కన్నబిడ్డ జ్ఞాపకాలు పదిలంగా.. పవిత్రంగా | parents install son statue in madiki village | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డ జ్ఞాపకాలు పదిలంగా.. పవిత్రంగా

Published Wed, Dec 30 2015 12:48 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

రాంబాబు దంపతులు కట్టించిన గుడిలో నరేష్ విగ్రహం. (ఇన్‌సెట్‌లో) తండ్రి రాంబాబు

రాంబాబు దంపతులు కట్టించిన గుడిలో నరేష్ విగ్రహం. (ఇన్‌సెట్‌లో) తండ్రి రాంబాబు

కన్నబిడ్డలకు చిన్నగాయమైతేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటి బిడ్డలు చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోతే.. ఇక ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అలాంటి బాధనే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన అత్తిలి రాంబాబు, వీవ వెంకట సత్యవేణి దంపతులు ఎదుర్కొన్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు.
 

గతేడాది పెద్దకుమారుడు నరేశ్ తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు. ‘మా ఆయుష్షు కూడా పోసుకుని బతుకు నాయనా’ అని ఆ తల్లిదండ్రులు పడిన ఆర్తికి ప్రతిఫలం లేకుండాపోయింది. పన్నెండేళ్ల వయసులోనే నరేశ్ తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. తమ ముద్దుల కుమారుడి అకాల మరణం ఆ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసింది.

తమ జ్ఞాపకాల్లో కన్నబిడ్డను చూసుకోవడం కాకుండా.. కన్నబిడ్డ స్మృత్యర్థం ఏదైనా ఉండాలనుకున్నారు. ఓ గుడి కట్టి తమ కుమారుడి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ ఊరికి సమీపంలోని బడుగువానిలంక గ్రామంలో ఉన్న తమ వ్యవసాయ భూమిలోని ఐదు సెంట్లలో ఆరు నెలల కిందట ఓ గుడి కట్టించి, నరేశ్ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement