Fitness Certificate
-
‘ఉపాధి’కి ఇంధనం..
మీలో ఒకడిగా.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’! ఇవన్నీ ఎవరో చెబితేనో.. ఎవరో ఉద్యమాలు చేస్తేనో తీసుకొచ్చినవి కావు. నా 3,648 కి.మీ. పాదయాత్రలో మీ సమస్యలను కళ్లారా చూశా. మీలో ఒకడిగా నాలుగేళ్లుగా మీ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్..’ అంటారు. మీ బిడ్డ పాలనలో ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’ అంటే... తమ కష్టాన్ని చెప్పుకోలేని, తన ఆర్తిని వినిపించలేని పేదల గొంతుకై వాళ్ల తరపున నిలబడుతున్న ప్రభుత్వం మనది. కాబట్టే అట్టడుగున ఉన్న పేదవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా కర్మణా మీ బిడ్డ నమ్మాడు కాబట్టి ఆ దిశగా నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఆటోలు, టాక్సీలను నడిపే డ్రైవర్ సోదరులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సొంతంగా ఆటోలు, టాక్సీలు కలిగి ఉండి వాటిని నడిపే వారికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్తోపాటు ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.పది వేల దాకా ఖర్చవుతోందన్నారు. అంత మొత్తం భరించేందుకు ఇబ్బందిపడే పరిస్థితుల్లో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకే ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ పథకాన్ని తెచ్చినట్లు తెలిపారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం ద్వారా మంచి చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.275.93 కోట్ల వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత ఆర్ధిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. ఐదేళ్లలో రూ.1,301.89 కోట్లు.. ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా రూ.10 వేలు పెడుతున్నాం. ఈ డబ్బు ఎలా వాడతారు? దేనికి వినియోగిస్తారన్నది నేను అడగను. కానీ మీ అందరికి సవినయంగా ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా. మీ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. మీ వాహనంలో ప్రయాణికులు ఉన్నారని, మీకూ కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎంతోమందికి సేవలందిస్తున్న మీకు ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది. ఒక్క ఏడాది కూడా ఈ పథకాన్ని ఆపకుండా ఐదేళ్లలో ఐదు విడతల్లో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సహాయం చేయడం ద్వారా ఒక్క వైఎస్సార్ వాహన మిత్ర ద్వారానే ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లను నేరుగా అందించాం. గడప వద్దకే సంక్షేమం ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలు, రేషన్ కార్డుల దగ్గర నుంచి పెన్షన్ల దాకా, జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలన్నీ ఇంటివద్దకే తీసుకొచ్చి అందిస్తున్నాం. మీ అవసరాలు ఏమిటో జల్లెడ పట్టి మరీ తెలుసుకుని నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా గడపవద్దకే చేర్చుతున్నాం. నా పేద అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదవాలన్న ఆరాటంతో మన గ్రామంలోని ప్రభుత్వ బడికే ఇంగ్లిష్ మీడియం చదువులను తెచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. మీ గ్రామానికే విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉంచాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయడంతోపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, హెచ్‌బీ, కఫం టెస్టులను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతున్నాం. గ్రామ, వార్డు స్ధాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ ఉండేలా చూస్తున్నాం. విత్తనాల నుంచి విక్రయాల దాకా రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తూ ఆర్బీకేలను తీసుకొచ్చాం. రైతన్నలు.. నేతన్నలు.. గంగపుత్రులు రాష్ట్రంలో 52.39 లక్షల మంది రైతన్నల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన ప్రభుత్వంగా వారికి తోడుగా నిలబడుతున్నాం. ఒక్క వైఎస్ఆర్ రైతుభరోసా కోసమే రూ.30,985 కోట్లు ఖర్చు చేశాం. పంటలు వేసే సమయానికి పెట్టుబడి ఖర్చుల కింద రైతన్నల చేతుల్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదని అన్నదాతలకు తెలుసు. వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తూ మత్స్యకార భరోసా ద్వారా 2.43 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో ఏకంగా రూ.538 కోట్లు అందించాం. మగ్గం కదిలితే తప్ప బతుకు బండి నడవని 82 వేల చేనేత కుటుంబాలకు ఐదేళ్లలో ఒక్క నేతన్న నేస్తం పథకం ద్వారానే రూ.982 కోట్లు అందించి అండగా నిలిచాం. తోడు అందిస్తూ.. చేదోడుగా నిలుస్తూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే, పుట్‌ఫాత్‌ల మీద విక్రయాలు సాగించే చిరువ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలను అమలు చేస్తున్నాం. వాళ్లు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారు...? అందుకు పెట్టుబడి ఎక్కడ నుంచి వస్తుంది? ఆ పెట్టుబడి కోసం ఎంతెంత వడ్డీకి డబ్బులు తెస్తున్నారో గతంలో ఎవరూ పట్టించుకోలేదు.అలాంటి 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటివరకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.2956 కోట్లు అందించాం. రజక సోదరులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చి 3.30 లక్షల మందికి ఇప్పటివరకు రూ.927 కోట్లు సాయం అందించాం. అమ్మ ఒడి.. విద్యా దీవెన.. వసతి దీవెన అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మీ బిడ్డ జగనన్న అమ్మఒడి పథకాన్ని తెచ్చాడు. 52 నెలల్లో 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అమ్మఒడి కోసం రూ.26 వేల కోట్లు విడుదల చేశాం. 26.99 లక్షల మంది తల్లులకు వారి పిల్లల పెద్ద చదువుల కోసం విద్యా దీవెన ద్వారా అందించిన సహాయం రూ.11,317 కోట్లు. జగనన్న వసతి దీవెన బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు చెల్లిస్తున్నాం. ఏడాదికి రూ.20 వేలు వరకు అందిస్తూ జగనన్న వసతి దీవెన కోసం రూ.4,275 కోట్లు వెచ్చించాం. అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ... చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు మోసపోయారు. మాట ప్రకారం వారిని ఆదుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తెచ్చి 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు ఇచ్చాం. లేదంటే చంద్రబాబు మోసాలతో 18 శాతం ఉన్న ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్ లోన్స్ 50 శాతం దాటేవి. అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నావడ్డీ కూడా వర్తింపచేసి దాదాపు రూ.5 వేల కోట్లు ఇచ్చి తోడుగా నిలబడ్డాం. 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ.14,129 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా 3.58 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు సాయం అందించాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4.39 లక్షల మంది ఓసీ నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించిన సహాయం రూ.1,257 కోట్లు. 30.76 లక్షలమంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్ధలాలిచ్చాం. ఇప్పటికే 21.32 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తమకు ఇంతగా మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే మరొకటి లేదని నా అక్కచెల్లెమ్మలకు తెలుసు. ఇవన్నీ ఎవరో అడిగితేనో, ఎవరో ఉద్యమాలు చేస్తేనో వచ్చినవి కావు. ఇవన్నీ కూడా మీ బిడ్డ.. మీలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. మీ కష్టాలు, సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. ఇది మీ ప్రభుత్వం కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో మంత్రులు పి.విశ్వరూప్, జోగి రమేశ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వసంత కృష్ణ ప్రసాద్, రక్షణనిధి, కైలే అనిల్ కుమార్లతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జగనన్న అవసరం నేను విజయవాడలో 15 ఏళ్లుగా సీఎన్జీ ఆటో నడుపుతున్నాను. గతంలో ఇక్కడ 4 సీఎన్జీ స్టేషన్లు మాత్రమే ఉండడంతో గ్యాస్ కోసం రోజంతా పడిగాపులు పడేవాళ్లం. ఆటోలకు ఇన్సూరెన్స్‌లు, ఫిట్ నెస్‌లు చేయించుకోవడానికి కూడా కుదిరేది కాదు. పాదయాత్రలో మా స మస్యలు మీకు చెప్పగానే సానుకూలంగా స్పందించారు. మీరు సీఎం అవ్వగానే వాహనమిత్ర పథకం ద్వారా మాకు సాయం చేస్తున్నారు.ఈ విడతతో కలిపి నాకు రూ.50,000 వచ్చాయి. మీ చొరవతో విజయ వా డలో ఉన్న సీఎన్జీ స్టేషన్లు 4 నుంచి 15 అయ్యాయి. కోవిడ్ వల్ల రవాణా రంగం కుదేలైపోతే మానవత్వంతో మాకు 5 నెలల ముందే వాహనమిత్ర సాయం అందించా రు. నా తల్లి 2 నెలలు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే వలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చారు. మా అమ్మ చనిపోయే వరకు రూ. 81 వేలు వచ్చాయి. నా కూతురుకి అమ్మ ఒడి సాయం అందింది. నా కుమారుడికి వసతిదీవెన ద్వారా రూ.20 వేలు, ఇంజినీరింగ్ చదువుకు రూ.2,20,320 వచ్చాయి. మొత్తం నా కుటుంబానికి రూ.3,85,300 లబ్ధి కలిగింది. నా ఆటోకు ఇంధనం ఎంత అవసరమో... ఈ రాష్ట్రానికి జగనన్న కూడా అంతే అవసరం. – వినోద్, ఆటో డ్రైవర్, వాహనమిత్ర లబ్ధిదారుడు, విజయవాడ -
బండి కాదు మొండి ఇది.. సాయంపట్టండి
సిద్దిపేట: డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే వాహనాలు ఏవిధంగా ఉండాలి.. మంచి ఫిట్నెస్తో ఉండాలి.. కానీ, శుక్రవారం డ్రైవింగ్ స్కూల్ వాహనం అంబేడ్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసుల ఎదుటే మొరాయించింది. దీంతో చేసేది ఏమీ లేక ట్రాఫిక్ పోలీసులు వాహనం కొంచెం దూరం వరకు నెట్టి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. ఇది చూసిన పలువురు ఆర్టీఏ అధికారులు ఈ వాహనానికి ఎఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారో అంటూ ముక్కున వెళ్లేశారు. -
'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఒకసారి ఫిట్‌గా ఉన్నాడంటూ జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తారు.. మరుక్షణమే ఫిట్‌గా లేడని ప్రకటిస్తారు. దీంతో టీమిండియా అభిమానులు బుమ్రా విషయంలో బీసీసీఐ వైఖరిని తప్పుబడుతున్నారు. 'కనబడుట లేదు'(#Missing Bumrah) అంటూ ట్విటర్లో ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు అభిమానులు. కేవలం ఐపీఎల్ కోసమే బుమ్రాను అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక చేయడం లేదని.. అటు బుమ్రా కూడా అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బుమ్రా ఫిట్నెస్ విషయమై బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీ నుంచి ఎలాంటి క్లియరెన్స్ రాలేదు. దీంతో బుమ్రా టీమిండియాలోకి ఎప్పుడు వస్తాడనేది చెప్పలేని పరిస్థితి. ఇక బుమ్రా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదు నెలలు దాటిపోయింది. పెళ్లి తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయంతో జట్టుకి దూరమయ్యాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో రెండు టి20 మ్యాచులు ఆడిన గాయం తిరగబెట్టడంతో టి20 ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో తొలుత జస్ప్రిత్ బుమ్రాకి చోటు దక్కలేదు. ఆ తర్వాత కొన్నిరోజులకు బుమ్రా కోలుకున్నాడని, వన్డే సిరీస్‌కి ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది టీమిండియా... మూడు రోజులకు మళ్లీ బుమ్రా కోలుకోలేదంటూ టీమ్ నుంచి తప్పించింది. అటుపై బుమ్రా లేకుండానే టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధమైంది. అయితే బుమ్రా కోలుకుంటున్నాడని ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు ఆడతాడని కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే ప్రకటించాడు. అయితే ఆదివారం బీసీసీఐ ఆసీస్‌తో జరిగే చివరి రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు ఎక్కడా కనిపించలేదు. ఇక ఆసీస్‌తో సిరీస్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్లో అడుగుపెట్టనున్నారు. దీన్నిబట్టి చూస్తే గాయంతో దూరమైన బుమ్రా ఐపీఎల్ 2023 సీజన్లో ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు బుమ్రాని అందుబాటులో ఉంచేందుకు అతనికి రెస్ట్ ఇస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ.. బుమ్రాను ఐపీఎల్లో ఆడడానికి కూడా అనుమతి ఇవ్వకూడదని సగటు అభిమాని అభిప్రాయపడుతున్నాడు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా.. టీమిండియా తరపున మూడు వన్డేలు ఆడేందుకు కూడా ఫిట్‌గా లేని బుమ్రా.. ఒకవేళ ఐపీఎల్లో పాల్గొంటే ముంబై ఇండియన్స్ తరుపున 14 నుంచి 17 మ్యాచుల దాకా ఆడాల్సి ఉంటుంది. మూడు మ్యాచులు ఆడేందుకు లేని ఫిట్నెస్.. ఐపీఎల్లో అన్ని మ్యాచులు ఆడేందుకు ఎలా వస్తుంది? అనేది అంతుచిక్కని ప్రశ్నలా మారింది. బుమ్రా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నాడు.. దేశం కోసం ఆడాల్సింది పోయి డబ్బుల కోసం ఆడుకుంటే నష్టపోయేది అతనే అంటూ కొంతమంది అభిమానులు ఘాటుగా స్పందించారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల కోసం ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్‌ల నుంచి బుమ్రాని తప్పించిన బీసీసీఐ.. అతను ఐపీఎల్లో ఆడకుండా అడ్డుకోగలదా? అంటే సమాధానం మీ అందరికీ తెలిసిందే. చదవండి: 'కోహ్లి ఏంటిది.. తగలరాని చోట తగిలి ఉంటే?' వైస్ కెప్టెన్ హోదా తొలగింపు.. రాహుల్‌పై వేటు! దేశవాళీ క్రికెట్ ఆడితేనే.. #bumrah just before IPL starts :pic.twitter.com/l6l8umPYyI — sri (@sri_verizon) February 13, 2023 Bumrah to play IPL2023 directly now ( CB ) #bumrah #IPL2023 pic.twitter.com/d0STFEq0ba — Nitesh (@Niteshlohmrod) February 20, 2023 #Bumrah undergoing match-simulation workloads at the National Cricket Academy. Hope to see him playing for India soon. #BCCI pic.twitter.com/F3fo04daQw — Mandeep Saharan (@manusaharan) February 17, 2023 misses the major tournament for his country like asia cup, wt20, now BGT... but when it comes to his MI family , he never misses a single match !!! #bumrah #IPL2023 #BGT2023 #country pic.twitter.com/szHqiaUQh3 — Virat kohliiii (@harshit53706385) February 20, 2023 -
వాహనదారులకు భారీ షాక్..ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష!
వాహనదారులకు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని ప్రైవేట్, ప్రభుత్వ వాహనాల యజమానులకు రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష విధిస్తున్నట్లు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్నారు. అదే సమయంలో వాహనాల రాకపోకళ్లు పెరిగి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ - గురుగ్రావ్ మార్గాల్లో 2020లో 347 మంది, 2021లో 10శాతం పెరిగి 389 మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2020లో 375 మంది తీవ్రంగా గాయపడగా.. 2021లో 409 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ఈ వరుస ప్రమాదాల నుంచి వాహనదారుల్ని కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల రోడ్డు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేని వాహనాల్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో "ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది మోటారు వాహనాల (ఎంవీ) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీస్‌లో పేర్కొంది. అందుకే ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు ఢిల్లీ రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరైన ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా వాహనాల్ని నడిపే వాహనదారులకు మొదటి తప్పుకు రూ. 2,000-5,000, రెండవ, మూడవ నేరం కింద రూ.5,000-10,000 జరిమానా విధిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో యజమాని లేదా డ్రైవర్‌కు జైలు శిక్ష విధించే నిబంధన కూడా అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు విడుదల చేసిన నోటీస్‌లో హైలెట్ చేశారు. ఇ-రిక్షాలు, ఇ-కార్ట్స్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం, ఫిటెనెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత నుంచి రోజుకు 50 రూపాయల చొప్పున అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్! -
వాహనదారులకు కేంద్రం తీపికబురు
వాహనదారులకు కేంద్రం శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు కేంద్రం పెంచింది. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా వాటిని రెన్యువల్ చేసుకోవడంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా గడువును పొడిగించింది. అంటే గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్పైరీ అయిన వాటి గడువు 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు కానున్నట్లు పేర్కొంది. గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో తాజాగా గడువు పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. చదవండి: సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భారీ, చిన్నతరహా వాహనాలకు వచ్చే జనవరి 1నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 డిసెంబర్ నుంచి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించినా సాధ్యపడలేదు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా ఈ విధానం అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జనవరి 1నుంచి వాహనానికి ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్ర మోటారు వాహన చట్టం–1989ను సవరించడం ద్వారా ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 డిసెంబర్‌కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 2021 ఏప్రిల్ 1 నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చెల్లుబాటయ్యే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ నెలాఖరు నాటికి ఫాస్టాగ్ స్టిక్కర్లు డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్ లేకపోతే వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయవద్దని రవాణా శాఖకు ఆదేశాలు అందాయి. ఏపీ పరిధిలోని జాతీయ రహదారులపై 42 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 75 శాతం ఫాస్టాగ్ లైన్లు, 25 శాతం డబ్బు చెల్లించేందుకు లైన్లు ఏర్పాటు చేశారు. ఇకపై మొత్తం ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర రహదారులపైనా 16 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలోనూ ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ఖర్చును కేంద్రం 70 శాతం భరిస్తుందని గతంలోనే కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర రహదారులపై ఈటీసీ మార్గాలను ఏర్పాటు చేయనుంది. -
‘ప్రైవేటు’లో ఎస్సై ఫిట్నెస్ సర్టిఫికెట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల్లో వరంగల్ రీజియన్ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించడం వివాదాస్పదమైంది. ఈ పరీక్షలను వరంగల్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉండగా తమ వద్ద తగిన వసతులు, పరికరాలు లేవంటూ ఒక ప్రైవేటు ఆసుపత్రికి బాధ్యత అప్పగించింది. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిబంధనలు అతిక్రమించిన ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను మందలించింది. ఆయా ఎస్సై అభ్యర్థులను తక్షణమే హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి పంపాలని వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి శనివారం ఆదేశించారు. ఇప్పటివరకు ఎంత మంది ఎస్సై అభ్యర్థులకు ప్రైవేటు ఆసుపత్రిలో కంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించారన్న దానిపై ఆయన విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కంటి సామర్థ్యాన్ని గుర్తించే పరికరాలు లేవా? ఒకవేళ లేకుంటే ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కంటి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించేందుకు ఎందుకు అనుమతించారన్న దానిపై డీఎంఈ విచారణ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం కూడా వివరాలు తెప్పించుకుంది. మంత్రికి కూడా పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల దాదాపు 1,200 మంది ఎస్సై పోస్టులకు ఎంపికవగా వారికి ప్రస్తుతం దేహదారుఢ్య, కంటి సామర్థ్య పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థుల్లో ఎవరికైనా కేన్సర్, గుండె జబ్బులుంటే వారిని ఎస్సై పోస్టుకు ఎంపిక చేసే అవకాశాలు తక్కువ. అలాగే దృష్టిలోపాలు ఉన్న వారిని ఎస్సై పోస్టుకు ఏమాత్రం ఎంపిక చేయరు. ఈ పరీక్షలను తప్పనిసరిగా నిర్ణీత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలి. ప్రభుత్వ వైద్యులే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వరంగల్‌లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రి నిర్వాహకులు కావాలనే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. -
ప్రమాదాల వెం‘బడి’
సాక్షి, పార్వతీపురం (విజయనగరం): విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కేవలం రెండ్రోజుల వ్యవధి ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విద్య పేరు చెప్పి రూ.లక్షలు దండుకోవాలన్న ధ్యాస తప్పా విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలన్న ఆలోచన విద్యా సంస్థల యాజమాన్యాలకు లేదన్న విమర్శలున్నాయి. పాఠశాల బస్సుల నిర్వహణలో నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థుల జీవితాలు గాల్లో దీపాలవుతున్నాయి. జిల్లాలో స్కూలు బస్సుల పరిస్థితిని చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు హడలిపోతున్నారు. సీట్లు చిరిగిపోయి, దుమ్ము, ధూళి పేరుకుపోయి, ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో మందులున్నా లేకపోయినా.. ఉన్న మందులు కాస్తా గడువు తేదీ దాటిపోయినా పట్టించుకోకుండా లాభార్జన చూసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో ఇదే పరిస్థితి. డబ్బులు వసూళ్లు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రమాణాలు పాటించడంలో చూపించడం లేదు. వీరికి ఇటు విద్యాశాఖాధికారులు, అటు రవాణా శాఖాధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ లేని కారణంగా ఎన్నోచోట్ల విద్యార్థులు ప్రమాదాలకు గురౌతున్నారు. నిబంధనలివి ► బస్సు సర్వీసు వయసు 15 ఏళ్లకు మించి ఉండరాదు. కచ్చితంగా బస్సుకు బీమా ఉండాలి ► బస్సు ముందు, వెనుక స్కూల్‌బస్సు అని రాసి ఉండాలి. దాని పక్కనే పాఠశాల పిల్లల బొమ్మలు ఉండాలి. ► పిల్లలు ఎక్కడానికి వీలుగా ఫుట్ బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు ఉండాలి ► బస్సు వెనుకవైపు అత్యవసర ద్వారం ఏర్పాటు చేసి చీకట్లో కూడా దాన్ని గుర్తించే విధంగా రేడియం స్టిక్కర్‌ను అంటించాలి. అత్యవసర ద్వారం అని తప్పకుండా రాసి ఉండాలి ► అగ్నిమాపక నిదోధక పరికరాలు, ప్రథమ చికిత్స పరికరాల కిట్ ఏర్పాటు చేసి చికిత్సకు అవసరమైన మందులు అందులో ఉంచాలి. ► బస్సు ముందు తెలుపు, వెనుక ఎరుపు, పక్కన పసుపు రంగుతో కూడిన రేడియం స్టిక్కర్లు అంటించాలి. ► తప్పనిసరిగా వాహనాలకు పరావరణశాఖ అనుమతి ఉండాలి. పాఠశాల బస్సులు 40 కిలోమీటర్ల వేగాన్ని మించి నడుపరాదు. కొత్త వాహనానికి ఇరువైపులా పసుపు రంగు టేపు అతికించాలి. ► బస్సు తలుపు తెరుచుకుని విద్యార్థులు దిగేటప్పుడు వెనుకనుంచి వచ్చే వాహనదారులు గమనించే విధంగా స్టాప్ బోర్డును తలుపుమీద ఏర్పాటు చేయాలి. ► స్టీరింగ్, బ్రేక్, హారన్ కండిషన్లో ఉండాలి. విద్యార్థి కూర్చోవడానికి వీలుగా కుషన్ సీట్లు ఏర్పాటు చేయాలి ► బస్సుకు నలుమూలలా యాంచర్ కలర్ లైట్లు ఏర్పాటు చేయాలి. బస్సులో అత్యవసర ద్వారాలు ఏర్పాటుచేయాలి. డ్రైవర్ నిబంధనలు ► 25 నుంచి 60 ఏళ్ల లోపు ఆరోగ్యవంతుడై ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్సుతో పాటుగా కనీసం 5 ఏళ్ల అనుభం ఉండాలి ► కంటిచూపు స్పష్టంగా ఉంటూ కనీసం 6/2 కంటిచూపు కచ్చితంగా ఉండాలి. డ్రైవర్, క్లీనర్లు యూనిఫాం ధరించాలి. విధుల్లో మద్యం తాగరాదు. ► ఏటా ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకుని బస్సును నడపడానికి అర్హుడేనని డాక్టర్ ధ్రువపత్రం పొందాలి. పాఠశాల ఆవరణలో బస్సు పార్కింగ్ ఏర్పాటు చేయాలి యాజమాన్యాల బాధ్యతలివీ.. ► బస్సు డ్రైవర్, సహాయకుడి ఫొటో, లైసెన్స్ వివరాలను అందరికీ తెలిసేలా బస్సు లోపల బోర్డులో పెట్టించాలి. నిత్యం ప్రయాణించే విద్యార్థుల జాబితాను బస్సులో ఏర్పాటు చేయాలి ► విద్యార్థులను ఎక్కించి, దింపేందుకు ప్రతి బస్సుకు ఒక సహాయకుడిని ఏర్పాటు చేయాలి. రోజూ బస్సు వెళ్లే మార్గాన్ని (రూట్ మ్యాప్) బస్సులో అతికించాలి. తప్పనిసరిగా బస్సులను పాఠశాల ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. ► పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులతో కలసి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి నెల బస్సు పరిస్థితిని సమీక్షించాలి. రోజూ ప్రయాణించే మార్గాన్ని ప్రధానోపాధ్యాయుడు అప్పుడప్పుడు పరిశీలించాలి పాఠశాల ఆటోలు పాటించాల్సినవి.. ► ఆటో మందు, వెనుక భాగంలో పాఠశాల ఆటో అని రాయించాలి. ఆరుగురు విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలి. ఆటో నడిపే డ్రైవర్‌కు ఏఆర్ (ఆటో రిక్షా) రవాణా వాహనం లైసెన్స్ ఉండాలి. ► ఆటోకు రెండువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. పది కిలోమీటర్ల లోపున్న పాఠశాలల పిల్లల్ని మాత్రమే తీసుకెళ్లాలి. అధికారుల బాధ్యతలివి ► వేసవి సెలవులు ప్రారంభం కాగానే బస్సుల తనిఖీపై పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు పంపాలి. పాత బస్సులైతే ఏటా ఒకసారి, కొత్త బస్సులైతే రెండేళ్లకోసారి తనిఖీలు నిర్వహించాలి ► బస్సు కండిషన్‌ను రవాణా శాఖాధికారులు, సిబ్బంది స్వయంగా పరిశీలించాలి. కండిషన్ సరిగా లేకుంటే సమస్యను పరిష్కరించి తీసుకురావాలని సూచించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సు నిర్వహణ ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. అతిక్రమిస్తే కఠిన చర్య ఈ ఏడాది ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల బస్సులను అణువణువూ పరిశీలించాం. డివిజన్ వ్యాప్తంగా 100 బస్సులుండగా వాటిలో 80 బస్సులు ఫిట్నెస్ కోసం వచ్చాయి. కొన్నింటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చాం. కొన్ని బస్సులను మరమ్మతుల నిమిత్తం పంపించాం. బస్సుల ఫిట్మెంట్ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని బస్సులను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని అనుమతించడం లేదు. ఎవరు నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఎంవీఐ,పార్వతీపురం -
మిగిలింది ఆరు రోజులే..
సాక్షి,సిటీబ్యూరో: బడి బస్సుల భద్రతపై ఆర్టీఏ దృష్టి సారించింది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డెక్కే బస్సులను సీజ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. జూన్ 1 నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయనే ఉద్దేశంతో తొలుత హడావిడి చేసినా 12వ తేదీకి వాయిదా పడడంతో పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వాస్తవంగా మే 15 నాటికి అన్ని స్కూల్ బస్సులకు ఫిట్నెస్ గడువు ముగుస్తుంది. ఆ రోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోగా బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయించాలి. అయితే గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు జిల్లాల పరిధిలోని 12 వేలకు పైగా స్కూల్ బస్సుల్లో ఇప్పటి వరకు సుమారు 3700 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 8 వేలకు పైగా బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఇందుకు ఆరు రోజులు మాత్రమే గడువు మిగిలింది ఉంది. ఈ కొద్దిపాటి వ్యవధిలోనే గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో పరీక్షలు నిర్వహించి బడి బస్సుల భద్రతా ప్రమాణాలను నిర్ధారించాల్సి ఉంది. ఆ దిశగా తాము ఇప్పటికే కార్యాచరణ చేపట్టినట్లు రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు లేఖలు రాయడంతో పాటు స్కూల్ బస్సు డ్రైవర్లు, అటెండర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి స్కూల్ యాజమాన్యం బస్సుల ఫిట్‌నెస్‌పై అప్రమత్తంగా ఉండాలని, డ్రైవర్లు, అటెండర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. 12న స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నందున ఆ లోగా ఫిట్నెస్ ధృవీకరణ పొందాల్సి ఉంటుందన్నారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే వాటిని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఈ సారి ఆర్టీఏ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. బస్సులు..భద్రతా ప్రమాణాలు.. ♦ బస్సు పసుపు రంగులో ఉండాలి. రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించే విధంగా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. బస్సులోపలి భాగంలో ఒక పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి.దీనివల్ల లోపల ఉన్న పిల్లలు కూడా డ్రైవర్‌కు కనిపిస్తారు. ♦ బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్), పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలి. ♦ సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నంబర్, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. సీట్ల కిందిభాగంలో బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకొనేందుకు వీలుగా అక్కడక్కడా లోహపు స్తంభాలను అమర్చాలి. ♦ వాహనానికి నాలుగువైపులా పై భాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబ ర్ (గాఢ పసుపు పచ్చని) రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి.పిల్లలు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. ♦ సదరు వాహనం స్కూల్ బస్సు అని తెలిసేలా ముందు భాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్ధులు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) నల్లరంగులో చిత్రించాలి. ఆ చిత్రం కింద ‘‘స్కూల్ బస్సు’’ లేదా ‘‘ కళాశాల బస్సు’’ అని నల్ల రంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి. ♦ బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్ తో ఉండాలి. సైడ్ విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి. సీటింగ్సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు. ♦ ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి. ♦ లోపలికి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకొనేందుకు వీలుగా ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్ ఉండాలి. ♦ బస్సులో ప్రయాణించే విద్యార్థుల పేర్లు, తరగతులు,ఇళ్ల చిరునామాలు, ఎక్కవలసిన, దిగవలసిన వివరాలు బస్సులో ఉండాలి. డ్రైవర్ల అర్హతలు ... ♦ డ్రైవర్ వయస్సు 60ఏళ్లకు మించకుండా ఉండాలి. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్యపట్టికను విధిగా నిర్వహించాలి. ♦ యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకుప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి. ♦ డ్రైవర్‌ను నియమించేందుకు ముందు అతని అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్, తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. ♦ డ్రైవర్‌కు బస్సు డ్రైవింగ్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ♦ డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. పేరెంట్స్ కమిటీ పనితీరు... ♦ బస్సుకు సంబంధించిన బాహ్య పరికరాలు విండ్‌స్క్రీన్, వైపర్స్, లైటింగ్స్ వంటి వాటి మెకానికల్ కండీషన్స్, పనితీరు తెలుసుకొనేందుకు ప్రిన్సిపాల్‌తో కలిసి పేరెంట్స్ కమిటీ ప్రతి నెలా తనిఖీలు చేయాలి. ♦ ఫస్ట్ ఎయిడ్ బాక్సులో మందులు, ఇతరపరికరాలు కూడా తనిఖీ చేయాలి. -
రోడ్డుపైకి ఫిట్‘లెస్’బస్సులు..రైట్‌రైట్
♦ బడి పిల్లలూ జరభద్రం ♦ జిల్లాలో ఫిట్‌లెస్ బస్సులు 800 ♦ తీరుమారని యాజమాన్యాలు ♦ పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం ♦ చోద్యం చూస్తున్న అధికారులు ♦ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఆర్టీఓ సంగారెడ్డి టౌన్: ఫిట్నెస్ లేకుండానే బడి బస్సులు రోడ్డెక్కనున్నాయి. జిల్లాలో సుమారు 800 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందలేదంటే పిల్లల భద్రతపై పాఠశాలల యాజమాన్యాలు ఏ మాత్రం శ్రద్ధ తీసుకుంటున్నాయో అర్థమవుతోంది. వేసవి సెలవులు ముగించుకొని పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పిల్లలు బడిబాట పట్టనున్నారు. బడి బస్సులో పాఠశాలలకు వెళ్లే పిల్లల ప్రాణాలకు భద్రత కనిపించడంలేదు. జిల్లాలోని వందలాది బడి బస్సులు ఫిట్నెస్ లేకుండా నడవబోతుండటమే ఇందుకు కారణం. ఇవన్నీ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడనున్నాయి. ప్రైవేటు పాఠశాలల బస్సులు జిల్లాలో మొత్తం 1,372 ఉండగా ఈ నెల 7 నాటికి 572 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొం దాయి. మిగతా 800 బస్సులు ఫిట్ సర్టిఫికెట్ ఇంకా పొందలేవు. గత సంవత్సరం బడులు ప్రారంభయ్యే నాటికి జిల్లాలో 1,050 ప్రైవేటు స్కూలు బస్సులు ఉండగా 760 మాత్రమే ఫిట్నెస్ పొందాయి. ఫిట్నెస్ లేకుండానే 380 బస్సులు నడిచాయి. ఈసారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. గత అనుభవాల మాటేమిటీ? ♦ ప్రైవేటు పాఠశాల యాజమామాన్యం, డ్రైవరు నిర్లక్ష్యంతో 2014 జూలై 24న వెల్దుర్తి మండలం, మాసాయిపేట వద్ద స్కూలు బస్సును ఢీకొన్న రైలు దుర్ఘటనలో 16 మంది చిన్నారులు బలయ్యారు. అక్కడి తల్లిదండ్రుల్లో ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా వీడడంలేదు. ఇంతటి ఘోరం జరిగినా స్కూల్ యాజమాన్యాలు పిల్లల భద్రతపై దృష్టి సారించకపోవడం గమనార్హం. గతేడాది ‘మచ్చ’తునకలివీ.. ♦ రేగోడ్ మండలం మెడికుంద గ్రామ శివారులో 2015 జూన్ 13న సెయింట్ డాన్ బాస్కో ప్రైవేట్ పాఠశాలకు చెందిన రెండు బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. బడి ప్రారంభం రోజునే ఈ ఘటన చోటుచేసుకుంది. ♦ రవాణా శాఖ అధికారులు బస్సుకు ఫిట్నెస్ సిర్టిఫికెట్ జూన్ 13న ఇచ్చారు. మర్నాడు 14న గజ్వేల్ పరిధి సంగాపూర్ వద్ద బడి బస్సు చక్రం ఊడిపడింది. 75 మంది విద్యార్థులు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. బస్సులో 37 మందిని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉండగా 75 మందిని తీసుకెళ్లారు. తల్లిదంద్రుల బాధ్యత ముఖ్యమే.. బడి బస్సు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది పరిస్థితి. తల్లిద్రండులు కూడా పాఠశాలల బస్సుల భద్రతపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. బస్సుల ఫిట్నెస్ సిర్టిఫికెట్, డ్రైవర్‌కు అనుభవం ఉందా? డ్రైవింగ్ లెసైన్స్ ఉందా? బస్సులో అటెండెంట్ గురించి విచారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు ఫిట్‌నెస్‌లేని స్కూల్ బస్సులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. ఫిట్‌నెస్‌లేని వాహనాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించొద్దని రవాణా అధికారులకు ఆదేశాలు జారి చేసింది. ఫిట్నెస్ లేని బస్సులు, ఇతర వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని, పర్మిట్ రద్దు చేయాలని, సదరు విద్యా సంస్థ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ మంత్రి ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా డ్రైవర్ లెసైన్సును ప్రాథమికంగా మూడు నెలలపాటు రద్దుచేయాలని సూచించారు. ఈ నిబంధనలు ఈ నెల 9 నుంచి అమల్లోకి వచ్చాయి. వేళ్లూనుకున్న దళారి వ్యవస్థ దళారులకు మాకు సంబంధం లేదు. వారిని కార్యాలయంలోకి అనుమతివ్వడం లేదని అధికారులు ఢంకా బజాయించి చెబుతున్నారు. కాని కార్యాలయం ఎదుట ఉన్న దాదాపు 35 దళారుల దుకాణాలు జనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. మరి వారు చేసే పనేంటని అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు. దళారుల దగ్గరకు వెళ్లందే పని కావడం లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవు. అలా చేసిన వారికి మొదట శాఖాపరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇప్పటి వరకు 60 శాతం స్కూలు బస్సులు ఫిట్నెస్ పొందాయి. 20 శాతం బస్సుల కండిషన్ బాగాలేనందున ఫిట్నెస్ ఇవ్వలేదు. మిగతా వారు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ విధిగా పొందాలి. - వెంకటరమణ, ఆర్టిఓ, సంగారెడ్డి దళారి వ్యవస్థను తొలగిస్తేనే మార్పు అధికారులు చెప్పేవన్నీ ఉట్టిమాటలు. దళారులకు, అధికారులకు సంబంధం లేదంటే కార్యాలయం ఎదుట ఉన్న దళారుల దుకాణాలు ఎందుకు ఉన్నాయి. అవి జనాలతో ఎందుకు నిండి ఉంటున్నాయి. దళారుల దగ్గరకు వెళ్లందే పనులు కావడం లేదు. దళారి వ్యవస్థను తొలగిస్తేనే మార్పు వస్తుంది. - వినోద్ కుమార్, సంగారెడ్డి -
బండి కనిపిస్తే బాదుడే..!
♦ ఎన్నడూ లేనట్టుగా తనిఖీల కేలండర్ సిద్ధం చేస్తున్న రవాణా శాఖ ♦ ఖజానాకు రూ.2,900 కోట్లు జమ చేయాలని సర్కారు ఆదేశించటమే కారణం ♦ నిరుటి కంటే రూ.700 కోట్లు అధిక వసూళ్లే లక్ష్యం ♦ చెకింగ్‌లతో వాహనాల నుంచి పిండుకోవాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: లెసైన్సుందా.. ఆర్సీ బుక్కేది.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదా.. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు... ఇదీ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే కురిసే ప్రశ్నల వర్షం. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు రవాణా శాఖ అధికారులు తోడు కానున్నారు. పర్మిట్లు, లైఫ్ ట్యాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్.. ఇలా తనిఖీలతో హోరెత్తించనున్నారు. రవాణాశాఖ అధికారుల తనిఖీల్లేక ఆటోలు, క్యాబ్‌లు, ఇతర భారీ వాహనాల ఆగడాలకు అంతేలేదనే విమర్శలు నిత్యం వినిపిస్తుంటాయి. ఓవర్‌లోడ్, ఫిట్నెస్ లేని వాహనాలు.. భారీ ప్రమాదాలు.. ప్రాణనష్టం.. ఇవే విమర్శలకు కారణం. రవాణా శాఖ అధికారులను ఇప్పుడు ప్రభుత్వమే పరిగెత్తించబోతోంది.. ఎందుకంటే ఆ తనిఖీలతో ఖజానా బరువు పెంచుకోవాలన్నది ప్రభుత్వ ఆరాటం. రవాణా శాఖకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించగా... రూ. 2,216 కోట్లు వసూలు చేసింది. అంతకుముందు ఏడాది వసూళ్లు రూ. 1,864 కోట్లు మాత్రమే. దీనితో పోలిస్తే 2015-16లో 20 శాతం అధికంగా వసూలు కావడంతో... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరుగుదలతో రూ. 2,900 కోట్లు ఖజానాకు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది చాలా పెద్ద లక్ష్యం. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ఆదా యం సాధించిన దాఖలా లేదు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని అధికారులు పేర్కొం టున్నా... తనిఖీలు చేసి పాత ఫీజు లు, బకాయిలు వసూలు చేసైనా లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రోడ్డెక్కిన అధికారులు... గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా తనిఖీల క్యాలెండర్‌నే రూపొందిస్తున్నారు. సంవత్సరం పొడవునా స్పెషల్ డ్రైవ్‌లతో పాటు నిరంతరాయంగా తనిఖీలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్ని మార్గాలూ ఉపయోగించి... సాధారణంగా రవాణా శాఖకు కొత్త వాహనాల లైఫ్‌ట్యాక్స్ ప్రధాన ఆదాయ వనరు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం కార్ల కొనుగోలులో ఢిల్లీ, ముంబైలకు పోటీనిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ట్యాక్స్ రూపంలో ఏకంగా రూ. 1,400 కోట్లు వసూలైంది. మొత్తం ఆదాయంలో మూడొంతులు ఇదే. ఆ సంవత్సరం వాహనాల పెరుగుదల రేటు 12 శాతంగా నమోదైంది. ఈసారి అది కనీసం 14 శాతం ఉన్నా ఆ రూపంలో ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం విధించిన టార్గెట్ కష్టం. దీంతో మిగతా లోటును కచ్చితంగా తనిఖీల రూపంలో వాహనాల నుంచి వసూలు చేయాల్సిన పరిస్థితి. గత సంవత్సరం తనిఖీలతో కేవలం రూ. 150 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఆ మొత్తాన్ని రూ. 500 కోట్లు దాటించాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో చాలా వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించడం లేదు. పర్మిట్ ఫీజు కట్టకుండా తిరుగుతున్న వాహనాలు కూడా ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాల సంఖ్యే ఎక్కువ. ఇలాంటి వాటినన్నింటినీ తిరగదోడి బకాయిలు వసూలు చేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. వెరసి ఎక్కడపడితే అక్క డ తనిఖీలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు రవాణాశాఖ అధికారులు.. తని ఖీలు చేస్తున్న క్రమంలో వాహనదారులూ బహుపరాక్... పన్ను, ఫీజు ఎగవేతలుంటే వెంటనే క్లియర్ చేసుకోండి. కాదంటే పెనాల్టీ రూపంలో రంగు పడుతుంది. -
మీరు మారకుంటే.. నేనే రిజైన్ చేసి వెళ్తా!
కందుకూరు : కందుకూరు రెవెన్యూ డివిజన్లోని 24 మండలాల తహశీల్దార్లు, రేషన్ డీలర్లతో సోమవారం స్థానిక తన కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ మల్లికార్జున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదల బియ్యం విషయంలో ఎందుకు ఇంత గలీజుగా వ్యవహరిస్తున్నారని తహశీల్దార్లు, డీలర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు రెవెన్యూ డివిజన్లోని అవినీతి రాష్ట్రంలో మరెక్కడా ఉండదేమోనని సందేహం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సబ్ కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. ప్రధానంగా ఏ షాపు ఎవరి పేరుపై ఉంది, ఎక్కడ నిర్వహిస్తున్నారు, లెసైన్స్ ఉందా లేదా అనే వివరాలు ఉండాలన్నారు. తప్పనిసరిగా ప్రతి నెలా 5 నుంచి 15వ తేదీ వరకు నిర్దేశించిన సమయాల్లో సరుకులు పంపిణీ చేయాలన్నారు. డీలర్ నిబంధనలు పాటిస్తున్నాడో లేదోనని తహశీల్దార్ ప్రతినెలా ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలని చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే ఎట్టి పరిస్థితులోనూ నిత్యావసరాలు కేటాయించవద్దని తహశీల్దార్లతో పేర్కొన్నారు. కందుకూరులోని 8వ నంబర్ షాపునకు ఇప్పటికీ సరులకు పంపిణీ కాలేదంటూ సంబంధిత తహశీల్దార్‌పై మండిపడ్డారు. రాజీకీయ ఒత్తిళ్తు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పినా వినిపించుకోరా.. అంటూ సబ్ కలెక్టర్ మండిపడ్డారు. సరుకులు మాయమైతే ఎలా.. సరుకులు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి షాపులకు చేరే వరకూ వాహనం వెంటే రూట్ ఆఫీసర్ ఉండాలని, కందుకూరు ప్రాంతంలో రూట్ ఆఫీసర్లే ఉండడం లేదని సబ్ కలెక్టర్ అన్నారు. డీలర్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి మధ్యలోనే రూట్ ఆఫీసర్లు వెళ్లిపోతున్నారని ఆవేదనగా మాట్లాడారు. ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డీలర్లు ఎవ్వరికీ మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ అధికారులు ఎవరైనా మామూళ్ల కోసం ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సొంత ఆలోచనలు, సొంత వ్యవహారాలు ఉంటే ఇప్పటికైనా మానుకోవాలని తహశీల్దార్లకు సబ్ కలెక్టర్ క్లాస్ పీకారు. -
ప్రైవేటు దందా!
- అసిస్టెంట్లదే హవా -ప్రతి ఉద్యోగికీ అనధికార సిబ్బంది - చక్రం తిప్పుతున్న ప్రైవేటు వ్యక్తులు నెల్లూరు (దర్గామిట్ట): రవాణశాఖ కార్యాలయంలో ఎలాంటి పని కావాలన్నా వాహనదారులకు తడిసిమోపెడు ఖర్చు అవుతోంది. ప్రతి సీటు వద్ద ఓ ప్రైవేటు వ్యక్తి చక్రం తిప్పుతున్నాడు. వాహనదారులు కార్యాలయంలో పని కావాలంటే ఆ ఉద్యోగి వ్యవహారాలు చక్కపెడుతున్న ప్రైవేటు వ్యక్తిని క లిసి ప్రసన్నం చేసుకుంటే తప్ప కరుణాకటాక్షాలు వాహనదారులకు లభించని పరిస్థితి నెలకొంది. ఆయా సేవలకు సంబంధించి ధరలు నిర్ణయించి వసూలు చేసే బాధ్యతను కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ అసిస్టెంట్లకు అప్పజెప్పారు. దీంతో కొంత మొత్తాన్నిముందుగానే ప్రైవేటు వ్యక్తులకు చెల్లిస్తే తప్ప పనులు కావడంలేని వాహనదారులు వాపోతున్నారు. సెక్షన్లకు సంబంధించిన ఉద్యోగుల వద్ద తిష్ట వేసుకున్న అసిస్టెంట్లు రోజుకు రూ. లక్షకు పైగానే అనధికార మొత్తాన్ని వసూలు చేస్తున్నారని కార్యాలయ ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. సోమవారం ఓ ఉద్యోగి అసిస్టెంట్ దర్జాగా సీట్లో కూర్చుని ఎంచక్కా కంప్యూటర్లో సేవలు అందించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు వస్తుంటారు. లెసైన్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, వాహనబదిలీ, పన్నులు చెల్లింపు, పర్మిట్లు జారీ తదితర సేవలను రవాణా కార్యాలయంలో నిత్యం జరుగుతుంటాయి. కార్యాలయంలో ఉప రవాణా కమిషన్‌తో పాటు ఆర్టీఓ, మోటారు వాహనాల అధికారులు ఉంటారు. వారితో పాటు కార్యాలయంలో వాహనదారులకు సేవలు అందించేందుకు వివిధ సెక్షన్లలో ఉద్యోగులు ఉంటారు. మ్యాక్సీక్యాబ్‌లు, టెంపోలు, టూరిస్టు పర్మిట్లు, బస్సుల సీసీల తదితర పనులు చక్కబెట్టేందుకు ఓ ఉద్యోగిని నియమించారు. ఈ ఉద్యోగి తన వ్యక్తి గత అసిస్టెంట్‌గా ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని అనధికారికంగా అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బైకులు, కార్లు, నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్, సెకండ్ హ్యాండ్ వాహనాల బదిలీలను ఓ ఉద్యోగి చూస్తుంటారు. ఆయన ఓ అసిస్టెంట్‌ను నియమించుకుని ఆ సెక్షన్‌కు సంబంధించి పనులతో పాటు అనధికార మొత్తాన్ని కూడా వసూలు చేస్తున్నారు. కార్యాలయంలో ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్లు, అధికలోడు వాహనాల రిలీజ్ ఆర్డర్లు, బదిలీలు తదితర పనులు చూస్తుం టారు. ఈయన కూడా ఓ అసిస్టెంట్‌ను నియమించుకుని డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అకౌంట్స్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి కూడా ఓ ప్రైవేటు వ్యక్తి ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. ఆయన రవాణ శాఖ ఉన్నతాధికారితో సత్సంబంధాలు పెట్టుకుని అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగికి రోజుకు పనులు బట్టి రూ.8 వేల నుంచి 12 వేల దాక వస్తాయని వారి అసిస్టెంట్లు చెబుతుండటం గమనార్హం. కాని తమకు మాత్రం రూ. 500 నుంచి వెయ్యి రూపాయిలు మాత్రమే ఇస్తారని చెబుతున్నారు. అసిస్టెంట్లదే హవా.. కార్యాలయంలోకి అసిస్టెంట్లు వచ్చి ఉద్యోగుల సీట్లలో కూర్చుని కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నారని తెలిసినా సంబంధిత ఉన్నతాధికారులు మిన్నకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కార్యాలయ పనివేళల్లోనే దర్జాగా వచ్చి ఉద్యోగులు సీట్లలో కూర్చుంటున్నారు. ఉపరవాణా కమిషనర్ రాష్ట్ర విభజన కమిటీలో సభ్యులుగా ఉండటం, ఆర్టీఓకు గూడూరు బాధ్యతలు అప్పజెప్పడంతో వీరు కార్యాలయంలో అంతంత మాత్రమే ఉంటున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు ఎప్పుడూ కార్యాలయంలోనే ఉంటూ తమ హవా కొనసాగిస్తున్నారు. లావాదేవీలన్నీ సాయంత్రమే ... కార్యాలయంలోకి ఏజెంట్లు నిషేధం ఉన్నా అన్ని వ్యవహారాలు వారి ద్వారానే జరుగుతుంటాయి. వాహనాదారుల దరఖాస్తులు వచ్చినప్పుడు వారి చేతిరాత ఆధారంగా ఏజెంట్‌ను గుర్తించి సంబంధిత పత్రాలను అసిస్టెంట్లు అందజేస్తారు. చలానాలకు సంబంధించి అప్పుడే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి సాయంత్రం మాత్రం ఆపనికి సంబంధించి నిర్ణయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగుల అసిస్టెంట్లకు ఇస్తారు. -
ఉల్లం‘ఘనం’
వారంలో 120 ఫిట్‌లెస్ స్కూల్ బస్సుల స్వాధీనం లెసైన్స్‌లు లేని డ్రైవర్ల చేతికి వాహనాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్కూల్ బస్సులు ఠారెత్తిస్తున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండానే వందల కొద్దీ బస్సులు రోడ్డెక్కేస్తున్నాయి. వారం రోజులుగా ఆర్టీఏ జరిపిన విస్తృత తనిఖీల్లో మొత్తం 150 బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. వాటిలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 120 బస్సులను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం స్పెషల్ డ్రైవ్ పేరుతో స్కూల్ బస్సులకు తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేసే ఆర్టీఏ అధికారులు ఈ ఏడాది ఆ కర్తవ్యాన్ని విస్మరించారు.స్వచ్ఛందంగా వచ్చిన బస్సులకు మాత్రమే తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో విద్యాసంస్థల యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఫిట్నెస్ లేని బస్సులను సైతం పిల్లలను చేరేవేసేందుకు రోడ్డు మీదకు ఎక్కించాయి. దీనిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఆర్టీఏ రంగంలోకి దిగింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్లు ఇందుకోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ వారంలో నిర్వహించిన దాడుల్లో మొత్తం 150 బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు. విండో గ్లాసెస్ లేకపోవడం, రంగు వెలసి పోవడం వంటి చిన్న చిన్న తప్పిదాలకు పాల్పడిన బస్సులపై కొద్ది మొత్తంలో జరిమానా విధించి వదిలివేయగా, తీవ్రమైన తప్పిదాలతో దొరికిన 120 బస్సులను మాత్రం స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు నీళ్లు బడి పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిన పాఠశాలలు తీవ్రమైన నిర్లక్ష్యానికి పాల్పడుతున్నాయి. ఏడాది పాటు ప్రేక్షకపాత్రకే పరిమితమై జూన్ ప్రారంభంతో ఆగమేఘాల మీద తనిఖీలకు దిగిన ఆర్టీఏ అధికారుల తీరు కూడా ఈ నిర్లక్ష్యానికి ఆజ్యంపోస్తోంది. ఫలితంగా మోటారు వాహన చట్టాలకు ఈ బస్సులు పాతరేస్తున్నాయి. పట్టుబడిన వాటిలో ఉల్లంఘనలివీ.. ఫిట్‌లెస్ వాహనాల్లోనే పిల్లలను ఎక్కించుకొని వెళ్తున్నారు. సీట్ల సామర్ధ్యానికి మించి ఒక్కో బస్సులో 10 నుంచి 20 మంది పిల్లలకు ఎక్కువగా ఎక్కిస్తున్నారు. ఈ పిల్లలంతా సీట్లలో కూర్చొనేందుకు అవకాశం లేక నించొని పయనించవలసి రావడం దారుణం. మరో దిగ్భ్రాంతికరమైన అంశం పలువురు డ్రైవర్లు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా దొరికిపోవడం. సాధారణంగా అనుభవజ్ఞులైన డ్రైవర్లు, హెవీ డ్రైవింగ్ లెసైన్స్ కలిగిన వాళ్లు మాత్రమే పిల్లల బస్సులు నడపాలని చట్టం చెబుతుంది. అందుకు విరుద్దంగా తేలికపాటి వాహనాలను నడిపేందుకు మాత్రమే అనుమతి ఉన్న డ్రైవర్లు, కొత్తగా నేర్చుకున్నవాళ్లు ఈ బస్సులు నడపడం గమనార్హం. మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రతి బస్సులో పిల్లలను ఎక్కించేందుకు దించేందుకు అటెండర్ ఉండాలి. కానీ చాలా బస్సులు అలాంటి అటెండర్లు లేకుండానే నడుస్తున్నాయి. అనేక బస్సుల్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు లేవు -
ఆర్టీఏ కార్యాలయంలో దళారుల పెత్తనం
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్ : ఆర్టీఏ కార్యాలయం.. దళారుల నిలయంగా మారింది. అక్కడ పెత్తనమంతా వారిదే. అక్కడ వారు ‘షాడో’ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఓ దళారీ ఏకంగా.. ఎంవీఐ సీటులోనే కూర్చుని, అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు. వీరు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయిస్తున్నారు. మీ వాహనాన్ని ఆర్టీఏ అధికారుల నుంచి విడిపించుకోవాలన్నా, లెసైన్స్.. ఫిట్నెస్ సర్టిఫికెట్.. ఇలా ఏ పని కావాలన్నా ఆ షాడో అధికారి వద్దకు వెళ్లి, అడిగినంత ‘ఫీజు’ ఇచ్చుకుంటే చాలు.. క్షణాలో పనయిపోతుంది. ఈ దళారీని కాదని నేరుగా వెళ్లారో.. అంతే సంగతులు. మీకు ఈ జన్మలో ఆ పని కానట్టే! రకరకాల నిబంధనలు, పత్రాలు, పరీక్షల పేరుతో ఇబ్బందులు పెడతారు. రోజులతరబడి తిప్పించుకుంటారు. చివరికి, ‘ఈ పాట్లన్నీ ఎందుకు..? ఆ ఏజెంటు(షాడో అధికారి)కు ఎంతోకొంత ఇచ్చుకుంటే తేలిగ్గా పనవుతుంది కదా..!’ అనుకుని, మీరంతట మీరే ఆ దళారి వద్దకు వెళతారు. అంటే, ఆ దళారీ లక్ష్యం నెరవేరినట్టే..!! ‘షాడో ఎంవీఐ’..! ఇక్కడ ఇలాంటి చిన్నాచితకా దళారులు ఎంతోమంది ఉన్నారు. వారందరిలో ఓ దళారీ తీరు ప్రత్యేకం. అతడిని ‘దళారీ’ అనేకంటే.. ‘షాడో ఎంవీఐ’ అనడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే, ఆయన నేరుగా ఆర్టీఏ కార్యాలయంలోకి వెళ్లి, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కుర్చీలో కూర్చుంటాడు. ఫైల్స్ చూస్తుంటాడు. ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలిస్తుంటాడు. కార్యాలయంలోని మిగిలి న సిబ్బంది, కిందిస్థాయి అధికారులు కూడా ఆయన ఆదేశాలను పాటిస్తుంటారు..!! ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లను అప్రూవల్ చే స్తుంటారు. అసలు ఎంవీఐ చేయాల్సిన పనులన్నీ ఈ నకిలీ ఎంవీఐ చేస్తుంటాడు. ఇతగాడు రోజుకు వంద వరకు డ్రైవిం గ్ లెసైన్స్‌లను క్లియర్ చేస్తుంటారు. ఒక్కో లెసైన్స్‌కు 300 రూపాయలు పుచ్చుకుంటాడు. ఫిట్నెస్ సర్టిఫికెట్, కొత్త వాహనాలకు నెంబర్, పట్టుకున్న వాహనాన్ని విడిపించేం దుకు.. ఇలా, ప్రతి పనికీ ఈ దళారీ ఓ ‘రేటు’ నిర్ణయిస్తాడు. ఇక్కడ ఇలా ‘షాడో అధికారి’ అన్నీ తానై చేస్తుంటే అసలు అధికారులు ఎక్కడ ఉన్నట్టో...! ఆర్టీఏ ఏం చేస్తున్నట్టో...!! నా దృష్టికి రాలేదు... ‘షాడో అధికారి’ పెత్తనం విషయమై ఆర్టీఏ మోహినిన్ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... ఆ విషయం తన దృష్టికి రాలేదని, కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. -
రాజకీయ ‘చక్ర’బంధం
=ఓ పార్టీ నేత చేతుల్లోనే ట్రావెల్స్ =సమాంతర రవాణాతో ఆర్టీసీకి తూట్లు =నంబర్ ఒకటి... బస్సులు రెండు! సాక్షి, విజయవాడ : విజయవాడంటే రవాణారంగ కేంద్రమే కాదు, ప్రైవేటు బస్సుల హబ్‌గానూ పేరొందింది. రాష్ట్ర, అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుతూ ఆర్టీసీని హైజాక్ చేసి కోట్లకు పడగలెత్తేశారు. ఇక్కడ ట్రావెల్స్ మాఫియా రాజ్యమేలుతోంది. తమకు అడ్డుపడిన రవాణా అధికారులను బదిలీ చేయించడానికి యథేచ్ఛగా తమ రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తారు. ఈ ప్రైవేటు బస్సుల్లో అధికభాగం ఓ రాజకీయ పార్టీ నేత చేతుల్లోనే ఉన్నాయి. ఫలితంగా ఆయన చక్రబంధంలో ఆర్టీసీ కుదేలైంది. నిబంధనలను తోసిరాజని బస్సులను తమ ఇష్టానుసారంగా నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు అనేకం జరిగాయి. జిల్లాలో 498 ప్రైవేటు బస్సులు రిజిస్ట్రేషన్కాగా, ఇతర జిల్లాలో ఇక్కడి బస్సులు మరో 200కు పైగా ఉంటాయని అంచనా. వీటిలో వంద వోల్వా సర్వీసులున్నాయి. ఆర్టీసీని శాసించే విధంగా ఒక్క విజయవాడలోనే దాదాపు 30 ట్రావెల్స్‌కు చెందిన 200కు పైగా ప్రైవేటు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. వైజాగ్ తదితర పట్టణాలకు వోల్వా సర్వీసులను నడుపుతున్నారు. నిత్యం వివిధ పట్టణాలకు విజయవాడ నుంచి వేలాదిమంది వెళుతుంటారు. పండగల సీజన్లో అయితే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఆదాయమే పరమావధిగా అధిక ట్రిప్పులు నడపాలని డ్రైవర్లపై ఒత్తిడి చేస్తుంటారు. పండగల సీజన్లోనైతే ఆదనపు ట్రిప్పులు నడుపుతుంటారు.ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. నంబర్ ఒకటి... బస్సులు రెండు... ప్రైవేటు ట్రావెల్స్‌లో ఎక్కువ మంది నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను పట్టించుకోరు. బస్సుల నంబరు ప్లేట్లను మార్చేయడం, ఒకే నంబరు ప్లేటును రెండు బస్సులకు ఉపయోగించడం వంటి అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలా దొంగ బస్సులను రోడ్డుపై తిప్పుతూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ఒక బస్సుకు ఏడాదికి రూ. లక్షన్నర వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. నంబరు ప్లేట్లను మార్చడం ద్వారా ఆ మొత్తాన్ని మినహాయించుకుంటున్నారు. అలాగే కొన్ని బస్సులను మరమ్మతుల్లో ఉన్నాయని రవాణాశాఖ అధికారులకు చూపించి... ఆచరణలో మాత్రం వాటిని రోడ్లపై తిప్పుతుంటారు. వోల్వో టెక్నాలజీ తెలియని డ్రైవర్లు... ప్రైవేటు వోల్వో బస్సులను పూర్తిస్థాయి శిక్షణ లేని డ్రైవర్లే ఎక్కువగా నడుపుతున్నారు. దీని కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పైగా డ్రైవర్లకు విశ్రాంతి ఇవ్వడంలేదు. అంతే కాకుండా వేగ నియంత్రణ (స్పీడ్ గవర్నెన్స్) పరికరాలు పెట్టకపోవడంతో అతివేగంగా డ్రైవింగ్ చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మూడుగంటల్లో తీసుకెళ్తున్నారంటే ఏస్థాయి వేగంతో వోల్వోలు వెళ్తున్నాయో అర్థమవుతోంది. సౌకర్యాల మాటున ప్రమాదాలు... ఆర్టీసీ తమ నిబంధనలను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడంలేదు. ఈ బలహీనతను ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేటు బస్సులు గమ్యస్థానాలకు త్వరగా తీసుకెళ్తాయి. ఎక్కడంటే అక్కడ ఆపుతారు. నగరాల్లోని ముఖ్యమైన మారుమూల కేంద్రాలకు తీసుకువెళ్తాయి. ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలను ఎదిరించే ధైర్యం అధికారులకు లేకుండా పోయింది. అందుకు కారణం వారంతా అధికార, ప్రతిపక్ష పార్టీల సరసన ఉండటమేనని తెలుస్తుంది.