రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటీ సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ చెంచు బాలుడు దుర్మరణం చెందాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ డివిజన్‌లోని మర్రిపాలెం చెంచు గూడేనికి చెందిన కుడుముల అంజన్న(15) అదే పేరు గల దాయాది సోదరునితో కలిసి కొత్త పల్లె మండలం గుమ్మడాపురం చెంచు గూడెంలో ఉన్న సోదరిని కలిసేందుకు ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. వేగంగా వెళ్తుండటంతో బైర్లూటీ సమీపంలో వాహనం అదుపు తప్పింది. ఈ ఘటనలో పోతయ్య కుమారుడైన కుడుముల అంజన్న మరణించగా దాయాదైన అంకన్న కుమారుడు అంజన్న తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలిసి ఆత్మకూరు ఎస్‌ఐ రమేష్ కుమార్ సంఘటన స్థలానికెళ్లి పరిశీలించారు. మత దేహాన్ని పోస్టు మార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.