బాల్యవ్యసనమే ‘బంగారు’ పతకానికి మూలం | gold medal naveen | Sakshi
Sakshi News home page

బాల్యవ్యసనమే ‘బంగారు’ పతకానికి మూలం

Published Sun, Oct 23 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

gold medal naveen

ఆలమూరు :
బడిలో చదువుకునేటప్పుడు ఆటవిడుపు వేళల్లో ఏమీ తోచక రాళ్లు ‘త్రో’ (విసిరిన) చేసిన అలవాటే అతడు జాతీయస్థాయిలో విజేతగా నిలవడానికి మూలమైంది. అతడే జావెలి¯ŒS త్రోలో స్వర్ణపతకం సాధించిన.. ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన నాగిరెడ్డి నవీ¯ŒS. గుజరాత్‌లోని వడోదరాలో జరిగిన పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి, పతకం సాధించి జిల్లాకు పేరుతెచ్చి పెట్టాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ స్థానిక శ్రీషిర్డీసాయి విద్యానికేత¯ŒSలో, ఇంటర్మీడియట్‌ రాజమహేంద్రవరం శ్రీచైతన్య కళాశాలలో  చదివిన నవీ¯ŒS ప్రస్తుతం నరసాపురంలోని శ్రీస్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. నవీ¯ŒS క్రీడాప్రతిభను గుర్తించిన శ్రీషిర్డీసాయి యాజమాన్యం 2012లో రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన జోనల్‌ పోటీలకు పంపింది. సెంట్రల్‌ జో¯ŒS స్థాయిలో జావెలి¯ŒS త్రో విభాగంలో ప్రథమ స్థానం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 
 
సాధనకు విరామమొచ్చినా సాధించాడు..
అయితే ఇంటర్మీడియట్‌లో క్రీడల్లో సాధనకు అవకాశం లేకపోయింది. మళ్లీ ఇంజనీరింగ్‌లో చేరాక సాధనను కొనసాగించాడు. ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యం క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడానికి తోడు స్నేహితులు ప్రోత్సహించడంతో గత మూడేళ్ల నుంచి జావెలి¯ŒS త్రోలో నిర్విరామంగా కఠోరశ్రమతో సాధన చేశాడు. ఈ ఏడాది మేలో ధవళేశ్వరంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో, సెప్టెంబర్‌లో నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్టూడెంట్‌ ఒలింపిక్‌ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. జావెలి¯ŒS త్రోతో పాటు ఒలింపిక్‌ క్రీడల్లో కబడ్డీ పోటీల్లో మడికికి చెందిన విద్యార్థులతో కలిసి  జిల్లాజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది.  
 
జావెలి¯ŒS త్రోలో సత్తా
వడోదరా పోటీల్లో నవీ¯ŒS జావెలి¯ŒS త్రోలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించి, ఈ ఏడాది డిసెంబర్‌లో మలేషియా లేదా శ్రీలంకలో నిర్వహించనున్న ఏసియ¯ŒS స్టూడెంట్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. కబడ్టీ పోటీల్లోనూ నవీ¯ŒS ఏపీ–ఏ తరఫున మెరుగైన ఆట తీరును ప్రదర్శించినా ఆ జట్టు నాకౌట్‌ దశలోనే ఏపీ–బీపై పోరాడి ఓటమి పొందింది. 
 
రాష్ట్రానికి గుర్తింపు తెస్తా..
ఏసియ¯ŒS గేమ్స్‌లో ప్రథమ స్థానం సంపాదించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు నవీ¯ŒS తెలిపాడు. 56 దేశాలు పాల్గొనే ఈ పోటీల్లో రాష్ట్రానికి తగిన గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానన్నాడు. తన తొలి ప్రాధాన్యం జావెలి¯ŒS త్రో, మలి ప్రాధాన్యం కబడ్డీ అని చెప్పాడు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement