923 ఇళ్లు లింటెల్ లెవెల్, 12,252 ఇళ్లు స్లాబ్ దశలో నిర్మాణంలో ఉన్నాయి. షీర్ వాల్ టెక్నాలజీతో చకచకా నా భర్త హోల్‌సేల్ మెడికల్ షాపులో సేల్స్‌మెన్‌గా చేస్తారు. చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గతంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. నా భర్త పనిచేసే చోట పెద్దగా సెలవులివ్వరు. నేను ఇంటి వద్ద చిన్న వ్యాపారం చేస్తుంటా. మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరాం. షీర్వాల్ టెక్నాలజీ విధానంలో మా ఇంటిని నిర్మిస్తున్నారు. స్లాబ్ అయిపోయింది. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తవుతోంది. ఈ జన్మకు సొంతిల్లు అనేది ఉంటుందో ఉండదోనని ఆవేదన చెందేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ మా కలను నెరవేర్చారు. నా బిడ్డ చదువు కోసం అమ్మ ఒడి కింద సాయం కూడా అందిస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ప్రభుత్వం మాకు అండగా నిలుస్తోంది. – జి.శోభారాణి, ఆప్షన్–3 లబ్ధిదారురాలు, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వివక్ష లేకుండా మంజూరు గత ఏడాది డిసెంబర్ 15న ప్రభుత్వం ఇచ్చిన సొంతింటికి మారాం. కరెంట్, నీటి కనెక్షన్.. ఇలా అన్ని వసతులనూ కల్పించారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నేను గత ప్రభుత్వంలో ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు తప్ప రాజకీయాలతో సంబంధం లేని మాకెవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు చూడకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్థలం మంజూరు చేసింది. ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. – ఎం.హరిత, ఆరూరు ఎస్టీ కాలనీ, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా అంతా కలలా.. ఆర్నెల్లలోనే నాకు 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. వడ్రంగి పని చేసే నా భర్త సంపాదనతో కుటుంబ పోషణే భారంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఇంటి స్థలం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. కొద్ది రోజులకే స్థలం మంజూరైంది. ఆర్నెల్లలో సొంతిల్లు కట్టుకున్నాం. అంతా కలలా ఉంది. సొంతింట్లో ఉంటున్నామంటే నాకే నమ్మకం కలగటం లేదు. – నాగేశ్వరమ్మ, శనివారపుపేట జగనన్నకాలనీ ఏలూరు రూ.9 లక్షల విలువైన స్థలం ఇచ్చారు మా గ్రామం జాతీయ రహదారి 26ని అనుకుని ఉండటంతో సెంట్ స్థలం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు పలుకుతోంది. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చింది. నిర్మాణం పూర్తవడంతో గత ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేసి సొంతింట్లో ఉంటున్నాం. – బోడసింగి సీత, బోడసింగి పేట గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా -
ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..
సాక్షి, అనంతపురం క్రైం: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే హతమార్చిన వైనం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి ప్రియుడితో పాటు మహిళనూ అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు... ఆలమూరు గ్రామానికి చెందిన చియ్యేడు రవీంద్ర (40), బోయ విజయలక్ష్మి దంపతులు. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా తమ సమీప బంధువు చియ్యేడు సందీప్‌తో విజయలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తరచూ కలుసుకునేందుకు భర్త రవీంద్ర అడ్డు వస్తుండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించారు. పథకం ప్రకారం ఈ నెల 3న అర్ధరాత్రి తలదిండుతో రవీంద్రకు ఊపిరి అందకుండా చేసి హతమార్చారు. అనంతరం పాముకాటుతో మృతి చెందినట్లుగా నమ్మించారు. అయితే రవీంద్ర ఊపిరి అందక పోవడంతో చనిపోయాడని, శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లుగా పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం వెలుగు చూసింది. విజయలక్ష్మి, సందీప్‌ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఆదేశం మేరకు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: (మరో మహిళతో వివాహేతర సంబంధం.. సుపారీ ఇచ్చి భర్తను) -
అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి.. మాయ మాటలతో లైంగిక దాడి
సాక్షి, ఆలమూరు: వివాహిత ఒంటరితనాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఒక కామాంధుడు అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి లైంగిక దాడి జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో బాధితురాలు చాకచక్యంగా ఉపయోగించిన దిశ యాప్ నిందితుడిని పట్టించింది. ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల మధ్య జరిగిన ఈ ఘటన వివరాలను రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం వెల్లడించారు. మండపేటకు చెందిన వివాహిత తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా కొన్ని నెలలుగా అదే పట్టణంలో అమ్మగారి ఇంటి వద్ద ఉంటోంది. కుటుంబ సభ్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తన కుటుంబానికి సన్నిహితుడైన కపిలేశ్వరపురం మండలం వడ్లమూరుకు చెందిన అంగర వీర్రాఘవులను అద్దె ఇల్లు చూస్తే వేరేగా ఉంటానని చెప్పింది. ఈ నెల 22 రాత్రి బాధితురాలికి అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి రాఘవులు తన బైక్‌పై జొన్నాడ తీసుకువచ్చి బాగా పొద్దు పోయే వరకూ పలు ప్రదేశాలకు తిప్పాడు. మాయ మాటలతో మభ్యపెట్టి జొన్నాడలోని తన స్నేహితుడి ఇంటి వద్ద ఈ రాత్రి ఉండి ఉదయం వెళదామని నమ్మబలికాడు. అక్కడ నుంచి ఆమెను వెదురుమూడికి చెందిన దుర్గాప్రసాద్ సహకారంతో వడ్లమూరులోని తన నివాసానికి తీసుకుపోయి లైంగిక దాడి జరిపాడు. చదవండి: (పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు) దిశ యాప్‌ను ఆశ్రయించిన బాధితురాలు లైంగిక దాడితో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు తన మొబైల్ నుంచి దిశ యాప్ ద్వారా కాల్ చేయడంతో పోలీసులకు సమాచారం అందింది. విషయం గ్రహించిన నిందితుడు రాఘవులు ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని స్విచాఫ్ చేయడంతో సిగ్నల్ కట్ అయింది. అప్పటికే దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న మండపేట రూరల్ సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఆలమూరు ఎస్సై ఎస్.శివప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్న సమాచారంతో అక్కడకు వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. బుధవారం తెల్లవారుజామున నిందితులిద్దరినీ వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని ఆలమూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సీఐ శివగణేష్, ఎస్సై శివప్రసాద్‌ను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రక్షణ పొందాలని ఆయన సూచించారు. చదవండి: (విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..) -
ఒక్క రోజులో రేషన్ కార్డు మంజూరు
కొత్తపేట/ఆలమూరు: కేవలం ఒక్క రోజులోనే రేషన్ కార్డు మంజూరు చేసిన సరికొత్త రికార్డు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మడికి పంచాయతీ సచివాలయం–2 పరిధిలో నివాసం ఉంటున్న కుడిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులు గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది. చివరకు గ్రామ వలంటీర్ సీహెచ్ శివరామకృష్ణను కలవగా.. మంగళవారం గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి వివరాలు నమోదు చేయించాడు. దరఖాస్తును ఆన్లైన్ ద్వారా తహసీల్దార్ జి.లక్ష్మీపతికి సమర్పించగా.. ఆయన వెంటనే లబ్ధిదారుని అర్హతల్ని గుర్తించి బుధవారం రేషన్ కార్డు మంజూరు చేశారు. దీంతోపాటు అదే గ్రామానికి చెందిన పిల్లి లక్ష్మి అనే ఒంటరి మహిళకు కూడా ఒక్క రోజులోనే రేషన్ కార్డు మంజూరు చేశారు. గతంలో ఎన్ని అవస్థలో.. ► గత ప్రభుత్వ హయాంలో అన్ని అర్హతలున్నా రేషన్ కార్డు రావాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. టీడీపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్ప కార్డు వచ్చేది కాదు. ► వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థల్ని తీసుకొచ్చి ప్రజల గుమ్మం వద్దకే అన్ని పథకాలూ అందజేస్తోంది. ► అర్హతలున్న వారు వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గ్రామ సచివాలయం ద్వారా పది రోజుల్లో కార్డు అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. చాలా ఆనందంగా ఉంది రేషన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశాం. అయినా మంజూరు కాని కార్డు కేవలం ఒక్క రోజులో మంజూరు కావడం ఆనందంగా ఉంది. ఇది సీఎం జగన్ పుణ్యం. ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం. – ఆంజనేయులు, వరలక్ష్మి, మడికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా రేషన్‌కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను. గత ప్రభుత్వ హయాంలో ఆ సభలో ఇస్తాం.. ఈ సభలో ఇస్తాం అన్నారు. చివరకు మొండిచెయ్యి చూపారు. జగన్‌బాబు ముఖ్యమంత్రి అయ్యాక అందరికీ మంచి రోజులొచ్చాయి. ఒకే రోజులో కార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. – పిల్లి లక్ష్మి, మడికి -
అందనంత ఎత్తమ్మ ఈ ‘గొబ్బెమ్మ’
సాక్షి, ఆలమూరు: సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసులు, డూ డూ బసవన్నల కోలాహలంతోపాటు గొబ్బెమ్మలు కూడా దర్శనమిస్తాయి. ఈ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరానికీ పరిచయం చేయాలనే సంకల్పంతో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన మహిళలు అత్యంత పొడవైన గొబ్బెమ్మను తయారు చేశారు. శ్రీ ఉరదాలమ్మ, దండుగంగమ్మ ఆలయం ఆవరణలో 10.10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో గొబ్బెమ్మను తీర్చిదిద్దారు. గుమ్మిలేరుకు చెందిన హరే శ్రీనివాస భక్త భజన బృందం, గ్రామ మహిళా సమాఖ్యకు చెందిన 20 మంది మహిళలు ఐదు టన్నుల ఆవుపేడను సేకరించి.. దాదాపు వారం పాటు శ్రమించి ఈ గొబ్బెమ్మను తయారుచేశారు. దీనిని పూలు, రంగులతో శోభాయమానంగా అలంకరించారు. భారత్ టాలెంట్స్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ మోహిత్‌కృష్ణ ఇది అత్యంత పొడవైన గొబ్బెమ్మగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
గ్రామాల్లో మంత్రి లోకేశ్ అనుచరుల వీడియోలు
ఆలమూరు (కొత్తపేట): డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్ము పేరిట గ్రామాల్లో కొంతమంది యువకులు శనివారం ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. వారిని ప్రశ్నిస్తే మంత్రి నారా లోకేశ్ అనుచరులమని, గ్రామాల్లో వీడియో తీసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పంపించారని చెబుతున్నారు. పెదపళ్ల, చింతలూరు గ్రామాల్లో వేర్వేరు వాహనాల్లో నలుగురు యువకులు వచ్చారు. పెదపళ్లలో మండల పరిషత్ ప్రత్యేక పాఠశాల ఆవరణ, చింతలూరులో శ్రీ నూకాంబికా ఆలయం ప్రవేశ మార్గం వద్ద వారు వీడియో తీశారు. ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను అక్కడ మహిళల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారి వద్ద ఉన్న పుస్తకాల్లో టీడీపీకి చెందిన కొందరి నేతలు ఫొటోలు ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వారి ఫిర్యాదుతో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి నామాల శ్రీనివాస్ వారిని నిలదీస్తే పొంతన లేని సమాధానాలిచ్చారు. అమరావతికి చెందిన యువకుడు సందీప్ వీడియోలు తీయాలని పంపాడని ఆ యువకులు తెలిపారు. పెదపళ్లలో దొంగచాటుగా వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులను ఎంపీటీసీ ఏడిద మెహర్‌ప్రసాద్ అడ్డుకున్నారు. వారిపై మండల కోడ్ ఆఫ్ కాండక్టు (ఎంసీసీ) బృందానికి ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆ రెండు గ్రామాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వీడియోలు తీస్తున్న నలుగురు యువకులను ఎంపీడీఓ టీవీ సురేందర్‌రెడ్డి, ఎస్సై టి.క్రాంతికుమార్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే ఎంసీసీ బృందం సభ్యులు మాత్రం వీరి వద్ద పార్టీ జెండాలు లేకపోవడం వల్ల వెంటనే కేసులు నమోదు చేయలేమని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ నేత శ్రీనివాస్ నియోజకవర్గ ఆర్ఓకు, ఎంసీసీ బృందానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయకుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మోరంపూడి వాసు, పెద్దింటి కాశీ, మార్గాని యేసు తదితరులు పాల్గొన్నారు. -
గౌతమి గోదావరిలో ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆలమూరు: స్నానం కోసం గౌతమి గోదావరి నదిలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో జరిగింది. మండలంలోని జొన్నాడ గ్రామానికి చెందిన తలారి ధర్మేంద్ర, గంటా వికాస్ అనే యువకులు గౌతమి గోదావరి నదిలో స్నానానికి దిగారు. అయితే లోతు ఎక్కువ ఉండడం, ఈత రాకపోవడంతో వారు గల్లంతయ్యారు. వీరి కోసం స్థానికులు, పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. -
మెరిశారి‘లా’..
♦ న్యాయవృత్తిలో ఉన్నత స్థానాల్లో అక్కాచెల్లెళ్లు ♦ ఆలమూరు ఏఎఫ్సీఎం కోర్టు జడ్జిగా చెల్లి దివ్య ♦ న్యాయమూర్తిగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అక్క దీప్తి అపారమైన పరిజ్ఞానం ఆ అక్కాచెల్లెళ్ల సొంతం. గ్రామీణ ప్రాంతంలోని ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన వారు.. కన్న తల్లిదండ్రుల కలలు నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమించి.. అకుంఠిత దీక్షతో తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఏడాది వ్యవధిలోనే ఇద్దరూ న్యాయవృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. న్యాయవ్యవస్థపై గౌరవాన్ని పెంపొందిస్తామంటున్నారు. ఇంతకీ ఆ అక్కాచెల్లెళ్లు ఎవరు? వారిది ఏ ఊరు? జడ్జిలు కావడానికి కారణాలేంటీ? తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. – ఆలమూరు(కొత్తపేట) వీర్ల దివ్య, వీర్ల దీప్తి ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వీరి స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కంచర్లవారిపల్లె. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఆలమూరులోని రాజుగారి దివారణంలో నివసిస్తున్నారు. ఆలమూరు ఏఎఫ్సీఎం కోర్టు జడ్జిగా దివ్య ఇటీవల బాధ్యతలు స్వీకరించగా.. ఆమె అక్క దీప్తి 2016లో నిర్వహించిన పోటీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి న్యాయమూర్తిగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరి తండ్రి వీర్ల బ్రహ్మయ్య బీకాం బీఎల్ విద్యను అభ్యసించి వ్యవసాయంపై మక్కువ పెంచుకోగా.. తల్లి రమణమ్మ సమీపంలోని వీరభద్రాపురం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఇ‘లా’ మొదలైంది.. విశాఖపట్నంలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జడ్జి దివ్య ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. అలాగే జడ్జిగా ఎంపికైన దీప్తి హైదరాబాద్‌లోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం చెల్లెలు దివ్యను స్ఫూర్తిగా తీసుకుని మళ్లీ హైదరాబాద్‌లోని కేవీ రంగారెడ్డి లా కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. వీరిద్దరూ ఆయా లా కళాశాలల్లో క్రిమినల్ లా, టార్ట్స్, ఎకనావిుకల్, హిస్టరీ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి యూనివర్సిటీ స్థాయిలో మెడల్స్, షీల్డ్‌లు, మెమెంటోలు అందుకున్నారు. సమాజ సేవకు పాటుపడతా నాన్న బ్రహ్మయ్య స్ఫూర్తితో ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు చిన్ననాటి నుంచే లా చదవాలని, జడ్జిని కావాలనే స్పష్టమైన లక్ష్యం ఉండేది. లా చదివించేందుకు కుటుంబసభ్యులు పడిన కష్టాన్ని దగ్గరుండి చూసిన నాకు జడ్జి కావాలనే కోరిక బలంగా నాటుకుంది. 2014లో ఎల్ఎల్ఎం పూర్తి చేశా. 2015 జూ¯ŒSలో నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకుని ప్రిలిమ్స్, మెయి¯Œ్స ఇంటర్యూలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించా. ఆరు నెలల శిక్షణ అనంతరం ఆలమూరు ఏఎఫ్సీఎం జడ్జిగా నియామకం పొందా. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సమాజ సేవకు వినియోగిస్తా. – దివ్య, ఆలమూరు ఏఎఫ్సీఎం కోర్టు జడ్జి అందరికీ సమన్యాయం కుటుంబ సభ్యులను ప్రేరణగా తీసుకుని తొలుత బీటెక్ పూర్తి చేసి, మళ్లీ లా చదివా. తొలివిడత 2015లో చెల్లి దివ్యతో పాటు జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు సంబంధించి తుది వరకూ పోరాడినా ఇంటర్వూ్యలో ఒక్క మార్కు తేడాతో జడ్జి అవకాశాన్ని కోల్పోయా. మళ్లీ 2016లో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు దరఖాస్తు చేసుకుని మలివిడత ప్రయత్నంలో జడ్జిగా అర్హత సాధించా. వచ్చే నెలలో శిక్షణకు వెళ్లి అనంతరం ప్రజలకు జడ్జిగా సేవలందించనున్నా. అందరికీ సమన్యాయం చేసేందుకు కృషి చేస్తా. – వి.దీప్తి -
పుంగనూరు దూడకు అవార్డుల పంట
ఆలమూరు (కొత్తపేట) : పశు పోషణలో, పాల ఉత్పత్తిలో ప్రఖ్యాతి గాంచిన గుమ్మిలేరు గ్రామానికి పుంగనూరు ఆవు దూడ నాలుగు అవార్డులను తెచ్చిపెట్టింది. అతి తక్కువ ఎత్తుతో పాటు బరువు కలిగి ఉండడంతో భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎంపికైంది. పాడి రైతు రెడ్డి సత్తిబాబుకు చెందిన కపిల ఆవుకు గత నెల 20న పుంగనూరు ఆవు దూడ జన్మించింది. కపిల ఆవు రంగులో పుంగనూరు జాతి ఎత్తులో పుట్టిన ఈ దూడ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ పుంగనూరు దూడ కేవలం 17 అంగుళాల ఎత్తు, 7.4 కేజీల బరువు మాత్రమే కలిగి ఉండడంతో ఈ ఆవు దూడ ప్రత్యేకతపై ప్రపంచ అవార్డుల సాధికారిత అధ్యక్షులు, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్ చింతా శ్యామ్‌కుమార్ (శ్యామ్ జాదూ) దృష్టి సారించారు. గ్రామానికి విచ్చేసి ఆవు దూడ కొలతలను తీసుకుని నాలుగు రికార్డు సంస్థలకు వివరాలను, వీడీయో సీడీలను పంపించారు. అనంతరం ఆసంస్థలు ఆమోదం తెలపడంతో ఐఎస్ఓ సర్టిఫికెట్ కలిగిన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్, వర్మ బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్‌లో ఆ పుంగనూరు ఆవుదూడ చోటు సంపాదించుకుంది. దీంతో నాలుగు రికార్డుల సంస్థలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న శ్యామ్ జాదూ మంగళవారం గ్రామానికి విచ్చేసి రైతు సత్తిబాబుకు అవార్డులను అందజేశారు. -
బాల్యవ్యసనమే ‘బంగారు’ పతకానికి మూలం
ఆలమూరు : బడిలో చదువుకునేటప్పుడు ఆటవిడుపు వేళల్లో ఏమీ తోచక రాళ్లు ‘త్రో’ (విసిరిన) చేసిన అలవాటే అతడు జాతీయస్థాయిలో విజేతగా నిలవడానికి మూలమైంది. అతడే జావెలి¯ŒS త్రోలో స్వర్ణపతకం సాధించిన.. ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన నాగిరెడ్డి నవీ¯ŒS. గుజరాత్‌లోని వడోదరాలో జరిగిన పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి, పతకం సాధించి జిల్లాకు పేరుతెచ్చి పెట్టాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ స్థానిక శ్రీషిర్డీసాయి విద్యానికేత¯ŒSలో, ఇంటర్మీడియట్ రాజమహేంద్రవరం శ్రీచైతన్య కళాశాలలో చదివిన నవీ¯ŒS ప్రస్తుతం నరసాపురంలోని శ్రీస్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. నవీ¯ŒS క్రీడాప్రతిభను గుర్తించిన శ్రీషిర్డీసాయి యాజమాన్యం 2012లో రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కళాశాలలో నిర్వహించిన జోనల్ పోటీలకు పంపింది. సెంట్రల్ జో¯ŒS స్థాయిలో జావెలి¯ŒS త్రో విభాగంలో ప్రథమ స్థానం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. సాధనకు విరామమొచ్చినా సాధించాడు.. అయితే ఇంటర్మీడియట్లో క్రీడల్లో సాధనకు అవకాశం లేకపోయింది. మళ్లీ ఇంజనీరింగ్‌లో చేరాక సాధనను కొనసాగించాడు. ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడానికి తోడు స్నేహితులు ప్రోత్సహించడంతో గత మూడేళ్ల నుంచి జావెలి¯ŒS త్రోలో నిర్విరామంగా కఠోరశ్రమతో సాధన చేశాడు. ఈ ఏడాది మేలో ధవళేశ్వరంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో, సెప్టెంబర్‌లో నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్టూడెంట్ ఒలింపిక్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. జావెలి¯ŒS త్రోతో పాటు ఒలింపిక్ క్రీడల్లో కబడ్డీ పోటీల్లో మడికికి చెందిన విద్యార్థులతో కలిసి జిల్లాజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. జావెలి¯ŒS త్రోలో సత్తా వడోదరా పోటీల్లో నవీ¯ŒS జావెలి¯ŒS త్రోలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించి, ఈ ఏడాది డిసెంబర్లో మలేషియా లేదా శ్రీలంకలో నిర్వహించనున్న ఏసియ¯ŒS స్టూడెంట్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. కబడ్టీ పోటీల్లోనూ నవీ¯ŒS ఏపీ–ఏ తరఫున మెరుగైన ఆట తీరును ప్రదర్శించినా ఆ జట్టు నాకౌట్ దశలోనే ఏపీ–బీపై పోరాడి ఓటమి పొందింది. రాష్ట్రానికి గుర్తింపు తెస్తా.. ఏసియ¯ŒS గేమ్స్‌లో ప్రథమ స్థానం సంపాదించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు నవీ¯ŒS తెలిపాడు. 56 దేశాలు పాల్గొనే ఈ పోటీల్లో రాష్ట్రానికి తగిన గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానన్నాడు. తన తొలి ప్రాధాన్యం జావెలి¯ŒS త్రో, మలి ప్రాధాన్యం కబడ్డీ అని చెప్పాడు. -
ఆయనంటే పిచ్చి..
‘సాక్షి’తో హాస్యనటుడు జెన్నీ రాజమహేంద్రవరం కల్చరల్ : రంగస్థలమే తనను నాలుగొందలు సినిమాలు చేసే సినీనటుడిగా తీర్చిదిద్దిందని అంటున్నారు ప్రముఖ కమెడియన్ జెన్నీ. యువహీరో గంగాధర్ నటిస్తున్న ‘ఆకలిపోరాటం’ సినిమాలో నటించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే.. నేను గోదారమ్మ బిడ్డనే.. ‘‘నా అసలు పేరు పోలాప్రగడ జనార్దనరావు. చిన్నప్పటినుంచి నా ముద్దుపేరు జెన్నీ. ఈ పేరునే సినీ పరిశ్రమలో ఖరారు చేసుకున్నాను. ఇక మాది రావులపాలెం సమీపంలోని ఆలమూరు. అక్కడ ఉన్నత పాఠశాల చదువు అయ్యాక, నాటి ‘రాజమండ్రి’ ఆర్ట్స్‌కళాశాలలో 1963-66లో బీకాం చదివాను. 1966లోనే హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగం వచ్చింది. ప్రైవేటుగా ఎమ్‌కాం చదివాను. పద్మశ్రీ ఏఆర్ కృష్ణ ప్రారంభించిన మూడేళ్ల థియేటరు ఆర్ట్స్ కోర్సు పూర్తిచేశాను. నాటకరంగ దిగ్గజాలు చాట్ల శ్రీరాములు, డీఎస్ఎన్ మూర్తి, తల్లావఝుల సుందరం వంటి హేమాహేమీలతో కలసి నాటకాలలో పనిచేశాను. ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ ప్రారంభించిన పరచూరి రఘుబాబు పరిషత్తు ప్రదర్శించిన నాటకాలలో ఉత్తమ నటుడిని పరచూరిగోపాలకృష్ణ సినీ రంగానికి పరిచయం చేస్తామన్నారు. జంధ్యాల నా నటనను చూసి‘అహనా పెళ్లంట’లో వేషం ఇచ్చారు. పాత్ర చిన్నదేనైనా.. పదుగురి మెప్పు పొందింది. అలాగే యమలీలలో పత్రికాసంపాదకుడిగా నటించాను. ఈ పాత్రకూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది.’’ బాపుగారంటే పిచ్చి.. నాకు బాపుగారంటే ఎంతో పిచ్చి. ఆయనను ‘నేను చనిపోయేలోపు మీ దర్శకత్వంలో నటించే అవకాశం ఇవ్వాలి’ అని కోరాను. అలా బాపు దర్శకత్వంలో ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో నటించాను. కె.విశ్వనాథ్, ఈవీవీ సత్యనారాయణ వంటి ప్రముఖుల దర్శకత్వంలో నటించాను. స్కోర్ నాలుగువందలు దాటింది. ప్రస్తుతం మరో ఆరు సినిమాలు చేస్తున్నాను. రచయితగా... నేను రాసిన 50 కథలలో 21 కథలకు బహుమతులు వచ్చాయి. పారిస్ దేశస్తుడైన ఆల్ఫ్రెడ్ఫారెన్ అనే వ్యక్తి వద్ద మూకాభినయనం నేర్చుకుని, వేలాది ప్రదర్శనలు విదేశాల్లో ఇచ్చాను. ఇలా చేసిన ఏకైక తెలుగు నటుడిని నేను ఒక్కడినే. ఇది గర్వం కాదు, వాస్తవం. -
అమృతవల్లి.. శ్రీనూకాలమ్మ తల్లి
బాలారిష్ట నివారిణి , చల్లని చూపుల తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఆరోగ్య ప్రదాయినిగా పేరొందిన శ్రీనూకాంబికా అమ్మవారి జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. కొత్త అమావాస్యను పురస్కరించుకుని ప్రతిఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 12 లక్షల మంది భక్తులు వస్తారని దేవాదాయశాఖ అంచనా వేస్తోంది. ఆలమూరు పవిత్ర గౌతమీ గోదావరి తీరాన ఉన్న ఆలమూరు మండలం చింతలూరులో అమ్మవారి ఆలయానికి రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. చింతలూరు గ్రామ శివారులో ఉన్న పాలచెట్టు తొర్రలో లభించిన ఆమ్మవారి విగ్రహాన్ని అప్పటి పిఠాపురం మహారాజు సహకారంతో ప్రతిష్ఠించినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. చంటిపిల్లల పాలిట అమృతవల్లిగా, సకల పాపాలు హరించే మాతృమూర్తిగా విరాజిల్లుతోంది. నూకాంబికా అమ్మవారికి పిల్లలతో కాగడాలు వెలిగిస్తే.. తట్టు, పొంగు, ఆటలమ్మ వంటి వ్యాదులు సోకవని భక్తుల నమ్మకం. జిల్లాకు చెందిన భక్తులు అమ్మవారి జాతరలో వారి పిల్లలతో కాగడాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. నెల రోజుల ముందుగానే మండలంలోని అన్ని గ్రామాల్లో బుట్టగరగ రూపంలో అమ్మవారు ప్రజలకు దర్శనమిస్తారు. మోదుగుపూల గరగ ప్రత్యేక ఆకర్షణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో లేనివిధంగా శ్రీనూకాంబికా అమ్మవారి పూల ఘటానికి పక్షం రోజుల ముందునుంచే కొత్త, పాత పూల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ పూలను రోజు విడిచి రోజు మన్య ప్రాంతం నుంచి తీసుకువచ్చిన మోదుగుపూలతో అలంకరిస్తారు. ఈ గరగను నెత్తిన ధరించిన నృత్య కళాకారుడుతో చంటిపిల్లలను దాటిస్తే, రోగాలు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వకాలం అమ్మవారికి మూలస్థానం అగ్రహారానికి చెందినవారు జంతుబలి ఇచ్చేవారు. 35 ఏళ్ల క్రితం ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంతో బలులు నిషేధించారు. జాతర రోజున అబ్బురపర చే గరగ నృత్యాలు, తీర్థం రోజున గవ్వ నృత్యం, ఉగాది రోజున నిర్వహించే ‘బద్ది కడుగుట’ కార్యక్రమంతో ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు మే నెల 6 వరకూ జరగనున్నాయి. భక్తులకు ఏర్పాట్లు పూర్తి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను దేవాదాయ శాఖ పూర్తి చేసింది. క్యూలైన్లు, తాగునీటి వసతి, చంటి పిల్లలకు పాల సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. భక్తులు సేదతీరేందుకు గ్రామంలో పలుచోట్ల చలువపందిళ్లను ఏర్పాటు చేశారు. పారిశుధ్య నిర్వహణకు పంచాయతీ ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పెదపళ్ల పీహెచ్సీ ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యులు సహా 38 మంది ఆరోగ్య, ఆశ సిబ్బంది స్థానిక సబ్ సెంటర్ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ ఆదేశాల మేరకు రామచంద్రపురం, రావులపాలెం, రాజమండ్రి డిపోల నుంచి బస్సు సౌకర్యాన్ని, 108 సేవలను అందుబాటులోకి ఉంచనున్నారు. పోలీసుల బందోబస్తు జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 20 మంది ఏఎస్సైలతో పాటు సుమారు 150 కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లు, 50 మంది హోంగార్డులతో విధులు నిర్వహించనున్నారు. -
కన్నబిడ్డ జ్ఞాపకాలు పదిలంగా.. పవిత్రంగా
కన్నబిడ్డలకు చిన్నగాయమైతేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటి బిడ్డలు చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోతే.. ఇక ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అలాంటి బాధనే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన అత్తిలి రాంబాబు, వీవ వెంకట సత్యవేణి దంపతులు ఎదుర్కొన్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు. గతేడాది పెద్దకుమారుడు నరేశ్ తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు. ‘మా ఆయుష్షు కూడా పోసుకుని బతుకు నాయనా’ అని ఆ తల్లిదండ్రులు పడిన ఆర్తికి ప్రతిఫలం లేకుండాపోయింది. పన్నెండేళ్ల వయసులోనే నరేశ్ తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. తమ ముద్దుల కుమారుడి అకాల మరణం ఆ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసింది. తమ జ్ఞాపకాల్లో కన్నబిడ్డను చూసుకోవడం కాకుండా.. కన్నబిడ్డ స్మృత్యర్థం ఏదైనా ఉండాలనుకున్నారు. ఓ గుడి కట్టి తమ కుమారుడి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ ఊరికి సమీపంలోని బడుగువానిలంక గ్రామంలో ఉన్న తమ వ్యవసాయ భూమిలోని ఐదు సెంట్లలో ఆరు నెలల కిందట ఓ గుడి కట్టించి, నరేశ్ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
తూర్పు గోదావరి (ఆలమూరు) : తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండల కేంద్రంలో లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆలమూరులోని జెన్నాడం-మెట్టపాడు రోడ్డులో వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
వృద్ధురాలిపై హత్యాయత్నం
ఆలమూరు(తూర్పుగోదావరి జిల్లా) : డబ్బు కోసం చెత్త ఏరుకునే వ్యక్తి ఓ వృద్ధురాలిపై హత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చింతలూరు గ్రామానికి చెందిన పద్మ(60) భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. కాగా గ్రామంలో చెత్త ఏరుకునే వెంకన్న సోమవారం ఆమెపై దాడి చేశాడు. తలపై సీసాతో బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని ఆదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. -
కారు ఢీ కొని వ్యక్తి మృతి
అలమూరు: వేగంగా వెళ్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అలమూరు మండలం మూలస్థానం అగ్రహారం వద్ద జరిగింది. వివరాలు..కొత్తపేట మండలం గంటికి గ్రామానికి చెందిన మినపపప్పు వ్యాపారి సైకిల్‌పై వెళ్తున్నాడు. ఇదే సమయంలో జాతీయరహదారి-16పై వేగంగా వెళ్తున్న కారు అతనిని ఢీ కొట్టింది. దీంతో అతను డివైడరు పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (అలమూరు) -
సంగితకు కన్నీటి వీడ్కోలు
మండపేట/ఆలమూరు :రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డికి ప్రజలు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. కడసారిగా ఆయనను చూసేందుకు తరలివచ్చిన వారితో పినపళ్ల జనసంద్రమైంది. సంగిత ఇకలేరన్న నిజం ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. అధికార లాంఛనాలతో ఆయన పార్థివదేహానికి గౌతమితీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. తమకు రాజకీయ జన్మనిచ్చిన మాజీ మంత్రి సంగిత ఇక లేరనేనిజాన్ని నమ్మలేకపోతున్నామని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి సోమవారం అర్ధరాత్రి కాకినాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నాలుగు గంటలకు ఆయన స్వగ్రామమైన ఆలమూరు మండలంలోని పినపళ్లకు తరలించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, సహచర మిత్రుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని మధ్యాహ్నం వరకు ఆయన నివాసంలోనే ఉంచారు. మాజీ మంత్రి సంగిత మృతి వార్త తెలుసుకున్న కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా హుటాహుటిన సంగిత నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. కేబినెట్ మంత్రిగా పనిచేసిన సంగితకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, ఎస్పీ జి.విజయ్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, పార్టీ సీఈసీ సభ్యులు రెడ్డి వీరవెంకటసత్యప్రసాద్, జిల్లా కిసాన్ సెల్ కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీహర్షకుమార్, ఏజేవీపీ బుచ్చి మహేశ్వరావు, మాజీ ఎమ్మెల్యేలు గిరజాల వెంకటస్వామినాయుడు, బండారు సత్యానందరావు, డీసీఎంస్ మాజీ చైర్మన్లు రెడ్డి గోవిందరావు, వైఎస్సార్ సీపీ నాయకులు ఎం.మోహన్, జిన్నూరి సాయిబాబా, దూలం వెంకన్నబాబు, సిరంగు శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల రామకృష్ణ, కామన ప్రభాకరరావు, టీవీ సత్యనారాయణరెడ్డి, కపిలేశ్వరపురం సర్పంచ్ ఎంవీఎస్ మునిప్రసాద్, లయన్స్‌క్లబ్ గవర్నర్ కొండూరి మాణిక్యాలరావు తదితరులు మాజీ మంత్రి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పినపళ్ల నుంచి జొన్నాడ వరకుసాగిన అంతిమయాత్ర పినపళ్లలోని సంగిత స్వగృహం నుంచి మొదలైన అంతిమయాత్ర పెదపళ్ల, చింతలూరు, ఆలమూరు, జొన్నాడ మీదుగా సాగింది. ప్రత్యేక వాహనంలో సంగిత పార్థివ దేహాన్ని ఉంచి ఊరేగింపుగా గౌతమి తీరానికి తీసుకువెళ్లారు. రాజమండ్రి ఆర్డీఓ నాన్‌రాజు, రామచ ంద్రపురం డీఎస్పీ డి.రవీంద్రనాథ్‌ల ఆధ్వర్యంలో కాకినాడ నుంచి ప్రత్యేక పోలీసులు బలగాలు గౌతమి తీరానికి చేరుకుని సంగిత భౌతికకాయం వద్ద గౌరవ వందనం చేశారు. అనంతరం మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం సంగిత పెద్ద కుమారుడు గంగరాజు చితికి నిప్పంటించారు. సంగిత అంతిమయాత్రలో భారీ ఎత్తున ఆయన అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి సంగిత అభిమానులు తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
కబళించిన మృత్యువు
ఆలమూరు, న్యూస్లూన్ :రహదారులపై నెత్తుటి మరకలు పడ్డాయి. ఆలమూరు మండలంలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో తం డ్రీకొడుకులు ఉండడంతో వారి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడికి గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు నం ద్యాల ధనకృష్ణ(47), దుర్గాప్రసాద్ కలిసి మోటార్ బైక్‌పై వ్యక్తిగత పని కోసం బడుగువానిలంకకు వచ్చారు. తిరుగు ప్రయాణం లో చెముడులంక డివైడర్ వద్ద మలుపు తిరుగుతుండగా, వీరి బైక్‌ను విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వస్తున్న కారు ఢీకొంది. ధనకృష్ణ అక్కడికక్కడే మరణించగా, దుర్గా ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు లు అతడిని ప్రైవేటు వాహనంపై ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మడికిలో విషాదఛాయలు తండ్రీకొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మడికిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ధనకృష్ణకు ముగ్గురు కుమారులుండగా, దుర్గాప్రసాద్ పెద్దవాడు. తండ్రి వ్యవసాయ కూలీ కాగా, దుర్గాప్రసాద్ రాజమండ్రిలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. సంఘటన స్థలాన్ని వైఎస్సార్ సీపీ కొత్తపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి సందర్శించారు. హైవేలోని చెముడులంక డివైడర్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవే ప్రాజెక్టు డెరైక్టర్ ఎం.నిర్మలతో ఆయన మాట్లాడారు. రెండు రోజుల్లో డివైడర్‌ను పరిశీలిస్తామని పీడీ నిర్మల హామీ ఇచ్చారు. ఆటో ఢీకొని మరొకరు.. ఆలమూరు-మండపేట రోడ్డులో సోమవారం ఆటో ఢీకొని ఓ వ్యక్తి మరణించారు. రాయవరం మండలం పసలపూడికి చెందిన నోచర్ల కిట్టయ్య (30) పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పని కోసం వెళ్లాడు. పని పూర్తయ్యాక మోటార్ బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. స్థానిక టీటీడీ కల్యాణ మండపం సమీపంలోకి వచ్చేసరికి అతడి బైక్‌ను ఆటో ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన అతడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మండపేట సీఐ పీవీ రమణ ఆధ్వర్యంలో ఏఎస్సై ఈ.నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
ఆలమూరు, న్యూస్‌లైన్ : మండలంలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆలమూరు ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ కథనం ప్రకారం ఉప్పల గుప్తం మండలం వాడపర్రుకు చెందిన జొన్నాడ నాగరాజు (35) కొంత కాలంగా రాజానగరం మండలం దివాన్‌చెరువులో నివసిస్తున్నాడు. అక్కడి నుంచి ప్రతిరోజూ ఆలమూరు మండలం జొన్నాడ వచ్చి ఒక హోటల్లో పని చేసి, రాత్రికి తిరిగి దివాన్‌చెరువు వెళుతుంటాడు. గురువారం ఎప్పటిలాగే పని ముగించుకుని తెల్లవారుజామున తన మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా రాజమండ్రి నుంచి రావులపాలెం వస్తున్న లారీ అతడ్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో తిరగబడి.., మండలంలోని నర్సిపూడికి చెందిన ఆటో డ్రైవర్ లంక గంగాధరరావు (34) ఆటో తిరగబడి మృతి చెందాడు. రావులపాలెం నుంచి ప్రయాణికులతో ఆటోలో అతడు బయలు దేరాడు. కొత్తూరు సెంటర్ వచ్చేసరికి ప్రయాణికులు దిగిపోయారు. దీంతో ఇంటికి వెళ్లిపోదామని భావించిన గంగాధరరావు ఆటోలో నర్సిపూడి వెళుతున్నాడు. గుమ్మిలేరు ఓఎన్జీసీ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈప్రమాదంలో గంగాధరరావు ఆక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై విద్యాసాగర్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.