నగర రోడ్లపై ఈ రిక్షాలు | New modified e-rickshaw launched | Sakshi
Sakshi News home page

నగర రోడ్లపై ఈ రిక్షాలు

Published Tue, Nov 11 2014 12:02 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM

నగర రోడ్లపై ఈ రిక్షాలు - Sakshi

నగర రోడ్లపై ఈ రిక్షాలు

న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నూతనంగా తయారు చేసిన ఈ రిక్షాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక నగరంలో మనుషులు రిక్షాలను లాగే సంస్కృతికి తెరపడింది. ఈ రిక్షాల ద్వారా దళితులు, ముస్లింలు, ఎస్టీలు లబ్ధిపొందుతారని కేంద్ర రోడ్డు -రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయం వద్ద ఈ రిక్షాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.గతనెలలో రోడ్డు రవాణా-హైవే మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఈ రిక్షాలు నగర రోడ్లపై తిరగడానికి అనుమతి ఇచ్చిందని అన్నారు. బ్యాటరీతో నడిచే ఈ రిక్షాలకు డ్రైవింగ్ లెసైన్లను తప్పనిసరి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement