వాహనదారులకు కేంద్రం తీపికబురు | Government extends validity of vehicle documents till June 30 | Sakshi
Sakshi News home page

వాహనదారులకు కేంద్రం తీపికబురు

Published Fri, Mar 26 2021 7:25 PM | Last Updated on Mon, Mar 29 2021 8:45 AM

Government extends validity of vehicle documents till June 30 - Sakshi

వాహనదారులకు కేంద్రం శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు కేంద్రం పెంచింది. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా వాటిని రెన్యువల్ చేసుకోవడంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా గడువును పొడిగించింది. అంటే గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్‌పైరీ అయిన వాటి గడువు 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు కానున్నట్లు పేర్కొంది. గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో తాజాగా గడువు పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. 

చదవండి:

సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement