పుంగనూరు దూడకు అవార్డుల పంట
Published Tue, Apr 4 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
ఆలమూరు (కొత్తపేట) :
పశు పోషణలో, పాల ఉత్పత్తిలో ప్రఖ్యాతి గాంచిన గుమ్మిలేరు గ్రామానికి పుంగనూరు ఆవు దూడ నాలుగు అవార్డులను తెచ్చిపెట్టింది. అతి తక్కువ ఎత్తుతో పాటు బరువు కలిగి ఉండడంతో భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎంపికైంది. పాడి రైతు రెడ్డి సత్తిబాబుకు చెందిన కపిల ఆవుకు గత నెల 20న పుంగనూరు ఆవు దూడ జన్మించింది. కపిల ఆవు రంగులో పుంగనూరు జాతి ఎత్తులో పుట్టిన ఈ దూడ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ పుంగనూరు దూడ కేవలం 17 అంగుళాల ఎత్తు, 7.4 కేజీల బరువు మాత్రమే కలిగి ఉండడంతో ఈ ఆవు దూడ ప్రత్యేకతపై ప్రపంచ అవార్డుల సాధికారిత అధ్యక్షులు, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్ చింతా శ్యామ్‌కుమార్ (శ్యామ్ జాదూ) దృష్టి సారించారు. గ్రామానికి విచ్చేసి ఆవు దూడ కొలతలను తీసుకుని నాలుగు రికార్డు సంస్థలకు వివరాలను, వీడీయో సీడీలను పంపించారు. అనంతరం ఆసంస్థలు ఆమోదం తెలపడంతో ఐఎస్‌ఓ సర్టిఫికెట్ కలిగిన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్, వర్మ బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్‌లో ఆ పుంగనూరు ఆవుదూడ చోటు సంపాదించుకుంది. దీంతో నాలుగు రికార్డుల సంస్థలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న శ్యామ్ జాదూ మంగళవారం గ్రామానికి విచ్చేసి రైతు సత్తిబాబుకు అవార్డులను అందజేశారు.
Advertisement
Advertisement