♦ న్యాయవృత్తిలో ఉన్నత స్థానాల్లో అక్కాచెల్లెళ్లు
♦ ఆలమూరు ఏఎఫ్‌సీఎం కోర్టు జడ్జిగా చెల్లి దివ్య
♦ న్యాయమూర్తిగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అక్క దీప్తి
అపారమైన పరిజ్ఞానం ఆ అక్కాచెల్లెళ్ల సొంతం. గ్రామీణ ప్రాంతంలోని ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన వారు.. కన్న తల్లిదండ్రుల కలలు నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమించి.. అకుంఠిత దీక్షతో తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఏడాది వ్యవధిలోనే ఇద్దరూ న్యాయవృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. న్యాయవ్యవస్థపై గౌరవాన్ని పెంపొందిస్తామంటున్నారు. ఇంతకీ ఆ అక్కాచెల్లెళ్లు ఎవరు? వారిది ఏ ఊరు? జడ్జిలు కావడానికి కారణాలేంటీ? తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.
– ఆలమూరు(కొత్తపేట)
వీర్ల దివ్య, వీర్ల దీప్తి ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వీరి స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కంచర్లవారిపల్లె. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఆలమూరులోని రాజుగారి దివారణంలో నివసిస్తున్నారు. ఆలమూరు ఏఎఫ్‌సీఎం కోర్టు జడ్జిగా దివ్య ఇటీవల బాధ్యతలు స్వీకరించగా.. ఆమె అక్క దీప్తి 2016లో నిర్వహించిన పోటీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి న్యాయమూర్తిగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరి తండ్రి వీర్ల బ్రహ్మయ్య బీకాం బీఎల్ విద్యను అభ్యసించి వ్యవసాయంపై మక్కువ పెంచుకోగా.. తల్లి రమణమ్మ సమీపంలోని వీరభద్రాపురం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.
ఇ‘లా’ మొదలైంది..
విశాఖపట్నంలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జడ్జి దివ్య ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. అలాగే జడ్జిగా ఎంపికైన దీప్తి హైదరాబాద్‌లోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం చెల్లెలు దివ్యను స్ఫూర్తిగా తీసుకుని మళ్లీ హైదరాబాద్‌లోని కేవీ రంగారెడ్డి లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. వీరిద్దరూ ఆయా లా కళాశాలల్లో క్రిమినల్ లా, టార్ట్స్, ఎకనావిుకల్, హిస్టరీ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి యూనివర్సిటీ స్థాయిలో మెడల్స్, షీల్డ్‌లు, మెమెంటోలు అందుకున్నారు.
సమాజ సేవకు పాటుపడతా
నాన్న బ్రహ్మయ్య స్ఫూర్తితో ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు చిన్ననాటి నుంచే లా చదవాలని, జడ్జిని కావాలనే స్పష్టమైన లక్ష్యం ఉండేది. లా చదివించేందుకు కుటుంబసభ్యులు పడిన కష్టాన్ని దగ్గరుండి చూసిన నాకు జడ్జి కావాలనే కోరిక బలంగా నాటుకుంది. 2014లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశా. 2015 జూ¯ŒSలో నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకుని ప్రిలిమ్స్, మెయి¯Œ్స ఇంటర్యూలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించా. ఆరు నెలల శిక్షణ అనంతరం ఆలమూరు ఏఎఫ్‌సీఎం జడ్జిగా నియామకం పొందా. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సమాజ సేవకు వినియోగిస్తా.
– దివ్య, ఆలమూరు ఏఎఫ్‌సీఎం కోర్టు జడ్జి
అందరికీ సమన్యాయం
కుటుంబ సభ్యులను ప్రేరణగా తీసుకుని తొలుత బీటెక్ పూర్తి చేసి, మళ్లీ లా చదివా. తొలివిడత 2015లో చెల్లి దివ్యతో పాటు జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు సంబంధించి తుది వరకూ పోరాడినా ఇంటర్వూ్యలో ఒక్క మార్కు తేడాతో జడ్జి అవకాశాన్ని కోల్పోయా. మళ్లీ 2016లో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు దరఖాస్తు చేసుకుని మలివిడత ప్రయత్నంలో జడ్జిగా అర్హత సాధించా. వచ్చే నెలలో శిక్షణకు వెళ్లి అనంతరం ప్రజలకు జడ్జిగా సేవలందించనున్నా. అందరికీ సమన్యాయం చేసేందుకు కృషి చేస్తా.
– వి.దీప్తి
మెరిశారి‘లా’..
Published Wed, May 3 2017 12:22 AM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM
Advertisement
Advertisement