
సాక్షి, అనంతపురం క్రైం: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే హతమార్చిన వైనం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి ప్రియుడితో పాటు మహిళనూ అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు... ఆలమూరు గ్రామానికి చెందిన చియ్యేడు రవీంద్ర (40), బోయ విజయలక్ష్మి దంపతులు. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా తమ సమీప బంధువు చియ్యేడు సందీప్‌తో విజయలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో తరచూ కలుసుకునేందుకు భర్త రవీంద్ర అడ్డు వస్తుండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించారు. పథకం ప్రకారం ఈ నెల 3న అర్ధరాత్రి తలదిండుతో రవీంద్రకు ఊపిరి అందకుండా చేసి హతమార్చారు. అనంతరం పాముకాటుతో మృతి చెందినట్లుగా నమ్మించారు. అయితే రవీంద్ర ఊపిరి అందక పోవడంతో చనిపోయాడని, శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లుగా పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం వెలుగు చూసింది. విజయలక్ష్మి, సందీప్‌ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఆదేశం మేరకు ఆదివారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment